బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య | youth suicide due to not purchase of bike | Sakshi
Sakshi News home page

బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య

Published Fri, Oct 16 2015 12:06 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

youth suicide due to not purchase of bike

హైదరాబాద్ : నగరంలోని మీర్పేట్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న మౌనిష్ ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా మౌనిష్ తల్లిదండ్రులను బైక్ కొనివ్వాలని అడుగుతున్నాడు.

ఆర్ధిక కారణాల వల్ల అతని కుటుంబసభ్యులు అందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిష్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement