నగర శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు.
హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట్ ఉద్యోగనగర్‌కు చెందిన రాములమ్మ(54) శనివారం ఉదయం తన తమ్ముడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా.. బ్లాక్ పల్సర్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.