
పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్ గ్రామంలో అర్థరాత్రి 12 గంటలకు రోడ్డుపై మద్యం తాగుతూ వీరంగం సృష్టిస్తున్న సమయంలో కానిస్టేబుళ్లు వారిని వారించారు. అయితే వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఒక ఎస్‌ఐతో సహా ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.