
హైదరాబాద్: వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి తన భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దాంతో ఆమె అతనికి దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన మీర్‌పేట్‌లో బుధవారం ఉదయం జరిగింది.పరమేష్ అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా అతన్ని గమనిస్తూ వస్తున్న భార్య నాగలక్ష్మి భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. పరమేష్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
భర్తని ఉతికారేసిన భార్య