దళిత యువతిపై దాడి  | Dalit girl assaulted | Sakshi
Sakshi News home page

దళిత యువతిపై దాడి 

Published Mon, Sep 25 2023 3:52 AM | Last Updated on Mon, Sep 25 2023 3:52 AM

Dalit girl assaulted - Sakshi

జక్రాన్‌పల్లి: ప్రేమ పేరుతో దళిత యువతిని వేధించి, హత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జక్రాన్‌పల్లికి చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం రాత్రి ఆమెను బలవంతంగా తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడు.

ఈ క్రమంలో యువతి ప్రతిఘటించి బైక్‌పై నుంచి కిందకు దూకింది. దీంతో ఆగ్రహించిన సదరు యువకుడు మద్యం మత్తులో యువతిని కొట్టి రోడ్డు పక్కన పడేశాడు. ఆమెను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. 

గ్రామంలో ఆందోళన.. 
యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రాత్రి దళిత సంఘాల ప్రతినిధులు, బాధిత యువతి కుటుంబ సభ్యులు గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. జక్రాన్‌పల్లి అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై  తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement