నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నాడు. కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే విషయంపై తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ స్పందించాడు. ''నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 24ఏళ్లు. ఇంకా తను మలేషియాకు చెందిన అమ్మాయి కాదు, తెలుగుమ్మాయే. శీతల్ నాతో పెళ్లికి సిద్ధంగా ఉంది. నిజానికి మొదట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆలోచించుకోమని చాలా సమయం ఇచ్చాను. కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
ఆమె ఫ్యామిలీ కూడా దీనికి ఒప్పుకున్నారు. ఇంకా మాకు పెళ్లి కాలేదు, కానీ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అయినా ప్రేమకు వయసుతో ఏం సంబంధం?ఎవరు, ఏ వయసులో ప్రేమలో పడతారో ఎవ్వరూ చెప్పలేరు’’ అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లి కాగా, కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment