వివాహ రిసెప్షన్‌లో రచ్చ...విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి | First Wife Prevented Second Marriage Reception Without Divorce | Sakshi
Sakshi News home page

భర్త దుర్మార్గం...విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి

Published Tue, Mar 29 2022 8:21 AM | Last Updated on Tue, Mar 29 2022 11:37 AM

First Wife Prevented Second Marriage Reception Without Divorce - Sakshi

అనంతపురం క్రైం: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రెండో వివాహ రిసెప్షన్‌ రచ్చకు దారి తీసింది. విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య రిసెప్షన్‌ను అడ్డుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి దిశ పోలీసుస్టేషన్‌కు పంపారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దూదేకుల నాగరాజుకు అదే జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్‌ బీతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. మనస్పర్థలు రావడంతో ఈ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.  

ఇదిలా  ఉంటే, ఇటీవల నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నట్లు మహబూబ్‌ బీకి తెలిసింది. రామ్‌నగర్‌లో సోమవారం నిర్వహించిన వివాహ రిసెప్షన్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. నాగరాజు కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు బృందం అక్కడికి చేరుకుని మహబూబ్‌ బీకి నచ్చజెప్పారు. దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లమని సూచించారు. దిశ పీఎస్‌లో బాధితురాలికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విడాకుల అంశం కోర్టులో ఉండడంతో తామేం చేయలేమని, కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు. కాగా, మహబూబ్‌బీకి గతంలోనే తాను తలాఖ్‌ ఇచ్చేసినట్లు నాగరాజు చెప్పడం గమనార్హం. 

(చదవండి: ముక్కలు చేసి... మూటకట్టి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement