న్యూఢిల్లీ: ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు చెప్తూ.. ఆయుష్ మంత్రిత్వశాఖ ముస్లింలకు ఉద్యోగాలను ఇవ్వలేదని చెప్పిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. తాను ఆ విషయాన్ని ఆర్టీఐ నుంచి మాత్రమే తీసుకున్నట్లు శర్మ వివరించారు. గత ఏడాది మార్చినెలలో16 నుంచి 31 తేదిల మధ్య సమయంలో మిల్లీ గెజిట్ లో ఈ విషయాన్ని ప్రచురించారు.
ఈ విషయంపై శర్మను విచారించిన కోట్లా ముబారక్పూర్ పోలీసుల దేశాన్ని, ఢిల్లీని వదలి వెళ్లకూడదనే కండీషన్ తో శర్మను విడిచిపెట్టారు. పోలీసులు మిల్లీ గెజిట్ మ్యాగజైన్ ఎడిటర్ డా.జర్ఫారుల్ ఇస్లాం ఖాన్ ను ఈ కేసులో సాక్షిగా పేర్కొన్నారు.