న్యూఢిల్లీ: దేశీయంగా తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను వచ్చే కొద్ది వారాల్లోనే ప్రకటించనున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రభుత్వ అనుకూల విధానాల తోడ్పాటుతో చిప్ పరిశ్రమ వచ్చే 3–4 ఏళ్లలో గణనీయంగా వృద్ధి చెందగలదని సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
పదేళ్ల క్రితం ప్రతి 100 ఫోన్లలో 99 శాతం మొబైల్స్‌ను దిగుమతి చేసుకోగా .. నేడు భారత్‌లో వినియోగిస్తున్న 99 శాతం మొబైల్ ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయని మంత్రి చెప్పారు.
మొబైల్ ఫోన్ల తయారీ లో భారత్ రెండో స్థానంలోనూ, ఎగుమతుల్లో మూడో స్థానంలోనూ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మొబైల్ ఫోన్ల ఎగుమతులు 9.5–10 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలవని వైష్ణవ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సెమీకండక్టర్ల పరిశ్రమకు అనువైన పరిస్థితులను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment