ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెలువడింది. చిత్రమైన ఆలోచనలు, నిర్ణయాలు, విచిత్ర వ్యాఖ్యానాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మస్క్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇదంతా ఉత్తదే అని ఓ రిపోర్ట్ పేర్కొంటోంది.
ఎక్స్ (ట్విటర్)లో ఎలాన్ మస్క్‌కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు అకౌంట్లు ఫేక్ అని, కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని థర్డ్ పార్టీ రీసెర్చర్ ‘ట్రావిస్ బ్రౌన్’ సేకరించిన డేటా ఆధారంగా ‘మ్యాషబుల్’ (Mashable) అనే టెక్ వెబ్‌సైట్ నివేదించింది.
మస్క్‌కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లలో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్లకు పైగా ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. మస్క్‌ను అనుసరిస్తున్న ఒక్కో ఖాతాలకు సగటున ఉన్న ఫాలోవర్లు కేవలం 187 మంది. మస్క్ ఫాలోవర్లలో 0.3 శాతం అంటే 4,53,000 మంది మాత్రమే ఎక్స్ ప్రీమియం (ట్విటర్ బ్లూ) సబ్‌స్క్రైబర్లు. మస్క్ ఫాలోవర్లలో 62.5 మిలియన్ల మంది ఎప్పుడూ అసలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదని రిపోర్ట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment