వైఎస్‌ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ | TDP False Letter In Name Of YS Vijayamma, Goes Viral On Social Media| Sakshi
Sakshi News home page

వైఎస్‌ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ

Published Mon, May 13 2024 3:27 AM | Last Updated on Mon, May 13 2024 12:50 PM

TDP false letter in name of YS Vijayamma

ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిస్పృహతో ఇలాంటి నీచపు పనులు చేస్తున్నారు

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

విశాఖపట్నం: ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిస్పృహతో టీడీపీ నీచపు పనులకు పాల్ప­డుతోందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైఎస్‌ విజయమ్మ రాసినట్టుగా టీడీపీ ఒక లేఖను సృష్టించి.. దాన్ని అడ్డు­పెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బురదజల్లుతోందని తెలిపారు.

ఆ లేఖలో ఉపయోగించిన భాషను చూస్తే అది ఫేక్‌ అన్న సంగతి అందరికీ అర్థం అవుతోందని తెలిపారు. ఓడిపోతున్నామనే ఉక్రోషంతో టీడీపీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ఫేక్‌ ప్రచారాలను ప్రజలు తిప్పి­కొ­డుతున్నారని తెలిపారు. విజ­యమ్మ పేరిట లేఖను సృష్టించి సర్క్యులేట్‌ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement