న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వైకల్య ధ్రువీకరణ పత్రాల వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల నియామకం, శిక్షణ, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)విభాగం అప్రమత్తమైంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ఒకరు ఐఆర్‌ఎస్ అధికారి ఉన్నట్లు సమాచారం.
లగ్జరీ సౌకర్యాల కోసం అతిగా ప్రవర్తించి మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికెట్‌తో పాటు కంటి, మానసిక సంబంధిత సమస్యలపై తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని నిర్ధారించేందుకు నిర్వహించే వైద్య పరీక్షలకు ఖేద్కర్ ఆరుసార్లు గైర్హాజరవ్వడం వంటి వరుస వివాదాలు ఆమె ఐఏఎస్ అభ్యర్థితత్వం రద్దుకు దారి తీసింది. ట్రైనీ ఐఎస్‌ఎస్ అధికారిణి చేసిన తప్పుల్ని గుర్తించిన యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది.
తదుపరి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్ట్ తప్పదేమోనన్న అనుమానంతో ఖేద్కర్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఈ వరుస పరిణామాలతో ఖేద్కర్ విదేశాలకు పారిపోయినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
Puja Khedkar case: Following the row over #IAS probationer #PujaKhedkar, the Department of Personnel and Training (#DoPT) will now scrtutinise the disability certificates of six other civil servants.https://t.co/F4bXZs7rL9
— Business Today (@business_today) August 2, 2024
Comments
Please login to add a commentAdd a comment