సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌కు ఐటీ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారంటూ రోజూ ఏదో ఒక చోట కొందరు రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే, ఈ ఎల్లో బ్యాచ్ ఫేక్ ఐటీ ఉద్యోగులని ఇప్పటికే రుజువైనా.. మళ్లీ మళ్లీ రోడ్ల మీదకు వచ్చి హడావుడి చేస్తున్నారు.
తాజాగా, కొందరు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రోడ్ల మీదకు వచ్చి తాము ఐటీ ఉద్యోగులమని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, వీరి ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో, ఫేక్ ఐటీ బ్యాచ్ ప్లాన్ ఫేయిల్ అయ్యింది. కాగా, టీడీపీ కన్నుసన్నల్లో ఐటీ ఉద్యోగుల నిరసన కొనసాగుతున్నట్టు బట్టబయలైంది. చంద్రబాబుకు మద్దతు అంటూ ఐటీ ఉద్యోగుల పేరుతో కొందరు నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఐటీ ఉద్యోగుల ప్లకార్డులపై ‘ఐటీడీపీ’ సింబల్ కనిపించింది.
కాగా, నిరసనలకు మూడు రోజుల ముందే ఐటీడీపీ వింగ్ కార్యకర్తలను సమన్వయం చేసింది. టీడీపీ నేతలను సమన్వయ పరిచే బాధ్యతలను ఐటీడీపీకి అప్పగించింది. నిరసలు ఎలా చేయాలో ప్లాన్ చేసింది. ఐటీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ సానుభూతిపరులతో ఎల్లో బ్యాచ్ నిరసనలకు ప్లాన్ చేసింది. ఇలా బాబుకు ఐటీ ఉద్యోగుల మద్దతు అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా వీరి బాగోతం బట్టబయలైంది.
ఇది కూడా చదవండి: టీడీపీ, జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్
Comments
Please login to add a commentAdd a comment