డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.
బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పేరుతో స్క్రాచ్ కార్డ్‌లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్‌సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.
ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు.
దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్‌టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment