scratch cards
-
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్‌తో రూ.18 లక్షలు దోపిడీ
డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పేరుతో స్క్రాచ్ కార్డ్‌లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!
భారత్‌లో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) యాప్‌గా గుర్తింపు సంపాదించుకున్న గూగుల్ పే (Google Pay) తాజాగా నెట్టింట భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యాప్ యూజర్లు ట్విట్టర్లో దీనిపై #GPayతో ట్విట్స్ చేస్తూ వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పనికిరాని యాప్ (Use less App) అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ పే అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఎంతలా అంటే ఏకంగా ఈ ట్రోలింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ యాప్ పనికి రాదు అమెరికన్ టెక్ కంపెనీ గూగుల్ ఈ గూగుల్ పే యాప్‌ను 2017లో ప్రారంభించింది. మొదట్లో దీని పేరు తేజ్ యాప్. గూగుల్ పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఈ యాప్ ద్వారా చేసే ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ ఇచ్చేది. మొబైల్ రీఛార్జ్, డీటీహెఛ్ రీఛార్జ్ , విద్యుత్ బిల్లులు ఇలా ఒక్కటేంటి ఆన్‌లైన్‌కి చెల్లింపు వెసలుబాటు ఉన్న ఈ యాప్ ద్వారా యూజర్లు చెల్లించేవాళ్లు. ఈ క్రమంలో కొందరికి మూడు అంకెల నగదు రాగా, ఎక్కువ మంది కస్టమర్లకు కనీసం నగదు అనేది రివార్డ్స్ రూపంలో వచ్చేవి. అయితే రాను రాను ఈ పరిస్థితి కాస్త పూర్తిగా మారింది. కంపెనీ అందులో మార్పులు చేస్తూ నగదు నుంచి డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా వివిధ డీల్స్‌పై డిస్కౌంట్లను ఇస్తుంది. దీంతో ట్విటర్లో దీనిపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. ఓ యూజర్ గూగుల్ పే ఇంతకుముందు ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బును ఇచ్చేదని, కానీ ఇప్పుడు రివార్డ్‌లుగా డిస్కౌంట్లు ఆఫర్లంటూ కార్డులు ఇస్తోందని వాపోయాడు. పలువురు యూజర్లు ట్విటర్ వేదికగా మండిపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. The main reason i shifted to another platforms for payment, pathetic #GPay pic.twitter.com/enJrZixExM — Vikz Karan (@VikzKaran1) November 15, 2022 use less..!!!! #GPay pic.twitter.com/7neORNwXZl — Nirmal Rangdal (@nirmal_rangdal) November 15, 2022 Always shows only this on #GPay full time pass pic.twitter.com/UxccW7khzA — Ketan Gandhi (@Coachketang) November 13, 2022 చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
స్క్రాచ్ కార్డు: అడిగినంత పంపితే కారు నీదే!
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న పది మందిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు బిహార్‌కు చెందినవారు కాగా మిగిలిన ఐదుగురు మంచిర్యాల జిల్లావాసులు. వీరి దగ్గర నుంచి 42 ఫోన్లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు, 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, 2 రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు రూ.2 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత సెప్టెంబర్‌లో దుండగుడు కార్తీక్ అనే పేరుతో ఓ వ్యక్తికి ఫోన్ చేసి అతడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత పోస్ట్ కార్డులో అతడికో స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో మీరు టాటా సఫారీ కారును గెలుచుకున్నారు అని రాసి ఉంది. కానీ కోవిడ్ వల్ల డెలివరీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. దీంతో నిందితుడు డెలివరీ, వివిధ చార్జీల కింద రూ. 45 వేల రూపాయలు పంపించమన్నాడు. బాధితుడు ఆ మత్తాన్ని అతడి ఖాతాలో జమ చేశాడు. అలా విడతల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం 95.45 వేల రూపాయలు జమ చేశాడు. అయినప్పటికీ తనకు ఇంకా డెలివరీ చేయకుండా డబ్బులు అడగటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని కుమార్‌గా గుర్తించారు. అతడు వివిధ ఈ కామర్స్ వెబ్సైట్లు షాప్‌క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, నాప్టాల్ నుంచి పలువురి ఫోన్ నంబర్లు సేకరించాడు. ఇందుకోసం ఆలోక్, తీరాంజు అనే మరో ఇద్దరు నిందితుడికి సహాయం చేశారు. వీళ్లు తరుణ్ కుమార్ మోహిత్‌తో కలిసి గిఫ్ట్ కార్డులు తయారు చేస్తారు. ఈ గిఫ్ట్ కార్డులను స్క్రాచ్ చేసి కార్డుపై ఉన్న నంబర్‌కు కాల్ చేయమని ఉంటుంది. దీంతో కస్టమర్ కాల్ చేసి మాట్లాడిన భాష ప్రకారం టెలీకాలర్స్‌లా మాట్లాడి వారిని సులువుగా నమ్మించి డబ్బులు గుంజుతారు. గిఫ్ట్ పంపకుండా మోసానికి పాల్పడుతారు. ఒక్క సైబరాబాద్‌లోనే ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయని సజ్జనార్ తెలిపారు. చదవండి: ట్రాన్స్జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ -
గూగుల్‌పే స్క్రాచ్ కార్డులతో జర భద్రం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. చేతిలో డబ్బులు లేకపోయిన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదైనా కొనొచ్చు. ఎందుకంటే ప్రతి చోట పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటితో పాటు ఎవరికి డబ్బులు పంపిచాలన్న, వినియోగదారులు బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ నుంచే చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లను ప్రోత్సహించడానికి స్క్రాచ్ కార్డులను కూడా అందిస్తున్నాయి. అయితే వీటిని అడ్డం పెట్టుకొని కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. వారు ఎలా మోసానికి పాల్పడుతున్నారో తెలుపే ఒక వీడియోని తెలంగాణ పోలీసుశాఖ తమ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో మీకు స్క్రాచ్ కార్డు వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి అని చూపెడుతుంది. అలా అక్కడ క్లిక్ చేయగానే మీ అకౌంట్లోకి డబ్బులు రావాల్సింది పోయి మీ అకౌంట్ నుంచే డబ్బులు వారి ఖాతాలోకి జమ అవుతాయి. అందుకే ఇక నుంచి స్క్రాచ్ కార్డులు అవి ఉపయోగించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: పోలీసులే లక్ష్యంగా మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్ -
ఒక్క స్క్రాచ్ కార్డు జీవితాన్ని మార్చేసింది
వర్జీనియా : తల్లితో కలిసి ఒక కొడుకు సరదాగా సరుకుల షాప్‌కు వెళ్లాడు. తల్లి సరుకులు కొనే పనిలో బిజీగా ఉండడంతో ఆ కొడుక్కి ఏం చేయాలో తోచలేదు. దీంతో అదే షాపులో ఒక స్క్రాచ్ కార్డును కొన్నాడు. ఈలోపు తల్లి షాపింగ్ ముగించుకొని వచ్చింది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. తర్వాత తన వెంట తెచ్చకున్న స్క్రాచ్ కార్డును గీకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. స్క్రాచ్కార్డును గీకగానే అందులో ఉన్నది చూసి ఎగిరి గెంతేశాడు. దీంతో వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందంటూ కొడుకును అడిగింది.(పావురానికో గూడు.. భళా ప్రిన్స్!) మనకు లాటరీలో 1.4కోట్ల రూపాయలు వచ్చాయని కొడుకు చెప్పాడు. అయితే కొడుకు చెప్పింది ఆ తల్లి నమ్మలేదు.. స్క్రాచ్ కార్డును ఆమె చేతిలోకి తీసుకొని పరీక్షించింది. దాని మీద అక్షరాల 2,00,000 డాలర్లు గెలుచుకున్నట్లు ఉంది. అంతే ఆ తల్లి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. లాటరీ గెలుచుకున్న వ్యక్తి పేరు హెబర్ట్ స్క్రగ్స్. షాపింగ్ చేసినంత టైంలోనే కోట్లు సంపాదించిన కొడుకును చూసి తల్లి మురిసిపోతుంటే... మిగతావారు మాత్రం వారికొచ్చిన బంపర్ లాటరీని చూసి ఈర్ష్య పడుతున్నారు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాట్లు పూర్తి యూనివర్సిటీ క్యాంపస్: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఎంతోకాలం గా ఎదురుచూస్తున్న విద్యార్థుల ఆశ ఫలి స్తోంది. పలు అడ్డంకుల మధ్య వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. తొలిరోజైన గురువారం 1 నుంచి ఐదువేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థుల పత్రాలను పరిశీలించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వీలుగా స్క్రాచ్ కార్డులు ఇస్తారు. ఈనెల 23 వరకు పత్రాల పరిశీలన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 57 కేంద్రాలు ఇందుకోసం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతిలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తారు. జిల్లాలో 35 కళాశాలలు జిల్లాలో 35 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతిలో 20 కళాశాలలుండగా మిగిలిన ప్రాంతాల్లో 15 ఉన్నాయి. ఇవన్నీ జేఎన్టీయూ అనంతపురంకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల అదనంగా ఉన్నాయి. ఎస్వీ యూనివర్సిటీకి వస్తే కెమికల్ ఇంజనీరింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్స్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ఒక్కొక్క బ్రాంచ్‌లో 40 సీట్లు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక్కో బ్రాంచ్‌లో సీట్లను 60కి పెంచారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 120 సీట్లు, ఈసీఈలో 120 సీట్లు, ఈఈఈలో 60, మెకానికల్‌లో 60 సీట్లు ఉన్నాయి. మిగిలిన 35 కళాశాలల్లో ఈసీఈ, ఈఈఈ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ఒక్కొక్క బ్రాంచ్‌లో 600 సీట్లు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుంటే సుమారు 25 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు 18 వేల వరకు ఉన్నారు. వీరిలో 30 శాతం మంది ఇప్పటికే తమిళనాడు, క ర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. దీని వల్ల ఈ యేడాది కూడా సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు తెచ్చుకోవాల్సినవి ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాల్సి ఉంది. అలానే ఎంసెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, తప్పనిసరిగా కౌన్సెలింగ్‌కు తెచ్చుకోవాలి. ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ఏర్పాట్లు పూర్తి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం నిర్వహించే ధ్రువీకరణపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం 1 నుంచి 5 వేల ర్యాంకుల మధ్య ఉన్నవారి పత్రాలను పరిశీలిస్తాం. ఈ ప్రక్రియ ఈనెల 23 వరకు జరుగుతుంది. విద్యార్థులు ఏ హెల్ప్ లైన్ సెంటర్ కైనా హాజరు కావచ్చు. -ఎల్ఆర్.మోహన్‌కుమార్‌రెడ్డి, కో-ఆర్డినేటర్ -
మొబైల్‌కు వన్‌టైం పాస్వర్డ్!
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై అధికారుల కసరత్తు హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఆప్షన్లకు ప్రత్యామ్నాయం ఆప్షన్లలో కాలేజీల ప్రమేయాన్ని తగ్గించేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే వెబ్ ఆప్షన్లలో వన్ టైం పాస్వర్డ్ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చి ఆప్షన్లు ఇవ్వాలన్న నిబంధనకు ప్రత్యామ్నాయంగా సెల్‌ఫోన్‌కు వన్ టైం పాస్వర్డ్ పంపటంపై అధికారులు దృష్టి సారించారు. విద్యార్థులను మోసగించడం, ప్రలోభపెట్టడం లాంటి అక్రమాలను వన్ టైం పాస్వర్డ్ ద్వారా నివారించవచ్చని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వెబ్ ఆప్షన్ల విధానంపై గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలపై లోతుగా చర్చించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సతీష్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ విజయప్రకాష్, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు పాల్గొన్నారు. మెజారిటీ అధికారులు వన్ టైం పాస్వర్డ్ విధానంవైపే మొగ్గుచూపారు. త్వరలోనే దీనిపై మరోసారి సమావేశమై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. స్క్రాచ్ కార్డుతో ఇబ్బందులు... స్క్రాచ్ కార్డ్‌లోని పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్ ఆప్షన్లు ఇచ్చే విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల వారు విద్యార్థుల పాస్వర్డ్ దొంగిలించడం, విద్యార్థులను దళారులు, యాజమాన్యాలు ప్రలోభపెట్టి తమ కాలేజీల్లో చేరేలా చూడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చి ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు గతంలోనే భావించినా ఇందులోనూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. హెల్ప్‌లైన్ కేంద్రాల కు విద్యార్థులు వచ్చి ఆప్షన్లు ఇవ్వాలంటే అదన ంగా కంప్యూటర్లు కొనుగోలు అవసరం. 3 వేల మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాలి. వారి శిక్షణ, వేతనాలు, కంప్యూటర్ల కొనుగోళ్లకు రూ. 5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఇంటర్నెట్ సెంటర్లలో మోసాలను నిరోధించినా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కైతే విద్యార్థులకు మరింత ఎక్కువ నష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా వన్ టైం పాస్వర్డ్ విధానం మేలని నిర్ణయించారు. ఇదీ ‘వన్ టైం పాస్వర్డ్’ ఆప్షన్లు ఇచ్చే సమయంలో లాగిన్ కాగానే విద్యార్థి మొబైల్ నెంబరుకు పాస్వర్డ్ వస్తుంది. ఆ నెంబరును ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్వర్డ్ 10 నిమిషాల పాటు(ఎంత సమయం అనేది తరువాత నిర్ణయిస్తారు.) చెల్లుతుంది. ఆ సమయంలో ఆప్షన్లు ఇవ్వాలి. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. అనంతరం లాగ్ అవుట్ కావచ్చు. మళ్లీ లాగిన్ అయితే మరో పాస్వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఇంటర్నెట్ సెంటర్లు , దళారుల మోసాలను నివారించవచ్చు. ఏదైనా మోసం జరిగినా, ప్రలోభాలకు గురిచేసినా విద్యార్థి అనంతరం మళ్లీ లాగిన్ అయి మరో పాస్‌వర్డ్‌తో మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. 14 రోజుల్లో ఈ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. చివరి రోజున విద్యార్థి మరోసారి ఆప్షన్లను చూసుకొని మార్పు చేసుకొని ఫైనల్‌గా సబ్మిట్ చేయవచ్చు. ఓటీపీపై విసృ్తత ప్రచారం: వేణుగోపాల్‌రెడ్డి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లలో వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానంపై విసృ్తత ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనిపై విద్యార్థులకు ఎస్ఎంఎస్లు పంపడంతోపాటు ఈ మెయిల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఎంసెట్ పరీక్ష రోజున ఓటీపీ విధానం, వినియోగంపై కరపత్రాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తామని వివరించారు. ఏ విధానంలోనైనా తప్పిదాలను పూర్తిగా నివారించలేనందున మోసాలు, ప్రలోభాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వేణుగోపాల్‌రెడ్డికి విశిష్టరత్న అవార్డు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డిని చిత్తూరు జిల్లా సెంటినరీ విశిష్టరత్న అవార్డు-2013కు ఎంపిక చేసినట్లు అకాడమీ ఆఫ్ గ్రాస్రూట్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1న చిత్తూరులో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు అకాడమీ డెరైక్టర్ సుందర్‌రామ్ పేర్కొన్నారు. -
ప్రశాంతంగా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
కర్నూలు (ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం సాగుతున్నా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ఎలాంటి అంతరాయం లేదు. రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్లో శనివారం 326 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించి వారికి స్క్రాచ్‌కార్డులు అందజేశారు. ఒకటో ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. సెంటర్ కోఆర్డినేటర్ సంజీవరావు పర్యవేక్షణలో ఆర్యూ ఆచార్యులు, అధ్యాపకులు ఆచార్య చక్రవర్తి, డాక్టర్ ఎన్. నరసింహులు, డాక్టర్ డి.వి.శేషయ్య, డాక్టర్ గీతానాథ్, జి.సురేంద్రబాబు, డాక్టర్ ఎం. రవిశంకర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల అధికారులు, ఉద్యోగులు జె. రవికుమార్, నాగలక్ష్మి, మహేశ్వర సింగ్, ధనుంజయ, వి. రాఘవేంద్ర, ఎ.ఎం.ప్రసాద్, అఫ్జల్ఖాన్ ధృవపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. వీసీ కృష్ణానాయక్ కౌన్సిలింగ్‌ను పరిశీలించారు. ఆదివారం 80 వేల నుంచి 90 వేల ర్యాంకుల వారికి మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందని కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ సంజీవరావు తెలిపారు. తాలుకా సీఐ వీవీ నాయుడు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.