మొబైల్‌కు వన్‌టైం పాస్‌వర్డ్! | one time password to mobile | Sakshi
Sakshi News home page

మొబైల్‌కు వన్‌టైం పాస్‌వర్డ్!

Published Fri, Mar 14 2014 1:30 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

మొబైల్‌కు వన్‌టైం పాస్‌వర్డ్! - Sakshi

మొబైల్‌కు వన్‌టైం పాస్‌వర్డ్!

 ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై అధికారుల కసరత్తు
  హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఆప్షన్లకు ప్రత్యామ్నాయం
 ఆప్షన్లలో కాలేజీల ప్రమేయాన్ని తగ్గించేలా చర్యలు
 
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే వెబ్ ఆప్షన్లలో వన్ టైం పాస్‌వర్డ్ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చి ఆప్షన్లు ఇవ్వాలన్న నిబంధనకు ప్రత్యామ్నాయంగా సెల్‌ఫోన్‌కు వన్  టైం పాస్‌వర్డ్ పంపటంపై అధికారులు దృష్టి సారించారు. విద్యార్థులను మోసగించడం, ప్రలోభపెట్టడం లాంటి అక్రమాలను వన్ టైం పాస్‌వర్డ్ ద్వారా నివారించవచ్చని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వెబ్ ఆప్షన్ల విధానంపై గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలపై లోతుగా చర్చించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సతీష్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ విజయప్రకాష్, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు పాల్గొన్నారు. మెజారిటీ అధికారులు వన్ టైం పాస్‌వర్డ్ విధానంవైపే మొగ్గుచూపారు. త్వరలోనే దీనిపై మరోసారి సమావేశమై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
 
 స్క్రాచ్ కార్డుతో ఇబ్బందులు...
 స్క్రాచ్ కార్డ్‌లోని పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్ ఆప్షన్లు ఇచ్చే విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల వారు విద్యార్థుల పాస్‌వర్డ్ దొంగిలించడం, విద్యార్థులను దళారులు, యాజమాన్యాలు ప్రలోభపెట్టి తమ కాలేజీల్లో చేరేలా చూడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చి ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు గతంలోనే భావించినా ఇందులోనూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. హెల్ప్‌లైన్ కేంద్రాల కు విద్యార్థులు వచ్చి ఆప్షన్లు ఇవ్వాలంటే అదన ంగా కంప్యూటర్లు కొనుగోలు అవసరం. 3 వేల మంది వరకు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించాలి. వారి శిక్షణ, వేతనాలు, కంప్యూటర్ల కొనుగోళ్లకు రూ. 5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఇంటర్నెట్ సెంటర్లలో మోసాలను నిరోధించినా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కైతే విద్యార్థులకు మరింత ఎక్కువ నష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా వన్ టైం పాస్‌వర్డ్ విధానం మేలని నిర్ణయించారు.
 
 ఇదీ ‘వన్ టైం పాస్‌వర్డ్’
  ఆప్షన్లు ఇచ్చే సమయంలో లాగిన్ కాగానే విద్యార్థి మొబైల్ నెంబరుకు పాస్‌వర్డ్ వస్తుంది. ఆ నెంబరును ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
  ఆ పాస్‌వర్డ్ 10 నిమిషాల పాటు(ఎంత సమయం అనేది తరువాత నిర్ణయిస్తారు.) చెల్లుతుంది. ఆ సమయంలో ఆప్షన్లు ఇవ్వాలి.
 
  నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. అనంతరం లాగ్ అవుట్ కావచ్చు.
 
  మళ్లీ లాగిన్ అయితే మరో  పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవచ్చు.
 
  ఇంటర్నెట్ సెంటర్లు , దళారుల మోసాలను నివారించవచ్చు.
 
  ఏదైనా మోసం జరిగినా, ప్రలోభాలకు గురిచేసినా విద్యార్థి అనంతరం మళ్లీ లాగిన్ అయి మరో పాస్‌వర్డ్‌తో మళ్లీ మార్పులు చేసుకోవచ్చు.
 
  14 రోజుల్లో ఈ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. చివరి రోజున విద్యార్థి మరోసారి ఆప్షన్లను చూసుకొని మార్పు చేసుకొని ఫైనల్‌గా సబ్మిట్ చేయవచ్చు.
 
 ఓటీపీపై విసృ్తత ప్రచారం: వేణుగోపాల్‌రెడ్డి
 ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లలో వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) విధానంపై విసృ్తత ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనిపై విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌లు పంపడంతోపాటు ఈ మెయిల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఎంసెట్ పరీక్ష రోజున ఓటీపీ విధానం, వినియోగంపై కరపత్రాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తామని వివరించారు. ఏ విధానంలోనైనా తప్పిదాలను పూర్తిగా నివారించలేనందున మోసాలు, ప్రలోభాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
 
 వేణుగోపాల్‌రెడ్డికి విశిష్టరత్న అవార్డు
 ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డిని చిత్తూరు జిల్లా సెంటినరీ విశిష్టరత్న అవార్డు-2013కు ఎంపిక చేసినట్లు అకాడమీ ఆఫ్ గ్రాస్‌రూట్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1న చిత్తూరులో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు అకాడమీ డెరైక్టర్ సుందర్‌రామ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement