నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ | EAMCET counseling from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

Published Thu, Aug 7 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

  •      జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు
  •      ఏర్పాట్లు పూర్తి
  • యూనివర్సిటీ క్యాంపస్: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఎంతోకాలం గా ఎదురుచూస్తున్న విద్యార్థుల ఆశ ఫలి స్తోంది. పలు అడ్డంకుల మధ్య వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు.

    తొలిరోజైన గురువారం 1 నుంచి ఐదువేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థుల పత్రాలను పరిశీలించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వీలుగా స్క్రాచ్ కార్డులు ఇస్తారు. ఈనెల 23 వరకు పత్రాల పరిశీలన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 57 కేంద్రాలు ఇందుకోసం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతిలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తారు.
     
    జిల్లాలో 35 కళాశాలలు

     
    జిల్లాలో 35 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతిలో 20 కళాశాలలుండగా మిగిలిన ప్రాంతాల్లో 15 ఉన్నాయి. ఇవన్నీ జేఎన్‌టీయూ అనంతపురంకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల అదనంగా ఉన్నాయి. ఎస్వీ యూనివర్సిటీకి వస్తే కెమికల్ ఇంజనీరింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్స్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ఒక్కొక్క బ్రాంచ్‌లో 40 సీట్లు ఉన్నాయి.

    ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక్కో బ్రాంచ్‌లో సీట్లను 60కి పెంచారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 120 సీట్లు, ఈసీఈలో 120 సీట్లు, ఈఈఈలో 60, మెకానికల్‌లో 60 సీట్లు ఉన్నాయి. మిగిలిన 35 కళాశాలల్లో ఈసీఈ, ఈఈఈ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లున్నాయి.

    వీటిలో ఒక్కొక్క  బ్రాంచ్‌లో 600 సీట్లు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుంటే సుమారు 25 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు 18 వేల వరకు ఉన్నారు. వీరిలో 30 శాతం మంది ఇప్పటికే తమిళనాడు, క ర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. దీని వల్ల ఈ యేడాది కూడా సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది.
     
    విద్యార్థులు తెచ్చుకోవాల్సినవి
     
    ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, కుల  ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాల్సి ఉంది. అలానే ఎంసెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, తప్పనిసరిగా కౌన్సెలింగ్‌కు తెచ్చుకోవాలి. ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి.
     
    ఏర్పాట్లు పూర్తి
     
    ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం నిర్వహించే ధ్రువీకరణపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం 1 నుంచి 5 వేల ర్యాంకుల మధ్య ఉన్నవారి పత్రాలను పరిశీలిస్తాం. ఈ ప్రక్రియ ఈనెల 23 వరకు జరుగుతుంది. విద్యార్థులు ఏ హెల్ప్ లైన్ సెంటర్ కైనా హాజరు కావచ్చు.
     -ఎల్‌ఆర్.మోహన్‌కుమార్‌రెడ్డి, కో-ఆర్డినేటర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement