కర్నూలు (ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం సాగుతున్నా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ఎలాంటి అంతరాయం లేదు. రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో శనివారం 326 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించి వారికి స్క్రాచ్‌కార్డులు అందజేశారు. ఒకటో ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు.
సెంటర్ కోఆర్డినేటర్ సంజీవరావు పర్యవేక్షణలో ఆర్‌యూ ఆచార్యులు, అధ్యాపకులు ఆచార్య చక్రవర్తి, డాక్టర్ ఎన్. నరసింహులు, డాక్టర్ డి.వి.శేషయ్య, డాక్టర్ గీతానాథ్, జి.సురేంద్రబాబు, డాక్టర్ ఎం. రవిశంకర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల అధికారులు, ఉద్యోగులు జె. రవికుమార్, నాగలక్ష్మి, మహేశ్వర సింగ్, ధనుంజయ, వి. రాఘవేంద్ర, ఎ.ఎం.ప్రసాద్, అఫ్జల్‌ఖాన్ ధృవపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. వీసీ కృష్ణానాయక్ కౌన్సిలింగ్‌ను పరిశీలించారు. ఆదివారం 80 వేల నుంచి 90 వేల ర్యాంకుల వారికి మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందని కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ సంజీవరావు తెలిపారు. తాలుకా సీఐ వీవీ నాయుడు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ప్రశాంతంగా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
Published Sun, Aug 25 2013 6:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement