న్యూఢిల్లీ: యూపీఐ మ్యూచువల్ ఫండ్ బంపర్ ఆఫర్ స్కీమ్ అందిస్తున్నట్లు ఇన్‌స్టెంట్ మెసేజింగ్ టూల్–టెలిగ్రామ్‌పై నడుస్తున్న ప్రచారం పట్ల మదుపరులు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచింది. అలాంటి ఆఫర్ లేదా ఉత్పత్తి ఏదీ కూడా యుటీఐ మ్యూచువల్ ఫండ్ అందించడం లేదా విక్రయించడం లేదని స్పష్టం చేసింది. ‘‘అద్భుతమైన రాబడులు అని చెప్పి మదుపరులను మోసగించేందుకు కొంతమంది చేస్తోన్న మోసపూరిత ప్రక్రియ ఇది.
ఎలాంటి సందర్భంలోనూ యుటీఐ మ్యూచువల్ ఫండ్ అలాంటి రాబడులు వస్తాయనే హామీ ఇవ్వదు’’అని యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా తప్పు దోవ పట్టించే, తప్పుడు ఆఫర్‌ల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యుటీ ఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి సంబంధిత అధీకృత పోర్టల్ నుంచి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది.
చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్!
Comments
Please login to add a commentAdd a comment