పూజా ఖేద్కర్‌కు UPSC షాక్‌.. అభ్యర్థిత్వం రద్దు | UPSC Cancel Candidature Of Trainee IAS Officer Puja Khedkar, Files Criminal Case | Sakshi
Sakshi News home page

పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్‌.. అభ్యర్థిత్వం రద్దు.. మళ్లీ పరీక్ష రాయకుండా బ్యాన్‌

Published Fri, Jul 19 2024 2:43 PM | Last Updated on Fri, Jul 19 2024 3:48 PM

Upsc Cancel Candidature Of Trainee Ias Officer Puja Khedkar

వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) షాకిచ్చింది. నకిలీ దృవీకరణ పత్రాలు సమర్పించారని తేలడంతో యూపీఎస్సీ  ఆమె ఐఏఎస్‌ సెలక్షన్‌ను క్యాన్సిల్‌ చేస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయడంతో పాటు భవిష్యత్‌లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పాల్గొనకుండా డీబార్‌ చేసింది. 

శుక్రవారం (జులై 19) యూపీఎస్సీ కమిషన్‌ పూజా ఖేద్కర్‌ వివాదంపై అధికారికంగా స్పందించింది. యూపీఎస్సీ నిర్వహించిన విచారణలో సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2022 లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా మనోరమ దిలీప్‌ ఖేద్కర్‌ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారు.

సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫొటోలు,సంతకాలు, ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్‌, ఇంటి అడ్రస్‌తో పాటు ఇతర వివరాలన్నీ తప్పుడు ధృవీకరణ పత్రాలను అందించినట్లు తమ విచారణలో తేలిందని యూపీఎస్సీ అధికారికంగా ప్రకటిస్తూ మీడియోకు ఓ నోట్‌ను విడుదల చేసింది.

ఆ నోట్‌లో మోసపూరిత కార్యకాలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేద్కర్‌పై అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2022 నిబంధనల ప్రకారం.. భవిష్యత్‌లో యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా, అభ్యర్ధిత్వాన్ని ప్రకటించకుండా డీబార్‌ చేసినట్లు పేర్కొంది.   

పరీక్షల్లో మోసపూరితంగా వ్యవహరించడంతో పూజా ఖేద్కర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆమెపై క్రిమినల్‌ కేసులు పెట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement