సాక్షి, తూర్పుగోదావరి: అమరావతి రైతులది ఫేక్ పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని, మధ్యలోనే ఆగిపోతుందన్నారు. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు. గత 40 రోజులుగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అమరావతి పాదయాత్ర చేశారని విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు విరామం తాత్కాలికం కాదని, శాశ్వత విరామమని వ్యాఖ్యానించారు.
టెంపుల్స్‌కు వెళ్లాల్సిన యాత్ర నియోజకవర్గాల నుంచి ఎందుకు వెళుతుందని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతి యాత్ర రాజకీయా పాదయాత్రగా తయారయిందని దుయ్యబట్టారు. ‘తెలుగుదేశం, జనసేన నాయకులు కలిపి చేస్తున్న పాదయాత్ర. ఒళ్లు బలిసిన వాళ్ల పాదయాత్ర. అరసవల్లి సూర్యదేవాలయానికి వెళ్లే అర్హత మీకు లేదు. పాదయాత్రలో ఉన్నవాళ్లంతా రైతులు కాదు... దోపిడీ దొంగలు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు లాంటివాళ్లు’ అని మంత్రి మండిపడ్డారు.
చదవండి: అమరావతి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment