padhayathra
-
‘పాదయాత్ర రద్దుపై విచారణ.. అవసరమైతే పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం’
సాక్షి, అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్ర రద్దుతోపాటు దాఖలైన అన్ని పిటిషన్లపై శుక్రవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. పాదయాత్రపై తమ ఆదేశాలను పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పాదయాత్రలో అనుమతించిన 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు పేర్కొంది. పాదయాత్రపై విచారణ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్లో 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు పార్టీలుగా చేర్చారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్‌తో కోర్టుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. తమ ప్రాంత ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారన్న అమర్నాథ్.. వారి మనోభావాలను కోర్టుముందు ఉంచటానికే వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల ఆకాంక్షలు మేం చెప్పకుండా ఎలా ఉంటాం. శుక్రవారం మధ్యాహ్నం వాదనలు వింటామని కోర్టు చెప్పింది. అవసరమైతే ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం. కోర్టు ఆదేశాల తరువాత పోలీసులు పాదయాత్రను పరిశీలిస్తే 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవు. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం. కాని అమరావతి రైతులు మాత్రం మేమే బాగుపడాలని అంటున్నారు. రెచ్చగొట్టేలా ఏ పని చేయవద్దని మేం అంటున్నాం.’ అని వ్యాఖ్యానించారు. చదవండి: సీఎం జగన్ సామాజిక సాధికారతకు న్యాయం చేశారు -
ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర: మంత్రి అంబటి
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతి రైతులది ఫేక్ పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని, మధ్యలోనే ఆగిపోతుందన్నారు. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు. గత 40 రోజులుగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అమరావతి పాదయాత్ర చేశారని విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు విరామం తాత్కాలికం కాదని, శాశ్వత విరామమని వ్యాఖ్యానించారు. టెంపుల్స్‌కు వెళ్లాల్సిన యాత్ర నియోజకవర్గాల నుంచి ఎందుకు వెళుతుందని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతి యాత్ర రాజకీయా పాదయాత్రగా తయారయిందని దుయ్యబట్టారు. ‘తెలుగుదేశం, జనసేన నాయకులు కలిపి చేస్తున్న పాదయాత్ర. ఒళ్లు బలిసిన వాళ్ల పాదయాత్ర. అరసవల్లి సూర్యదేవాలయానికి వెళ్లే అర్హత మీకు లేదు. పాదయాత్రలో ఉన్నవాళ్లంతా రైతులు కాదు... దోపిడీ దొంగలు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు లాంటివాళ్లు’ అని మంత్రి మండిపడ్డారు. చదవండి: అమరావతి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ -
ఆత్మహత్యలు ఆగాలి .. అభివృద్ధి జరగాలి
చింతపల్లి: ‘రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగాలి.. అభివృద్ధి జరగాలి. రాజన్న రాజ్యం రావాలి..’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. ఉద్యమకారులను నమ్మి అధికారం ఇస్తే నట్టేట ముంచారని విమర్శించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని సమైక్యనగర్ కాలనీ, కుర్రంపల్లి ఎక్స్‌రోడ్డు, సాయిరెడ్డిగూడెం, మోద్గుల మల్లేపల్లి, పి.కె. మల్లేపల్లి, కిష్టరాయినిపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా పి.కె.మల్లేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. ధాన్యం కొనకపోవడంతో రైతుల్లో ఆందోళన రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేదని, ఇప్పుడు చేసినా అధిక వడ్డీకే సరిపోని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వరికోతలు నడుస్తున్నా ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని, అసలు కొంటారో..కొనరో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని బార్ల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల వృత్తులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మాట ముచ్చటలో భాగంగా పలువురు మహిళలు వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పడం తప్ప ఎవరికీ ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, సురేష్‌రెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు. షర్మిలను కలిసిన విజయమ్మ పాదయాత్రలో ఉన్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిశారు. బుధవారం మధ్యాహ్నం మోద్గుల మల్లేపల్లి గ్రామానికి చేరుకున్న విజయమ్మ సుమారు మూడు గంటల పాటు ఆమెతో ఉన్నారు. -
24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్/దూద్‌బౌలి: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా పేరును ఖరారు చేశారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ సీనియర్ నేతలతో కలసి ఎమ్మెల్యే రాజాసింగ్, పాదయాత్ర పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను చేపడుతున్నారని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, జనం సిద్ధంగా ఉన్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై హుజూరాబాద్ వరకు సాగుతుందని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమాన్ని కోరుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాతబస్తీని ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటిని మళ్లించుకుపోతున్నప్పటికీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ ఏడారిగా మారుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు చంద్రశేఖర్, స్వామిగౌడ్, బాబు మోహన్, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతి ప్రయోజనాల కోసమే..
- నిరవధిక పాదయాత్ర చేపడుతున్నా – క్రమ శిక్షణతో పాదయాత్రకు తరలిరావాలి – ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి(జగ్గంపేట) : ఎన్నికల మేనిఫెస్టోలో, పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుజాతికి ఇచ్చిన హామీల అమలు సాధనకు, జాతి ప్రయోజనాల కోసమే ‘చావోరేవో’ పేరుతో చలో అమరావతి నిరవధిక పాదయాత్రను ఈనెల 26 నుంచి నిర్వహించ తలపెట్టినట్టు మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం గొల్లప్రోలు, కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం నుంచి మైటారుసైకిళ్లపై ర్యాలీగా తరలివచ్చిన యువత ముద్రగడ చేపట్టనున్న నిరవధిక పాదయాత్రకు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి గుర్తు చేయడం కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నామని, ఎన్ని అవరోధాలు ఎదురైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సాధించుకుని తీరాలన్నారు. కాపు జాతిని మోసగించేందుకు మరోసారి చంద్రబాబు కుట్రపన్నుతున్నారన్నారు. వాటిని తిప్పి కొట్టేందుకు కాపుజాతి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గొల్లప్రోలు నుంచి మొగలి అయ్యారావు, దాసం పూసలు, గొల్లపల్లి గంగ, మొగిలి రాంబాబు, కీర్తి వెంకటరమణ, రామిశెట్టి చిట్టియ్య, మొగిలి వెంకటేశ్వరరావు, కుర్రే శంకర్, జ్యోతుల బాబ్జి, సోమవరం నుంచి అంబటి కొండలరావు, కుర్రా వీరనాగు, పూసంశెట్టి రాజేష్, ఎనుగంటి స్వామి, పెన్నిడ్డి సత్యన్నారాయణ, కమ్మిలి వెంకటరమణ, అడపా సత్తిబాబు భారీ సంఖ్యలో కాపులు తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, బీవీ రమణ, గౌతు స్వామి, గోపు చంటిబాబు, చల్లా సత్యన్నారాయణ, తూము చినబాబు, ఆడారి బాబ్జి, రాపేటి పెద్ద, కురుమళ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
చలో అమరావతితో చావో రేవో తేల్చుకుంటాం..
- జైల్లో పెట్టినా బెయిల్ తెచ్చుకుని పాదయాత్ర కొనసాగిస్తా - నిరవధిక పాదయాత్రకు అడ్డుతగిలి అప్రతిష్టపాలుకావద్దు - ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ లేఖ - జూలై 26న పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలు ప్రకటన జగ్గంపేట/కిర్లంపూడి : ఎన్నికల సమయంలో మా జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుర్తు చేయడం కోసం జూలై 26న చావోరేవో చలో అమరావతి కార్యక్రమం చేపట్టినట్టు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు. లేఖ సారాంశమిదీ... చావో రేవో చలో అమరావతి నిరవధిక పాదయాత్ర జూలై 26వ తేదీ నుంచి చేస్తానని ప్రకటించగానే విశాఖ మహానాడులో ‘కమిషన్ రిపోర్టు తెప్పించుకుని కేబినేట్లోను పార్టీ మీటింగ్‌లోను, ప్రజలతోను, బీసీ నాయకులతోను వంద శాతం ఏకాభిప్రాయం వచ్చిన అనంతరం రిజర్వేషన్‌పై నిర్ణయం చేస్తామని సెలవిచ్చారు. ఈ చిలక పలుకులు మీ పాదయాత్రలోను ఎన్నికల ప్రచార సభల్లోను మాట్లాడినప్పుడు, మ్యానిఫెస్టో రచించినప్పుడు ఎందుకు లేవని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే కాదు 1993–94 మా జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బీసీ సోదరులు అనుభవించే కోటాలో మా జాతికి వాటా ఇమ్మని అడగలేదు. వారు అనుభవించే ఎ, బి, సి, డి, ఈ గ్రూపుల్లో కూడా మాకు ఇవ్వబోయే బీసీ రిజర్వేషన్ పెట్టవద్దు. ప్రత్యేక క్యాటగిరీ పెట్టే ఇవ్వండి అని అడుగుతున్నాం. మా మధ్య తగవులు పెట్టి పబ్బం గడుపుకోవడం మీకు అలవాటుగా మారింది. రిజర్వేషన్ అనే పండును మూడు సంవత్సరాలుగా డీప్ ఫ్రిజ్‌లో పెట్టి 2019 ఎన్నికల ముందు మా జాతికి ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే దురాలోచనలు, కుట్రలు తెలుసుకోలేనంత స్థితిలో మా జాతి లేదండీ. పాదయాత్ర రూట్ ఇదీ : జూలై 26 కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ప్రారంభమయ్యే చలో అమరావతి పాదయాత్ర తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మీదుగా కృష్ణ జిల్లా నుంచి అమరావతి వరకు నాలుగు జిల్లాలో పరిధిలో 116 గ్రామాల మీదుగా సాగనుంది. నిరవధిక పాదయాత్ర ప్రకటించడంతో షెడ్యూల్ ప్రకారం కాకుండా సమయానుకూలంగా యాత్ర సాగునుంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర గ్రామాలు... జిల్లా మొత్తం 22 గ్రామాల్లో పాదయాత్ర జరగనుంది. కిర్లంపూడి, రాజుపాలెం, వీరవరం, రామచంద్రాపురం, గోనాడ, రామవరం, జగ్గంపేట, నీలాద్రిరావుపేట, తాళ్ళూరు, మల్లేపల్లి, గండేపల్లి, మురారి, రాజానగరం, చక్రద్వారా బంధం, రాదేయ్యపాలెం, శ్రీకృష్ణపట్నం, భపాలపట్నం, పుణ్యక్షేత్రం, శాటిలైట్ సిటీ, బి.ఆర్.కె.గార్డెన్, మెరంపూడి, కోటిపల్లి బస్‌స్టాండ్ నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వరకు. పశ్చిమలో : కొవ్వూరు వై జంక్షన్, నందమూరు, చాగల్లు, ఊనగట్ల, కలవలపల్లి, యస్.ముప్పవరం, బ్రహ్మణగూడెం, నిడదవోలు, సమిశ్రగూడెం, డి.ముప్పవరం, మునుపల్లి, కానూరు, నడిపల్లికోట, దమ్మెన్ను, మోర్త, ఉండ్రాజవరం, పాలంగి, పైడిపర్రు, తణుకు, కాకుల ఇల్లింద్రపర్రు, తూర్పువిప్పరు, పెనుగొండ, మోర్టేరు, కవిటం, వేడంగి, జిన్నూరు, పాలకొల్లు, దిగమర్రు, చిట్టివరం, నామనపల్లి, నర్పపూర్, పెదమూడపల్లి, లిఖితపూడి, సరిపల్లి, పొప్పరు, మల్లవరం, తిల్లపూడి, యస్.చిక్కాల, వీరవాసరం, గురువునందమూరు, శృంగవృక్షం, పెన్నాడ, గొరగనమూడి, విస్సాకోడేరు, భీమవరం, చినఅమిరం, పెద అమిరం, సీసలి, కాళ్ళ, కాళ్ళకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు. కృష్ణాజిల్లాలో : కలిదిండి, కోరుకొల్లు, సానా దుర్రవరం, బొమ్మినంపాడు, అల్లూరు, క్రొగుంటపాలెం, ఈదేపల్లి, పెదగున్నూరు, సింగరాయంపాలెం, శ్రీహరిపురం, వడాలి, ముదినేపల్లి, పెదపాలపర్రు, వలివర్తిపాడు, గుడివాడ, కొమరోలు, చిన ఎరుకుపాడు, పామర్రు, కురమద్దాలి, మంటాడ, ఉయ్యూరు, ఆకునూరు, దవులూరు, కంకిపాడు, గోసాల, పెనమనూరు, పోరంకి, తాడిగడప, ఎనికేపాడు, రామవరప్పాడు, బెంజిసర్కిల్, రామలింగేశ్వర్‌నగర్, బాలాజీ నగర్, ఆర్టీసీ కాంప్లెక్, ప్రకాశం బేరేజీ. గుంటూరు జిల్లా : సీతానగరం, ఉండవిల్లి, తాడేపల్లి, సులకపేట, యర్రబాలెం, కృష్ణపాలెం, వెలగపూడి (అమరావతి).