చలో అమరావతితో చావో రేవో తేల్చుకుంటాం..
చలో అమరావతితో చావో రేవో తేల్చుకుంటాం..
Published Mon, Jun 26 2017 11:35 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
- జైల్లో పెట్టినా బెయిల్ తెచ్చుకుని పాదయాత్ర కొనసాగిస్తా
- నిరవధిక పాదయాత్రకు అడ్డుతగిలి అప్రతిష్టపాలుకావద్దు
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ లేఖ
- జూలై 26న పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలు ప్రకటన
జగ్గంపేట/కిర్లంపూడి : ఎన్నికల సమయంలో మా జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుర్తు చేయడం కోసం జూలై 26న చావోరేవో చలో అమరావతి కార్యక్రమం చేపట్టినట్టు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు.
లేఖ సారాంశమిదీ...
చావో రేవో చలో అమరావతి నిరవధిక పాదయాత్ర జూలై 26వ తేదీ నుంచి చేస్తానని ప్రకటించగానే విశాఖ మహానాడులో ‘కమిషన్ రిపోర్టు తెప్పించుకుని కేబినేట్‌లోను పార్టీ మీటింగ్‌లోను, ప్రజలతోను, బీసీ నాయకులతోను వంద శాతం ఏకాభిప్రాయం వచ్చిన అనంతరం రిజర్వేషన్‌పై నిర్ణయం చేస్తామని సెలవిచ్చారు. ఈ చిలక పలుకులు మీ పాదయాత్రలోను ఎన్నికల ప్రచార సభల్లోను మాట్లాడినప్పుడు, మ్యానిఫెస్టో రచించినప్పుడు ఎందుకు లేవని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే కాదు 1993–94 మా జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బీసీ సోదరులు అనుభవించే కోటాలో మా జాతికి వాటా ఇమ్మని అడగలేదు. వారు అనుభవించే ఎ, బి, సి, డి, ఈ గ్రూపుల్లో కూడా మాకు ఇవ్వబోయే బీసీ రిజర్వేషన్ పెట్టవద్దు. ప్రత్యేక క్యాటగిరీ పెట్టే ఇవ్వండి అని అడుగుతున్నాం. మా మధ్య తగవులు పెట్టి పబ్బం గడుపుకోవడం మీకు అలవాటుగా మారింది. రిజర్వేషన్ అనే పండును మూడు సంవత్సరాలుగా డీప్ ఫ్రిజ్‌లో పెట్టి 2019 ఎన్నికల ముందు మా జాతికి ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే దురాలోచనలు, కుట్రలు తెలుసుకోలేనంత స్థితిలో మా జాతి లేదండీ.
పాదయాత్ర రూట్ ఇదీ :
జూలై 26 కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ప్రారంభమయ్యే చలో అమరావతి పాదయాత్ర తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మీదుగా కృష్ణ జిల్లా నుంచి అమరావతి వరకు నాలుగు జిల్లాలో పరిధిలో 116 గ్రామాల మీదుగా సాగనుంది. నిరవధిక పాదయాత్ర ప్రకటించడంతో షెడ్యూల్ ప్రకారం కాకుండా సమయానుకూలంగా యాత్ర సాగునుంది.
తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర గ్రామాలు...
జిల్లా మొత్తం 22 గ్రామాల్లో పాదయాత్ర జరగనుంది. కిర్లంపూడి, రాజుపాలెం, వీరవరం, రామచంద్రాపురం, గోనాడ, రామవరం, జగ్గంపేట, నీలాద్రిరావుపేట, తాళ్ళూరు, మల్లేపల్లి, గండేపల్లి, మురారి, రాజానగరం, చక్రద్వారా బంధం, రాదేయ్యపాలెం, శ్రీకృష్ణపట్నం, భపాలపట్నం, పుణ్యక్షేత్రం, శాటిలైట్ సిటీ, బి.ఆర్.కె.గార్డెన్, మెరంపూడి, కోటిపల్లి బస్‌స్టాండ్ నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వరకు.
పశ్చిమలో :
కొవ్వూరు వై జంక్షన్, నందమూరు, చాగల్లు, ఊనగట్ల, కలవలపల్లి, యస్.ముప్పవరం, బ్రహ్మణగూడెం, నిడదవోలు, సమిశ్రగూడెం, డి.ముప్పవరం, మునుపల్లి, కానూరు, నడిపల్లికోట, దమ్మెన్ను, మోర్త, ఉండ్రాజవరం, పాలంగి, పైడిపర్రు, తణుకు, కాకుల ఇల్లింద్రపర్రు, తూర్పువిప్పరు, పెనుగొండ, మోర్టేరు, కవిటం, వేడంగి, జిన్నూరు, పాలకొల్లు, దిగమర్రు, చిట్టివరం, నామనపల్లి, నర్పపూర్, పెదమూడపల్లి, లిఖితపూడి, సరిపల్లి, పొప్పరు, మల్లవరం, తిల్లపూడి, యస్.చిక్కాల, వీరవాసరం, గురువునందమూరు, శృంగవృక్షం, పెన్నాడ, గొరగనమూడి, విస్సాకోడేరు, భీమవరం, చినఅమిరం, పెద అమిరం, సీసలి, కాళ్ళ, కాళ్ళకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు.
కృష్ణాజిల్లాలో :
కలిదిండి, కోరుకొల్లు, సానా దుర్రవరం, బొమ్మినంపాడు, అల్లూరు, క్రొగుంటపాలెం, ఈదేపల్లి, పెదగున్నూరు, సింగరాయంపాలెం, శ్రీహరిపురం, వడాలి, ముదినేపల్లి, పెదపాలపర్రు, వలివర్తిపాడు, గుడివాడ, కొమరోలు, చిన ఎరుకుపాడు, పామర్రు, కురమద్దాలి, మంటాడ, ఉయ్యూరు, ఆకునూరు, దవులూరు, కంకిపాడు, గోసాల, పెనమనూరు, పోరంకి, తాడిగడప, ఎనికేపాడు, రామవరప్పాడు, బెంజిసర్కిల్, రామలింగేశ్వర్‌నగర్, బాలాజీ నగర్, ఆర్‌టీసీ కాంప్లెక్, ప్రకాశం బేరేజీ.
గుంటూరు జిల్లా :
సీతానగరం, ఉండవిల్లి, తాడేపల్లి, సులకపేట, యర్రబాలెం, కృష్ణపాలెం, వెలగపూడి (అమరావతి).
Advertisement