భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. నకిలీ లేఖ అని పేర్కొంటూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ప్రకటించిన వెంటనే దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలు ఈ ఘటనకు పాల్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది.
'అబద్ధాలు అడటంలో బీజేపీకి మంచి పట్టుంది. 1971లో ఎలాంటి ఆశ లేకుండా కేవలం పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకున్నాను. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటాను. రాజీనామాకు సంబంధించి నకిలీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న 230 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 144 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. ఇందులో దిగ్విజయ్ సింగ్ కుమారుడితో సహా సిట్టింగ్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగి పేర్లు కూడా ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన రాజీనామా లేఖలో తన అనుచరులకు సీట్లు దక్కనందుకు దిగ్విజయ్ విచారం వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు దుండగులు పేర్కొన్నారు. భారమైన హృదయంతో పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో ఉంది. కాంగ్రెస్ తన మొదటి లిస్టులో పార్టీ చీఫ్ కమల్‌నాథ్‌తో పాటు 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది.
ఇదీ చదవండి: ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment