![Fake Lawyer Wins 26 Cases - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/17/lawyer.jpg.webp?itok=iFMlPro4)
వ్యక్తి సామర్ధ్యం అనేది అతని విద్య, లేదా నైపుణ్యాల ద్వారా వెలుగులోకి వస్తుంది. అలాగే మనిషి ఎంత విద్యావంతుడైతే అతను తన వృత్తిలో అంత మెరుగ్గా ఉంటాడని అంటుంటారు. అయితే ఇటువంటి బలమైన నమ్మకాలను సైతం వమ్ము చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. వృత్తిపరమైన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన నకిలీ న్యాయవాది ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ కథ కెన్యాకు చెందిన ఒక వ్యక్తిది. అతను ఒక ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్‌గా తన పేరు నమోదు చేసుకోవడమే కాకుండా తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. ఈ నకిలీ లాయర్ పేరు బ్రియాన్ మ్వెండా న్జాగి. అతను నిజమైన న్యాయవాది కాదని న్యాయమూర్తులు కూడా గుర్తించలేకపోవడం విశేషం. లా కోర్సు చేయకుండానే బ్రియాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
కెన్యా లా సొసైటీ అతనిని అనుమానించిన నేపధ్యంలో అతని మోసపూరిత చర్యలు వెలుగు చూశాయి. బ్రియాన్ అనే నిజమైన న్యాయవాది తాను ప్రాక్టీస్ చేయకపోయినా తన ఖాతా యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి, అతను కెన్యా లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుదారు అటార్నీ జనరల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు.
అందుకే అతనికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో అతను తన ఖాతాను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే ఒకరోజు అతను తన ఖాతా లాగిన్ చేసినప్పుడు, అతనికి అనుమానం వచ్చింది. దీంతో అతను లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతని పేరు మీద మరొకరు లాయర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో నకిలీ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అతని వృత్తి నైపుణ్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: హఠాత్తుగా నాగుపాము తిరగబడితే...
Comments
Please login to add a commentAdd a comment