చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..? | Perni Nani Slams PV Ramesh Tweet On Land Titling Act | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?

Published Mon, May 6 2024 5:02 PM | Last Updated on Mon, May 6 2024 6:04 PM

Perni Nani Slams PV Ramesh Tweet On Land Titling Act

 ఐఏఎస్‌ చదువుకుని ఇంతలా దిగజారాలా పీవీ రమేష్‌?

 ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?

చంద్రబాబు పంచన చేరి.. సీఎం జగన్‌పై‌ విషం చిమ్ముతారా? 

 చంద్రబాబు  ఏ డాన్స్‌ చేయమంటే ఆ డాన్స్‌ చేస్తున్నావు

సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌పై‌ మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.

మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల తన పొలం మ్యుటేషన్‌ జరగట్లేదని చేసిన ట్వీట్‌ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా?  అని ప్రశ్నించారు. పీవీ రమేష్‌ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.

25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్‌ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్‌ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.

వివాదాల వల్లే..
ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్‌ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్‌ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్‌ కాదు..ఒరిజినల్స్‌ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్‌ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్‌ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్‌?

  • మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?

  • అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్‌ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

  • ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.

  • ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్‌గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది. 

  •  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?

  • చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్‌ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? 

  • చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్‌ కట్టమంటే ఆ డాన్స్‌ కడుతున్నారు. ఏ ట్వీట్‌ చేయమంటే ఆ ట్వీట్‌ చేస్తున్నారు. 

  • చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్‌గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. 

  • మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.

  • మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.

  • పోలింగ్‌ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు.

  •  ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. 

  • మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్‌ చేస్తున్నారు.

  • ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.

  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల నాకు మ్యుటేషన్‌ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని.

 

చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement