ఒక వ్యక్తి పోలీసులనే బురిడీ కొట్టించాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని థానేలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 27 ఏళ్ల వ్యక్తి డబ్బులు పోయాయంటూ థానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కంపెనీకి సంబంధించిన బ్యాంకు నుంచి సుమారు రూ. 5 లక్షల నగదును డ్రా చేసి వస్తుండగా.. నలుగురు దుండగులు తన బైక్‌ని ఆపి కళ్లలోకి కారం జల్లి నగదు బ్యాగ్ పట్టుకుపోయారంటూ కట్టుకథ అల్లి మరీ ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్మాప్తు చేయడం ప్రారంభించారు. అతను ఎక్కడ డబ్బు పోయిందన్నాడో ఆయా పరిసరాల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లో పరిశీలించగా..వాటిల్లో ఎక్కడా అతను బైక్‌పై బ్యాగుతో వెళ్తున్నట్లు కనిపించలేదు. ఆఖరికీ అతని బైక్‌ని ఆపిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఆ వ్యక్తిపై మరింత అనుమానం కలిగి తమదైన తరహాలో విచారించారు.
దర్యాప్తులో అతడు చెప్పిన విషయాలు వినీ పోలీసులే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సంస్థ తరుఫున విత్ డ్రా చేసిన మనీ తన వద్దే ఉంచుకోవాలనిపించిందని, అందుకనే ఇలా కట్టుకథ అల్లి ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. ఆ డబ్బును పోలీసులే ఏదోవిధంగా రికవరీ చేస్తారనుకున్నాని చెప్పడంతో..పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: ఠారెత్తించే ఘోర ప్రమాదం..కానీ చివర్లో అదిరిపోయే ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment