కూటికోసం కూలికెళ్లిన ఓ అభాగ్యురాలిని నోట్లో టవల్ కుక్కి ముగ్గురు యువకులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేత ఆదేశాలకే విలువ ఇచ్చి నిందితులకు అండగా నిలిచారు. ప్రాణ భయంతో బాధితురాలు భర్తతో కలిసి ఊరు విడిచి పారిపోయి హైదరాబాద్‌లో తలదా చుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్‌ను ప్రారంభించిన రోజునే న్యాయం కోసం బాధితురాలు, ఆమె భర్త డీజీపీ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు పడటంతో జరిగిన దారుణం వెలుగుచూసింది.