సాంబశివరావు పదవీకాలం పొడిగింపు?
సర్వీసు రెండేళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నండూరి సాంబశివరావును రెండేళ్లపాటు కొనసాగించేందుకు చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే మరో రెండేళ్లు ఆయన్ను డీజీపీగా కొనసాగించేలా సర్వీసును పొడిగించేలా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. జూలై మొదటివారంలో కేంద్రానికి పంపించే సీనియర్ ఐపీఎస్‌ల ప్యానల్‌లో 1984 బ్యాచ్‌కు చెందిన సాంబశివరావు, 1985 బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య, 1986 బ్యాచ్‌కు చెందిన కౌముది ముగ్గురి పేర్లు ఉంటాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న మాలకొండయ్యకు డీజీపీ పోస్టు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన కౌముది ప్రస్తుతం ఎన్‌ఐఏలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకొచ్చి డీజీపీ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్‌ను డీజీపీ చేయాలని ప్రభుత్వంలోని పలువురు కీలకనేతలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది.