ఐలవరం టూ జమ్మూకశ్మీర్
కిడ్నాపర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా భట్టిప్రోలు ఐలవరం గ్రామానికి చెందిన లిఖితను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు జమ్మూకశ్మీర్‌లో పేర్లు మార్చుకుని మకాం ఉండగా అరెస్టు చేసినట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరు లకు ఆయన వివరాలు వెల్లడించారు. నిం దితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నా రు. కిడ్నాప్ తర్వాత 25వ తేదీ వరకూ వారి వివరాలు ట్రాక్ చేయగలిగామన్నారు. గతం లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసి 2011లో తొలగింపునకు గురయ్యాక ఐలవ రంలో ఆటో నడుపుకొంటున్నాడన్నారు.
పిల్లలను లోబర్చుకొనే యత్నం...
నాగేశ్వరరావు ప్రవర్తనకు విసిగిన భార్య అతని నుంచి దూరంగా ఉంటోందని డీజీపీ తెలిపారు. ఐలవరంలో ఓ టీచర్ సహా పలువురు మహిళలతో అతనికి వివాహేతర సంబంధాలున్నాయన్నారు. ఆటోలో స్కూల్ కు తీసుకెళ్లే పిల్లలను కూడా లోబర్చుకో వడానికి యత్నించేవాడన్నారు. లిఖితకు ఏడాది నుంచి మాయమాటలు చెప్పి దగ్గర య్యాడని వివరించారు.
టీచర్‌కు ఫోన్‌తో ఆచూకీ లభ్యం..
ఏప్రిల్ 21న లిఖితను కిడ్నాప్ చేసి ఐలవరం నుంచి ఒంగోలు, అక్కడి నుంచి హైదరాబా ద్ మీదుగా ఢిల్లీ, కశ్మీర్‌లోని సాంబాకు తీసు కెళ్లినట్లు తెలిపారు. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా నాగేశ్వరరావు పనిచేయడంతో అక్కడ పరిచ యాలున్నాయని, అతని పేరును తేజగా, లిఖిత పేరును గీతగా మార్చి సెంట్రింగ్, కెమికల్ ఫ్యాక్టరీ, ఆయిల్ కంపెనీల్లో పనిచే స్తూ లిఖితపై పలుమార్లు లైంగికదాడి చేసి నట్లు చెప్పారు. ఐలవరంలోని టీచర్‌కు నాగేశ్వరరావు ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేయాలని కోరడంతో ఆచూకీ లభ్యమైందని వివరించారు.