ఉషారాణి ఆత్మహత్య కేసు: సీఐడీ విచారణ
కడప : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య కేసులో సీబీసీఐడీ విచారణ ప్రారంభించింది. తొలుత వైఎస్సార్‌జిల్లా బద్వేల్ పోలీసు స్టేషన్‌లో విచారణ చేపట్టిన అధికారులు ఆమె స్వగ్రామం పుట్టాయపల్లి వెళ్లి కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు. ఉషారాణి తండ్రి జయరామిరెడ్డిని కూడా విచారించి ఆయన తెలిపిన విషయాలను నమోదు చేసుకున్నారు. సీఐడీ సీఐ నాగభూషణం, సిబ్బంది విచారణ జరిపారు.
కాగా కర్నూలు జిల్లా పాణ్యం ఆర్జీఎం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ఉషారాణి కీచక అధ్యాపకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఘటనపై మెరుగైన విచారణ కోసం డీజీపీ సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు.