వరి నాట్లు వేస్తున్న విజయ్‌కృష్ణన్, దినేష్‌కుమార్
బాపట్ల: అది బాపట్ల జిల్లాలోని మురుకొండపాడు గ్రామం. శివారున జలయజ్ఞంలో తడిసిన పంట పొలం. మరో వైపు ఆకాశాన భగభగ మండుతున్న భానుడు.. ఇంతలో ఓ కూలీల బృందం ఆ పంట చేలో వడివడిగా అడుగులు వేసింది. అప్పటికే పరిచి ఉన్న వరి మొక్కలను చేత పట్టారు ఆ కూలీలు. ఎరట్రి ఎండలో నేలమ్మ ఒడిలో మట్టి గంధంలో తడిసిన ఆ కూలీలే కలెక్టర్ దంపతులు.
ఒకరు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మరొకరు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఆదివారం మురుకొండపాడు వరి చేలోకి వీరు తమ కుటుంబంతో సహా వచ్చి వరినాట్లు వేశారు. గంటకు పైగా వరి మొక్కలు నాటారు. అక్కడికే క్యారేజీలు తెప్పించుకొని గట్టుపై కూర్చుని భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment