Paddy Fields
-
రైతుల పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పంట పొలాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్) పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజుల పాటు సౌరవిద్యుత్ ఉత్పాదనకు అనుకూలత ఉంది. చిన్న చిన్న ప్లాంట్లతో.. పీఎం కుసుమ్ పథకం కింద 2026 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 30,800 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంట్లను రైతుల పంట పొలాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పొలాల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నా.. రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది.త్వరలో సబ్స్టేషన్ల వారీగా నోటిఫికేషన్ రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్ల వారీగా ఎంత స్థాపిత సామర్థ్యంతో కొత్త సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయో వెల్లడిస్తూ త్వరలో డిస్కంలు నోటిఫికేషన్ ఇస్తాయి. ఆయా సామర్థ్యం మేరకు సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు రైతుల నుంచి రెడ్కో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతులు వ్యక్తిగతంగా, సంఘాలుగా, సహకార సంఘాలుగా ఏర్పడి వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళా గ్రూపులకు ప్రాధాన్యత స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), మండల సమాఖ్యలు కూడా రైతుల నుంచి పొలాలను లీజుకు తీసుకుని సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. ప్లాంట్ల మంజూరులో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవకాశమిచ్చి సంఘాల మహిళలను కోటీశ్వరులు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలు రైతు కుటుంబాల వారేకావడంతో.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు రైతుల చేతుల్లోనే ఉండనుంది. ఎస్‌హెచ్‌జీలకు పావలా వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఒక మెగావాట్ ప్లాంట్ నుంచి ఏడాదికి సగటున 15 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అంటే సుమారు రూ.45 లక్షల ఆదాయం వస్తుంది. మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆరు ఎకరాల స్థలం, రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ మేరకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి. కరెంటు కొననున్న డిస్కంలు రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తాయి. ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 ధరను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇప్పటికే ఖరారు చేసింది. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించవచ్చు. డిస్కంలు ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి సగటున యూనిట్‌కు రూ.2.58 ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. రైతులకు మాత్రం కాస్త ఎక్కువగా యూనిట్‌కు రూ.3.13 ధర చెల్లించనున్నాయి. -
ఖరీఫ్‌కు కొత్త వరి వంగడాలు సిద్ధం
సాక్షి, భీమవరం: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 300 వరి రకాలు సాగుచేస్తున్నప్పటికీ బీపీటీ 5204, ఎన్‌డీఎల్‌ఆర్ 7, స్వర్ణ, పీఏపీఎల్ 1100, ఆర్జీఎల్ 2537 వంటి కొన్ని రకాలు మాత్రమే తినడానికి అనువుగా ఉంటున్నాయి.ఈ సమస్యను అధిగమించేందుకు మరిన్ని రకాలను, అధిక పోషక విలువలు కలిగిన వాటిని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూలై 19న విడుదల చేసింది. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1271, బీపీటీ 2846, బీపీటీ 2841, ఎన్‌ఎల్‌ఆర్ 3238 రకాలు ఉన్నాయి. వాటి వివరాలను మార్టేరు రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (వరి) డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఆయా రకాల వరి వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఆయన తెలిపారు. ఎంటీయూ 1271 అధిక గింజలతో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్న రకం. పంట కాలం 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి 69.7 శాతం నిండు గింజలు కలిగి అధిక దిగుబడి ఇస్తుంది. రైతు, మిల్లర్, సన్నగింజ ధాన్యం మార్కెట్‌కి అనుకూలమైన వెరైటీ. కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సార్వాకు అనువైన రకం. దోమ, ఎండాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.8 టన్నుల నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బీపీటీ 2846 కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు దీటైన ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. మార్కెట్‌కు, వినియోగదారులకు అనువుగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. సన్నగింజ రకం. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. భోజనానికి అనుకూలమైన రకం. 65.2 శాతం నిండు గింజలు కలిగి మిల్లర్, మార్కెట్‌కు అనుకూలమైన వెరైటీ. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రైతుకు మంచి ఆదాయం ఇస్తుంది. నేరుగా విత్తే విధానం, సేంద్రియ వ్యవసాయ విధానానికి అనువైన రకం. బీపీటీ 2841 అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలు కలిగి, మధుమేహ రోగులకు భోజనానికి అనువైన నల్ల బియ్యపు రకం. బీపీటీ 5204 ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 65.2 శాతం నిండు గింజలు కలిగి పచ్చి బియ్యానికి అనువుగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి బాగుంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకూ అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌లో కిలో సింగిల్ పాలిష్ బియ్యానికి రూ. 200 పైచిలుకు ధర పలికే అవకాశం ఉన్న రకం. ఎన్‌ఎల్‌ఆర్ 3238 అధిక జింక్ కలిగి ఉంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. 120 – 125 రోజుల కాల పరిమితి కలిగిన స్వల్పకాలిక వెరైటీ. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ చేనుపై మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 62% నిండు గింజలు కలిగి, బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో (సిఫారసు చేసిన నత్రజనిలో 75%) సగటున ఎకరాకు 2.6 టన్నుల దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌కి అనువైన రకం.విత్తనాల కోసం వీరిని సంప్రదించవచ్చు అధిక శాతం విస్తీర్ణంలో కొత్త వెరైటీల సాగుకు కసరత్తు చేస్తున్నట్లు డా. టి.శ్రీనివాస్ తెలిపారు. ఎంటీయూ వరి రకాల విత్తనాల కోసం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీడ్ ఆఫీసర్ డాక్టర్ పీవీ రమణారావు (ఫోన్ 94404 41922), బీపీటీ రకాల కోసం డాక్టర్ కృష్ణవేణి (ఫోన్ 94417 21120), ఎన్‌ఎల్‌ఆర్ రకాలకు డాక్టర్ శ్రీలక్ష్మి (ఫోన్ 98855 27227), వరి రకాల వివరాలు, సాగులో సందేహాల నివృత్తి కోసం డాక్టర్ టి.శ్రీనివాస్ (ఫోన్ 93968 48380) సంప్రదించాలని డా. టి.శ్రీనివాస్ వివరించారు.2023లో అఖిల భారత స్థాయిలో విడుదలైన వరి వంగడాలుఎంటీయూ 1275 పంట కాలం 135 నుంచి 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు, బ్యాక్టీరియా ఆకు ఎండు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది.బీపీటీ 3050 కేంద్ర రకాల విడుదల కమిటీ ద్వారా గుజరాత్, మహారాష్ట్రలలో సాగు కోసం విడుదల చేసిన రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి గింజ మొలకెత్తదు. కాండం ధృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ పొడవుగా లావుగా ఉండి అధిక బియ్యం రికవరీ కలిగిన రకం. అగ్గి తెగులు, మెడ విరుపు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 నుంచి 2.6 టన్నుల దిగుబడి వస్తుంది. -
Bapatla: వరి నాట్లు వేసిన కలెక్టర్లు
బాపట్ల: అది బాపట్ల జిల్లాలోని మురుకొండపాడు గ్రామం. శివారున జలయజ్ఞంలో తడిసిన పంట పొలం. మరో వైపు ఆకాశాన భగభగ మండుతున్న భానుడు.. ఇంతలో ఓ కూలీల బృందం ఆ పంట చేలో వడివడిగా అడుగులు వేసింది. అప్పటికే పరిచి ఉన్న వరి మొక్కలను చేత పట్టారు ఆ కూలీలు. ఎరట్రి ఎండలో నేలమ్మ ఒడిలో మట్టి గంధంలో తడిసిన ఆ కూలీలే కలెక్టర్ దంపతులు. ఒకరు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మరొకరు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఆదివారం మురుకొండపాడు వరి చేలోకి వీరు తమ కుటుంబంతో సహా వచ్చి వరినాట్లు వేశారు. గంటకు పైగా వరి మొక్కలు నాటారు. అక్కడికే క్యారేజీలు తెప్పించుకొని గట్టుపై కూర్చుని భోజనం చేశారు. -
చేనులో చేపలే పంట!
వరి పండాలంటే.. ఎప్పుడూ మడి నిండా నీళ్లుండాలి. మరి అన్ని నీళ్లున్న మడిని మరో పనికీ వాడుకోగలిగితే.. సింపుల్‌గా చేపలు పెంచితే.. ఇటు రైతులకు అదనపు ఆదాయం, అటు పర్యావరణానికీ ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో, మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరి చేన్లతో ‘చేపలు పండిస్తున్నా’రని అంటున్నారు. రాష్ట్రంలోనూ వరి చేన్లలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కథనం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వరికి ‘అదనం’గా.. ప్రపంచవ్యాప్తంగా సగం జనాభాకు అన్నమే ప్రధాన ఆహారం. వ్యవసాయం చేసే భూమిలో దాదాపు పావు వంతు వరి సాగు చేస్తున్నట్టు అంచనా. ఇలా వరి పండిస్తూనే.. అదనపు ఆదాయం పొందడానికి ఎన్నోఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరి చేన్లలో చేపలు పెంచితే ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి పలు దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మన దేశంలోనూ పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికంగా కొందరు రైతులు ఇలా చేపలు పెంచుతున్నారు. దీనితో ఎంతో ప్రయోజనం ఉన్నా రైతులకు పెద్దగా అవగాహన లేదు. చేన్లలో పెంచడం ఎలా? వరికి నీళ్లు ఎక్కువ కావాలి. పంటకాలమంతా మడులు నీటితో నిండే ఉండాలి. ఇతర అంతర పంటలు వంటివి వేయడం కష్టం. కానీ కాస్త అదనపు శ్రమ తీసుకోగలిగితే.. చేన్లలో చేపలు పెంచొచ్చు. ప్రతి మడిలో వరి చుట్టూ.. గట్టు వెంట ఐదారు అడుగుల వెడల్పుతో (పెరెన్నియల్ ట్రెంచ్)గానీ.. ఏదో ఓ పక్కన గుంత (రెఫ్యూజ్ పాండ్) లాగా గానీ నిర్ణీత పరిమాణంలో కందకాలు తవ్వి చేపలు పెంచవచ్చు. వరి–చేపల పంట ఇలా... ►సాధారణంగా వరి మడులు ఒక అడుగు నుంచి అడుగున్నర వరకు లోతు ఉంటాయి. దీనికి అదనంగా.. చేపల కోసం తవ్వే కందకాలు 3–4 అడుగుల లోతు ఉంటాయి. ►ఈ నీటిలో రోహు, తిలాపియా, బొచ్చె, కొరమీను, కామన్ కార్ప్ వంటి రకాల చేపలను పెంచవచ్చు. ఎకరానికి 400 కిలోల నుంచి 900 కిలోల వరకు చేపల దిగుబడి వస్తుందని అంచనా. ►ఒక ఎకరంలో 70 శాతం స్థలంలో వరి, మిగతా 30 శాతం స్థలంలో కందకాలు తవ్వి చేపలు వేయవచ్చు. ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల గడువులో.. ఒక్కో ఎకరంలో 400 కిలోల నుంచి 700 కిలోల వరకు చేపల దిగుబడి వస్తుందని అంచనా. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక ఎకరంలో.. కేవలం వరిసాగు చేస్తే సగటున రూ.20 వేల ఖర్చుతో.. రూ.48 వేల వరకు ఆదాయం వస్తుంది. అదే వరితోపాటు చేపలు కూడా వేస్తే సగటున రూ. 60 వేల ఖర్చుతో.. రూ.80 వేల నుంచి రూ.1.7 లక్షల వరకు ఆదాయం వస్తుంది. దిగుబడి.. చేపలు.. రెండూ పెరుగుతాయి ►చేపలు తినగా మిగిలే ఆహారం, చేపల విసర్జితాలు వంటివి వరికి ఎరువుగా ఉపయోగపడతాయి. పంట దిగుబడి 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. రసాయన ఎరువుల అవసరం కూడా తగ్గిపోతుంది. ►పురుగులు, ఇతర కీటకాలు, నాచు వంటివాటిని చేపలు తినేయడం వల్ల వరి దెబ్బతినకుండా ఉంటుంది. పైగా చేపలు బాగా ఎదుగుతాయి. ►చేన్లలో లోతుగా తవ్వి నీళ్లు నింపడం వల్ల ఎలుకల బెడద కూడా తగ్గిపోతుంది. ►వరి చేన్లలో చేపల పెంపకానికి మరీ ఎక్కువ ఖర్చుగానీ, శ్రమగానీ అవసరం ఉండదు. పైగా రెండు విధాలా ఆదాయం పొందవచ్చు. ►వరి కోతలు పూర్తయిన తర్వాత కూడా చేపల పెంపకాన్ని ఏడాది పొడవునా కొనసాగించవచ్చు. ►ఇండోనేషియాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. కేవలం వరిసాగుతో పోలిస్తే, ‘వరి–చేపలు’ కలిపి వేయడం వల్ల ఆదాయం కనీసం 30శాతం ఎక్కువ. చైనాలో ఈ ఇబ్బందులను అధిగమిస్తే.. ►వరి చేన్లలో చేపల పెంపకానికి నిరంతరాయంగా తగిన స్థాయిలో నీటి సరఫరా ఉండాలి. ►మొదటిసారి చేపలు వేసినప్పుడు మడుల్లో చుట్టూ తవ్వి గుంతలు చేయడం, గట్లను బలోపేతం చేయడానికి పెట్టుబడి, శ్రమ అవసరం ఉంటాయి. ►చేప పిల్లలు వేయడానికి, వాటికి ఆహారానికి కాస్త పెట్టుబడి అవసరం. ►నిరంతరం నీటి తడి ఉన్నా తట్టుకునే రకాల వరినే వేయాల్సి ఉంటుంది. ►కొన్నిరకాల నేలల్లో నీరు సరిగా నిలవదు. మరికొన్ని చేపల పెంపకానికి అనువు కాదు. అందువల్ల నిపుణులతో పరిశీలన చేయించాలి. ►వరదలు వచ్చే అవకాశమున్న చోట్ల చేపలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. పర్యావరణానికీ లాభమే.. వరి చేన్లలో చేపల పెంపకం వల్ల రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. సాగుభూములు ఏవైనా కొంతకాలానికి సారం కోల్పోతాయి. అదే ‘వరి–చేపల పంట’ వల్ల.. నేల సారం కోల్పోకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వరిసాగు వల్ల పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు వెలువడుతోందని.. వియత్నాంలో... ఇది భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడానికి (గ్లోబల్ వార్మింగ్‌కు) కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వరి చేన్లలో చేపల పెంపకం వల్ల మిథేన్ విడుదల 35శాతం వరకు తగ్గినట్టు తమ ప్రయోగాల్లో గుర్తించామని ఇటీవలే ప్రకటించారు. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా వరి మడుల్లో చేపలతోపాటు రొయ్యలు కూడా పెంచుతున్నారు. -
పంటలకు వరద పోటు..
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి పంట దెబ్బ తినగా, నాట్లు వేసిన వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి మొక్కలు కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లాలో ఏటా ప్రాణహిత తీరంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. గత రెండు రోజులుగా కురిసిన వానలతో వేలాది ఎకరాల్లో భారీగా వరద నీరు చేరింది. పత్తి చేనుల్లో నీటి చేరికతో పాటు ఇసుక మేటలు వేయడంతో పత్తి మొలక, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా వరి నాట్లు వేస్తుండగా, ఈ వర్షాలతో నారు ఎదగకుండా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 6,864 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 5, 099 ఎకరాల్లో పత్తి, 1,447 ఎకరాల్లో వరి, 312 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో కంది నీట మునిగింది. పత్తికే ఎక్కువ నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా, ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే సుమారు లక్ష న్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. భారీ వర్షాలతో చాలాచోట్ల ఇప్పటికే వేసిన వరి నాట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం తో పొలాలు మునిగిపోయాయి. పల్లపు ప్రాంతాల్లో పంటల మునక ఖమ్మం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,70,000 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,82,068 ఎకరాల్లో పంట వేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,52,500 ఎకరాలు కాగా.. ఇప్పటికి 49,233 ఎకరాల్లో నాట్లు వేశారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పల్లపు ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2.86 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే పత్తి 2,363 ఎకరాల్లో సాగైంది. -
రోజు కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ హర్దీప్ కౌర్, ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం దినసరి కూలీగా మారింది. రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన ఆమె.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర జీవితం కొనసాగిస్తుంది. ఓ వైపు విద్యను(ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా) అభ్యసిస్తూనే, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంది. 2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సోధీ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ఆమె ఆవేదన చెందుతుంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీంతో తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లాల్సి వస్తుందని వాపోతుంది. తండ్రి నయాబ్ సింగ్, తల్లి సుఖ్విందర్ కౌర్ తన క్రీడా భవిష్యత్తు కోసం చాలా శ్రమించారని, ఉన్నది అమ్ముకుని తనను ఈ స్థాయికి తెచ్చారని, వారి బాధ చూడలేకే తాను వారితో కలిసి పనికి వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాక ఇటువంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. చదవండి: ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా -
వరిలో ఊద సాగుతో తగ్గిన కలుపు!
ఘన జీవామృతం, జీవామృతంతో సాగవుతున్న వరి పొలంలో తీవ్రరూపం దాల్చిన కలుపు సమస్యకు వరిలో అంతరపంటగా ఊదల సాగు చేపట్టి పరిష్కరించుకోవచ్చని కర్ణాటకలోని రాయచూర్‌లో కొందరు తెలుగు రైతుల బృందం అనుభవపూర్వకంగా చెబుతున్నారు. స్నేహితులైన రమేశ్, రామలింగరాజు, వెంకట్రాజుల బృందం గత ఏడేళ్లుగా రాయచూర్ దగ్గర్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో వరి, చెరకు సాగు చేస్తున్నారు. కృష్ణా నది నుంచి తోడిన నీటిని పారగట్టి నీటి నిల్వ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నారు. చౌడు సమస్య వల్ల ఊడ్చిన వరి నారులో 20% మొక్కలు చనిపోయేవి. రెండు,మూడు సార్లు నాట్లు వేయాల్సి వచ్చేది. వరి పొట్ట దశలో వరి గిడసబారిపోయేది, తాలు ఎకరానికి 10 బస్తాలు వచ్చేది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయదారుడు సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో చౌడు భూముల్లో రెండేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరి, వరిలో అంతరపంటగా ఊదలు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. చెరకు సాగులోనూ సేంద్రియ పద్ధతులతో చౌడును జయించారు. జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ద్వారా శిక్షణ పొందిన ఈ రైతుల బృందం తమ వ్యవసాయ క్షేత్రంలోనే 10 రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలను పెద్ద డ్రమ్ముల్లో అభివృద్ధి చేసి ప్రతి వారం ఎకరానికి 500 లీటర్ల చొప్పున వదలటం వల్ల చౌడు సమస్య 80% తగ్గింది. ఘనజీవామృతం, జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్‌ను, బ్యాక్టీరియాలను వేర్వేరు ప్లాట్లలో 30 ఎకరాల్లో మొదటిగా ఈ ఏడాది జనవరి–మార్చి వరకు వాడి చూడగా.. మొదటి ప్రయత్నంలోనే ఎటువంటి సమస్యా లేకుండా పంట దిగుబడి వచ్చింది. అయితే, రైతులు సొంతంగా తయారు చేసుకున్న బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వాడిన వరి పొలంలో మొక్కలు వేగంగా పెరిగి ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు గమనించారు. దీంతో ఈ ఖరీఫ్‌లో సేంద్రియ వరి సాగును 120 ఎకరాలకు విస్తరింపజేశారు. నాటిన మొక్కలు చనిపోలేదు. వరిలో ఊద.. కలుపు నియంత్రణ సేంద్రియ వ్యవసాయం చేపట్టక ముందు కలుపు నిర్మూలనకు ఎకరానికి రూ. 3 వేలతో రసాయనిక కలుపు మందులు చల్లేవారు. సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేపట్టిన తర్వాత ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 9 వేల వరకు కలుపుతీతకు ఖర్చవుతున్నది. ఈ ఖర్చును తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యం రాజుకు కొత్త ఆలోచన వచ్చింది. వరిలో ఊదను అంతరపంటగా సాగు చేస్తే మేలని తలచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేశారు. ఘనజీవామృతం ఎకరానికి టన్ను వేశారు. తర్వాత 4 దఫాల్లో ఎకరానికి 900 కిలోలు వెదజల్లారు. పదిహేను రోజులకోసారి జీవామృతం నీటి ద్వారా ఇస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. సొంతంగా అభివృద్ధి చేసుకున్న బ్యాక్టీరియాలను, శిలీంధ్రాలను నీటి ద్వారా అందిస్తున్నారు. వరి నాట్లు వేసిన రోజే ఎకరానికి 3 కిలోల ఊద విత్తనం వెదజల్లారు. వరి,ఊద మొక్కలతో పొలం వత్తుగా పెరగడంతో కలుపు సమస్య తగ్గింది. ఒకేసారి కలుపు తీయించారు. ఎకరానికి రూ. 2,500 అయ్యింది. 75 రోజులకు ఊద కోతకు వచ్చింది. 3 క్వింటాళ్ల ఊద ధాన్యం దిగుబడి రావాల్సింది, పక్షులు తినటం వల్ల 180 కిలోలు వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ సేంద్రియ వరి కంకి బాగుంది. వరి దిగుబడిపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని రమేశ్(94811 12345) తెలిపారు. తొలి ఏడాది ఏకపంటగా సేంద్రియ వరిలో 17 బస్తాల దిగుబడి వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ వరి దిగుబడి 20 బస్తాలకు తగ్గకుండా వస్తుందని భావిస్తున్నామన్నారు. సేంద్రియ వరిలో ఊద సాగు వల్ల కలుపు సమస్య తగ్గిపోవడమే కాకుండా.. ఆదాయమూ వస్తుందని సుబ్రహ్మణ్యం(76598 55588) తెలిపారు. బ్యాక్టీరియా డ్రమ్ములను పరిశీలిస్తున్న సుబ్రహ్మణ్యం రాజు -
జాలీగా...బాలి వెళ్లొద్దామా...
నేలతల్లికి పచ్చని చీర చుట్టినట్టు పరుచుకున్న వరిచేలు, గత వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పురాతన కట్టడాలు, అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎన్నో ఆలయాలు, నోరురించే రుచులతో ఆహార ప్రియులను కట్టిపడేసే వంటలు, అనేక రకాల జాతులకు చెందిన వానరాలకు ఆలావాలమైన అడవులు....ఇన్ని ప్రత్యేకలతో బాసిల్లుతుంది కాబట్టే బాలి పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హనిమూన్ వెళ్లే జంటలకయినా, కుటుంబంతో ఆనందంగా విహారానికైనా, చివరకూ ఒంటరి పక్షులకయినా చక్కటి అనువైన ప్రదేశం బాలి. ఇండోనేషియాకు ప్రధాన ఆదాయ వనరుగా బాసిల్లితున్న బాలి ఒక ద్వీపం. మరి ఒకసారి అక్కడి ప్రత్యేకలతను చూసొద్దాం పదండి... ఆధ్యాత్మికం... బాలిలో దాదాపు 20వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటిని సందర్శించుకోవాలంటే ఈ వేసవి సెలవులు సరిపోవు. కాబట్టి ముఖ్యంగా చూడాల్సిన ఆలయాల జాబితాను తయారు చేసుకుని దాని ప్రకారం దర్శించుకుంటే బాగుంటుంది. వీటిలో సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద వెలసిన ‘తనాహ లాట్’ ఆలయం, సముద్ర జీవుల ప్రదర్శనశాల, అగ్ని చుట్టూ నృత్యం చేసే కళాకారులతో అబేధ్యమైన కొండ మీద వెలసిన మరో ఆలయం ‘ఉలువాటు’. బాలీయులు ఎక్కువగా సందర్శించే మరో ప్రముఖ ఆలయం ‘మాతృ ఆలయం’. ఈ ఆలయాలను తప్పక సందర్శించాలి. ఆహారం... భోజన ప్రియులకు చక్కటి విహార స్థలం బాలి. ఇక్కడ వడ్డించే ఆహారంలో ప్రధానంగా ఉండేవి కొబ్బరి, మసాలాలతో కూడిన మాంసం, సముద్ర ఆహారం. ఇక్కడి ప్రత్యేక వంటకాలు సతాయ్ (వేయించిన మాంసం), బాబీ గులింగ్ (ఉప్పు చల్లి వేయించిన పంది మాంసం), నాసీ గోరెంజ్ (సుగంధ ద్రవ్యాలు, మాంసం, కొబ్బరి, బియ్యంతో కలిపే వండే బాలీ ప్రత్యేక సంప్రాదాయ వంటకం). వరి మడులు... ద్వీపం అంతా పరుచుకున్న పచ్చటి వరిమడులు కనులవిందుగా ఉంటాయి. ఉబుద్స్ తెగలల్లాంగ్, తబనాన్స్ జతిలువిహ ఈ వరిమడులకు ప్రసిద్ధి గాంచాయి. ఫోటోగ్రాఫి అంటే ఆసక్తి ఉన్న వారు తమ కెమరాలకు పని చెప్పి అద్భుతమైన దృశ్యాలను బంధించవచ్చు. ఊయలలో విహరిద్దాం... బాలి వెళ్లిన వారు ఎవరైనా తప్పక సందర్శించాల్సింది, ప్రయత్నించి చూడాల్సినవి ఊయలలు. 20మీటర్ల ఎత్తులో గాలిలో ఊగుతూ సముద్రాన్ని, ఆకాశాన్ని, అడవిని చూడటం ఒక వింత అనుభూతి. బాలిలోని ‘ఉబుద్’ ప్రాంతం ఈ ఊయలలకు ప్రసిద్ధి. ట్రెక్కింగ్, సీతాకోక చిలుకల ఉద్యావనవనానికి సమీపంలో ఉన్న ఉబుద్‌లో నాలుగు చోట్ల నాలుగు వేర్వేరు ఎత్తుల్లో ఉన్న ఈ ఊయలలను సాహిసికులు సందర్శించకుండ ఉండలేరు. కోతులకు అడ్డా ఉబుద్ అడవి... విభిన్న జాతులకు చెందిన కోతులకు ప్రసిద్ది ఈ సంరక్షణా కేంద్రం. ‘పెడంటిగల్’లో ఉన్న ఈ అడవిలో అడవి అందాలను ఆస్వాదిస్తూ వెళ్తు కోతులను చూడొచ్చు, స్వయంగా వాటికి మనమే ఆహారాన్ని పెట్టవచ్చు. -
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం.
-
సాగర్ కాల్వకు గండ్లు
ఒంగోలు : ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అద్దంకి బ్రాంచి కెనాల్‌కు శుక్రవారం గండ్లు పడ్డాయి. వల్లేపల్లి లాకుల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గండ్లు పడ్డాయి. దీంతో భారీగా నీరు పంట పొలాల్లోకి ప్రవేశించింది. దాంతో షట్టర్లను అధికారులు కిందికి దింపారు. నీరు ముందుకు వెళ్లకుండా కంప చెట్లను అడ్డుగా ఉంచటంతోనే కెనాల్‌కు గండ్లు పడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు. -
అడవి పందుల నుంచి రక్షణ ఇలా..
కొన్ని పద్ధతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవు సదాశివపేట ఏఈఓ ప్రవీణ్ సదాశివపేట రూరల్: అడవి పందుల వల్ల అనేక గ్రామాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లుతోందని సదాశివపేట ఏఈఓ ప్రవీణ్ తెలిపారు. వాటిబారి నుంచి పంటలు కాపాడుకోవడానికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు. టపాసులు పేల్చడం ఒక పెద్ద టెంకాయ తాడును తీసుకొని రెండుమూడు పురులతో 30 అడుగుల పొడవు ఉండే లా ఏర్పాటు చేసుకోవాలి. పురుల మధ్య ఒకదాని వెనుక ఒకటి కొద్ది దూరంలో టపాసులు పెట్టాలి. ఆ తాడును ఒక పెద్ద వెదురు గడకు వేలాడదీసి, దాన్ని పొలంలో ఒక ఎత్తు ప్రాం తంలో నాటుకోవాలి. రాత్రిళ్లు ఈ టెంకాయ తాడుపురికి నిప్పంటించాలి. తాడు కాలుతూ మధ్యలో ఉన్న టపాసులు అప్పుడప్పుడు పేలడం వల్ల వచ్చే శబ్ధాలకు అడవి పందులు పంటల దరిచేరవు. ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా దాదాపుగా అవి వచ్చే అవకాశం లేదు. ఫ్లోరైడ్ గుళికలు ఫ్లోరైడ్ గుళికలు 100 గ్రాముల చొప్పున పది గుడ్డ సంచుల్లో మూటకట్టి వాటిని ప్లాస్టిక్ కవర్లలో అమర్చి దారం సహాయంతో పొలంలో అక్కడక్కడా ఏటవాలుగా నాటిన గడలకు వేలాడదీయాలి. ఈ గుడ్డ సంచులను అప్పుడప్పుడూ నీటితో తడపాలి. అలా చేయడం ద్వారా వచ్చే వాసన.. పొలం చుట్టూ వ్యాపించడం వల్ల అడ వి పందులు వచ్చే అవకాశం ఉండదు. గుడ్డ సంచులు వర్షానికి ఎక్కువగా తడవకుండా ప్లాస్టిక్ కవర్లు కాపాడతాయి. అవి తడిపే క్రమంలో గుడ్డ సంచుల నుంచి నీరు కింద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే అది పెంపుడు జంతువులకు ప్రాణహాని కలిగించగలదు. గుళికల వాసన తగ్గినప్పుడు కొత్త గుళికలు వేసుకోవాలి. ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో అడవి పందులు పొలాల్లోకి రాకుండా చేయవచ్చు. తాటాకు శబ్ధం పొలంలోకి అడవి పందులు ప్రవేశించే స్థలంలో నాలుగు దిక్కులు, నాలుగు మూటలు గాలి వాటానికి అనుకూలంగా ఎనిమిది చోట్ల, రెండు గడల ఎదురెదురుగా ఉండేట్టు ఆరడుగుల దూరంలో నాటుకోవాలి. తాటిఆకు పైభాగాన రంధ్రం చేసి దాని నుంచి జీఐ వైరును తీసి రెండు కొనలు ఎదురెదురుగా నాటిన రెండు కొయ్యలకు గట్టిగా కట్టాలి. ఈ వైరుకు మెలికలు లేకుండా చిన్నగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా అన్ని దిక్కుల్లో ఏర్పాటుచేసుకోవడం వల్ల గాలివాటం ద్వారా తాటాకులు వైరు మీదుగా అటూఇటు గడలకు వేగంగా తగులుతూ పెద్ద శబ్ధం చేస్తాయి. దీని వల్ల అడవి పందులు పొలంలోకి రావు. వెంట్రుకలు వేయడం ద్వారా... క్షౌ రశాలలో దొరికే వెంట్రుకలు పొలం చుట్టూ వరుసల్లో పరచాలి. అడవి పందులు మట్టిని వాసన చూస్తూ పొలంలోకి ప్రవేశించేటప్పుడు ముక్కులోకి వెంట్రుకలు ప్రవేశించి బాధకలగడం వల్ల అవి పొలాల దరిచేరవు. దుర్వాసన వ్యాప్తి చేయడం వల్ల.. పొలం చుట్టూ రెండు అడుగుల ఎత్తులో, పది అడుగుల దూరంలో కొయ్యలు నాటి, దానికి పంది చమురు, బ్యాటరీ వ్యర్థాలతో కూడిన పదార్థంతో రుద్దిన దారాన్ని మూడు వరుసల్లో పొలం చుట్టూ చుడితే ఆ దుర్వాసనకు పందులు పారిపోతాయి. బెలూన్లు, గుడ్డ ముక్కలు పొలంలో అక్కడక్కడా పది అడుగుల ఎత్తులో గడలు నాటి వాటిని ప్రతి అడుగుకు ఒక ఊదిన బెలూ¯ŒSను దారానికి కట్టి వేలాడదీయాలి. వాటిని చూసిన పందులు భయంతో పరుగులు తీస్తాయి. పొలంలో అక్కడక్కడా ఏడెనిమిది అడుగుల ఎత్తులో గడలు నాటి, వాటి తెల్లని గుడ్డ ముక్కలు జెండాలుగా కట్టాలి. అవి గాలికి ఎగరడం వల్ల పందులు భయపడతాయి. గుడ్డలతో పాటు వాటికి బెలూన్లు కూడా కట్టుకోవచ్చు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పద్ధతి ఇది. పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే పశువులు, అడవి పందులు వచ్చే అవకాశమే ఉండదు. ఫెన్సింగ్ ద్వారా వచ్చే విద్యుత్తుకు అవి భయపడతాయి. దీని వల్ల ఎలాంటి ప్రాణహాని జరగదు. దీన్ని ఏర్పాటుచేసుకోదలచినవారు వ్యవసాయ శాఖ కార్యాలయంలో స్పందించాలి. -
‘వరి’లో ఎలుకలను నివారిద్ధాం ఇలా...
గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: వరిలో ఎలుకల బెడద రైతులను కలవరానికి గురిచేస్తున్నది. శాస్త్రీయంగా ఆలోచించి రైతులు కొన్ని చిట్కాలను, క్రిమిసంహారక మందులను వాడితే పంటలను రక్షించుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్(సెల్ః 7288894469) అందించిన సలహాలు, సూచనలివి... ఎలుకల నివారణకు చర్యలు పంట చేలలోని గెట్లపై ఎలుకల రంధ్రాలలో పొగపెట్టినట్లయితే ఎలుకలు కొన్ని చనిపోవడం, మరికొన్ని ఆ వ్యవసాయ క్షేత్రం నుండి వెళ్లిపోవడం జరుగుతుంది. అంతేకాక ఎలుకలు గెట్లపై ఏర్పర్చుకున్న రంద్రాల వద్ద ఎలుక బోన్లు పెట్టడం ద్వారా వాటిని çపట్టవచ్చు. కానీ ఈ విధానాలు రైతులకు కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. ఓపికగా పాటిస్తే ఎలాంటి రసాయనిక మందులు వాడకుండానే నివారించవచ్చు. చిట్కాలతో నివారణ వరి పైర్లలో మూడునాలుగు మీటర్లకు ఒక కర్రను పాతి దానికి కొద్దిగా ధ్వని వచ్చే విధంగా ఏవైనా పాలితిన్ కవర్లను, వరి గడ్డిని వేసి బురదను పెట్టి ఉంచాలి. ఎలుకలు మామూలుగా పంటచేనులో విచ్చల విడిగా అక్కడా ఇక్కడా తిరుగుతుంటాయి. తిరిగినపుడు ఈ కట్టెను తాకగానే మనిషి ఉన్నట్లుగానే అవి భయానికి గురవుతాయి. ఆ ప్రాంతానికి రావడానికి సాహసించవు. అలాగే రెండుమూడు మీటర్లకు ఒకటి చొప్పున వరి పొలంలో మొత్తం పాతితే చాలా వరకు ఎలుకలను నివారించవచ్చు. ఈ చిట్కాను పాటించడం రైతులకు చాలా తేలిక. క్రిమిసంహారక మందులతో నివారణ శాస్త్రీయ పద్దతి ప్రకారం ఎలుకల నివారణకు క్రిమిసంహారక మందులను వాడటం వల్ల నివారించవచ్చు. కానీ రైతులు ఈ మందుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బ్రొమోడలైన్ 50మి.గ్రా. రెండు కిలోల బియ్యంలో కలిపి పెడితే ఎలుకలు మృత్యువాతకు గురవుతాయి. బియ్యం, నూనె కలిపి మందు కలపకుండానే రెండ్రోజులు ఎలుకలు ఏర్పర్చుకున్న రంధ్రాల వద్ద పెట్టాలి. వాటికి ఇవి తినొచ్చు అనే నమ్మకం కలిగిన తర్వాత బియ్యంలో మందు కలిపి పెట్టినట్లయితే తింటాయి. తినగానే వెంటనే చనిపోతాయి. మందు పెట్టడంలో రైతులు జాగ్రత్త వహించకపోతే హాని కలిగే అవకాశమున్నది. అల్యూమినియం పాస్పేట్, జింక్ సల్ఫేట్‌తో తయారు చేసిన బిస్కెట్ పెట్టడం వల్ల కూడా ఎలుకలు చనిపోతాయి. ఆ బిస్కెట్ గాలి ద్వారా వ్యాపించి ఎలుకలు గాలిని పీల్చగానే మృత్యువాతకు గురవుతాయి. కానీ ఈ విధానం రైతులకు నష్టం వాటిల్లే అవకాశమున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ మందును ప్రయోగించడం మంచిది. -
తెలుగుగంగ కాలువకు మళ్లీ గండి
తిరుపతి : చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చినకనపర్తి గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువకు మళ్లీ శనివారం ఉదయం గండిపడింది. దీంతో సమీపంలోని దిగువ పంట పొలాలు మరోసారి నీట మునిగాయి. శుక్రవారం యుద్ధ ప్రాతిపదికిన అధికారులు ఈ కాలువకు మరమ్మతులు చేశారు. పనుల నాసిరకంగా ఉండటం వల్ల వెంటనే మళ్లీ కాలువకు గండి పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఈ కాలువకు ఇదే ప్రాంతంలో గండి పడిన సంగతి తెలిసిందే.అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి... రెండు రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి కారణంగా కాలువకు గండి పడి నీరంతా వృధాగా పోయింది. దీంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేసి శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. -
తెలుగుగంగకు గండి: నీటమునిగిన పొలాలు
తిరుపతి : చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చినకనపర్తి గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో సమీపంలోని దిగువ పంట పొలాలు నీట మునిగాయి. ఈ కాలువకు ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇదే ప్రాంతంలో గండి పడింది. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి... రెండు రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి కారణంగా కాలువకు గండి పడి నీరంతా వృధాగా పోయింది. దీంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేసి... వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఇసుక బస్తాలను అడ్డుగా వేసి ప్రొక్లెయినర్‌తో కాల్వ గట్టును పటిష్ట పరుస్తున్నారు. -
ఏడిపిం‘చేను’ సాగునీరు అందక ఎండుతున్న వరి చేలు
‘గోదావరిలో జలకళ తగ్గింది. అయినంత మాత్రాన రైతులకొచ్చిన ఇబ్బందేమీ లేదు. సీలేరు జలాలను గోదావరిలోకి మళ్లిస్తున్నాం. సాగునీటిని పుష్కలంగా అందుబాటులో ఉంచుతాం. ఒక్క ఎకరాన్ని కూడా ఎండిపోనివ్వం’ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తరచూ చేస్తున్న ప్రకటనలివి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. సాగునీటి సమస్యలు అన్నదాతలను ఏడిపిస్తున్నాయి. నీరందక నై తీస్తున్న చేలు వారి కంట కన్నీరు కురిపిస్తున్నాయి. అటు గోదావరి గట్టును ఆనుకుని ఉన్న యలమంచిలి మండలం చించినాడ మొదలుకుని ఇటు దెందులూరు మండలం కొవ్వలి వరకూ రైతులను సాగునీటి సమస్య వేధిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పచ్చని పొలాలతో కళకళలాడే పశ్చిమలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. అన్నదాతకు తీవ్ర సాగునీటి కష్టం వచ్చింది. ఎండలు ముదరకుండానే పంట చేలు బీటలు వారుతున్నాయి. రబీని గట్టెక్కించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీటి ఎద్దడి కారణంగా జిల్లావ్యాప్తంగా రబీ పంట ఎండిపోయే దుస్థితి నెలకొంది. వంతులవారీ విధానంతో సాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు గాలిలో కలిసిపోవడంతో చుక్కనీరు అందక రైతన్నలు రబీపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 4.80 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లోనే నాట్లు ఆల స్యంగా పడ్డాయి. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక రైతులు నానాఇబ్బందులు పడ్డారు. సాగు చేయ డం తప్ప మరో ప్రత్యామ్నాయం తెలియని అన్నదాతలు అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు తెచ్చి మరీ పంటలు వేశారు. తెగుళ్లు, అకాల వర్షాలతో పంట చేతికొచ్చే సమయానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ఎకరానికి 35 బస్తాలు వస్తాయనుకుంటే అందులో సగం కూడా దిగుబడి రాలేదు. ఇక సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా చితికిపోయారు. కనీసం రబీ సీజన్లోనైనా గట్టెక్కుతామనుకున్న రైతన్నలకు నాట్లు వేసినప్పటినుంచీ సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, అత్తిలి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, పాలకొల్లు, పెంటపాడు, దెందులూరు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో ఎప్పుడూ లేనివిధంగా సాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో శివారు పొలాలకు నీరందే పరిస్థితి లేక పొలాలు ఎండిపోతున్నాయి. చేలు నై తీస్తున్నాయి. వంతులవారీ విధానంతో రైతుల మధ్య స్పర్థలు నెల రోజులుగా వంతుల వారీ విధానం అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. అడపాదడపా నీరి స్తున్న వంతులవారీ విధానం వివిధ గ్రామాల్లో రైతుల మధ్య చిచ్చురేపుతోంది. ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న బోదెల అడ్డుకట్టల వల్ల పల్లపు భూములకు చుక్క నీరు కూడా రావడం లేదని శివారు భూముల రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చిరుపొట్ట, పొట్ట దశలో వరి పంటకు ఎక్కువ నీరందాల్సి ఉంది. కానీ కనీసంగా కూడా పంటలను తడపలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు పంట దిగుబడులపై ప్రభా వం చూపిస్తాయని వాపోతున్నారు. ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడులు పెట్టామని, కనీస దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు రబీ పంటను గట్టెక్కించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువల వెంబడి ఉన్న పొలాలకు కాలువలో అడుగంటిన నీళ్లను ఆయిల్ ఇంజిన్ల ద్వారా మళ్లిస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో మిగిలిన నీటిని తరలించి పంటలను రక్షించుకునే యత్నం చేస్తున్నారు. కొన్ని చోట్లయితే మురుగు నీటిని సైతం తరలించే యత్నం చేస్తున్నారు. అయినప్పటికీ బీటలు వారిన పొలాలకు నీరు అందడం లేదు. చేలు తేరుకోవడం లేదు. ఫిబ్రవరి నెలాఖరు నాటికే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నెలలో ఎండలు ముదిరితే రబీ పంట పూర్తిగా ఎండిపోతుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు ఏం చేస్తున్నట్టు? సాగునీటి సమస్యతో జిల్లా రైతులు అల్లాడుతున్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి వారికి అండగా నిలవాల్సిన పాలకులు కనీస మాత్రంగా కూడా స్పందించడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నాలుగేళ్ల కిందట ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాగా, అప్పటి పాలకులు పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరిపై ఎత్తిపోతలు ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలకు నీరందించే యత్నం చేశారు. ఇప్పుడు కనీసం ఆ దిశగా కూడా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చివరికి నీరేది?
బోధన్ రూరల్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు చివరాయకట్టు కింద వేసిన వరి పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. బోధన్ మండలంలో ని డి-28 కెనాల్ ఆధారంగా పెంటకుర్దు, సాలంపా డ్, కుమ్మన్‌పల్లి, కొప్పర్తి క్యాంప్, సాలూర క్యాంప్, జాడిజమాల్‌పూర్, సాలూర, ఫతేపూర్, రాంపూర్ గ్రామాలలో 4,500 ఎకరాలలో రైతులు వరి సాగు చే స్తున్నారు. ఈ నెల 5న నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు షెడ్యుల్ ప్రకారం 19న నిలిపివేశారు కూడా! అయితే నీరు ఈ గ్రామాల పంట భూములను చేరనేలేదు. నిజాంసాగర్ నీరు వస్తుందని ఆశతో రైతన్నలు రబీ సీజన్లో వరి సాగును ప్రారంభించారు. వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ఒకవైపు కరెంటు కోతలతో రైతులు ఇ బ్బందులు పడుతుంటే, మరోవైపు సాగర్ నీరు రాకపోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. వరిసాగు చేయడానికి సుమారు ఒక ఎకరానికి రూ. 17వేలు ఖర్చవుతుంది. ఈ పెట్టుబడులు సైతం చేతికి వస్తా యో లేదోనని రైతులు వాపోతున్నారు. ఫిర్యాదు చేసినా డి-28 కెనాల్ ద్వారా నిజాంసాగర్ నీరు రావడంలేదని ఆయా గ్రామాల రైతులు నీటిపారుదల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. సాగర్ నీరు పూర్తి స్థాయిలో రాకపోవటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా కొద్దిపాటి నీరు వచ్చినా... కొప్పర్తిక్యాంప్ శివారులో మూడుచోట్ల నీరు లీకేజీల ద్వారా వృథాగా పోతోందని పేర్కొంటున్నారు. గత నెల రెండునభారీ నీటి పారుదల మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సాలూర ఎ త్తిపోతల అదనపు పైప్‌లైన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా సాలంపాడ్ గ్రామ రైతులు నీటి వృథాపై ఫిర్యాదు చేశారు. మంత్రి ఈ మేరకు కెనాల్ గండిని పూడ్చివేసి నీటి వృథాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, వారు మంత్రి ఆదేశాలను ఖాతరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికీ కొప్పర్తి క్యాంపు శివారులో నీరు వృథాగా పోతూనే ఉంది.