తెలుగుగంగకు గండి: నీటమునిగిన పొలాలు | Telugu ganga canal water flows in paddy fields | Sakshi
Sakshi News home page

తెలుగుగంగకు గండి: నీటమునిగిన పొలాలు

Published Fri, Jan 29 2016 8:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

Telugu ganga canal water flows in paddy fields

తిరుపతి : చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చినకనపర్తి గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో సమీపంలోని దిగువ పంట పొలాలు నీట మునిగాయి. ఈ కాలువకు ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇదే ప్రాంతంలో గండి పడింది.

అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి... రెండు రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి కారణంగా కాలువకు గండి పడి నీరంతా వృధాగా పోయింది. దీంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేసి... వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఇసుక బస్తాలను అడ్డుగా వేసి ప్రొక్లెయినర్తో కాల్వ గట్టును పటిష్ట పరుస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement