Telugu ganga canal
-
చిత్తూరు జిల్లాలో విషాదం నింపిన సెల్ఫీ
సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): సరదా కోసం తీసుకున్న సెల్ఫీ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి తెలుగుగంగ కాలువలో పడిన స్నేహితుడిని కాపాడేందుకు అందులోకి దిగిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం సమీపంలోని ఉబ్బలమడుగు వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ పురుషోత్తమ్‌రెడ్డి కథనం మేరకు.. ఈ నెల 6న చెన్నైకి చెందిన నూతన దంపతులు ప్రియ, లోకేష్ ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి బయలుదేరారు. మార్గంమధ్యలో గుమ్మిడిపూండి వద్ద తన స్నేహితులైన కార్తీక్, బాలాజీ, యువరాజును కూడా వెంట తీసుకెళ్లారు. కోవిడ్ నిబంధనలతో ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రాన్ని మూసివేయడంతో పక్కనే ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువ వద్ద కాసేపు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఇంతలో యువరాజు సెల్ఫీ తీసుకుంటూ కాలువలోకి జారిపడ్డాడు. దీన్ని గమనించిన స్నేహితులు లోకేష్ (23), కార్తీక్ (17), బాలాజీ (24) కాలువలోకి దూకి యువరాజును కాపాడబోయారు. అయితే ప్రవాహ తాకిడికి ముగ్గురు యువకులు నీటిలో మునిగి కొట్టుకుపోయారు. యువరాజు మాత్రం నీటిప్రవాహాన్ని ఎదురొడ్డి గట్టుకు చేరాడు. యువరాజు, ప్రియ కలిసి కాలువ వెంట కొంతదూరం వరకు యువకుల ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం దక్కలేదు. ముగ్గురు యువకులు ఎలాగైనా బయటపడి తిరిగొస్తారని వేచిచూసిన ప్రియ, యువరాజు ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి వరదయ్యపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టగా సత్యవేడు మండలం రాచపాళెం సమీపంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని లోకేష్, బాలాజీలుగా గుర్తించారు. కార్తీక్ మృతదేహం కోసం తమిళనాడు పూండి కాలువ వరకు గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
కష్టాలు తొల‘గంగ’
తెలుగుగంగ..గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వర్షాలు సమృద్ధిగా కురిసి..సాగునీరు పుష్కలంగా ఉన్నా రైతులు రెండు పంటలు వేసుకోలేని దుస్థితి. ఎన్నో ఏళ్లుగా కాల్వ లైనింగ్ చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఏర్పడేవి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి..పనులు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. కర్నూలు సిటీ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నీరు పారకుండానే నిధులు పారించింది. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచి.. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు లబ్ధి చేకూర్చింది. అయితే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం..సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజా ధనాన్ని దురి్వనియోగపర్చకుండా రివర్స్ టెండర్ల ద్వారా పనులు చేయిస్తోంది. తెలుగుగంగ కాలువకు లైనింగ్ పనులు ఈ కోవకు చెందినవే. సుమారు రూ.320 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా పిలిచి.. జ్యూడీíÙయల్ కమిటీ నిర్ధారించిన తరువాత పనులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవలే పనులు మొదలు పెట్టారు. లైనింగ్‌తో ఆయకట్టుకు సమృద్ధిగా నీరు.. తెలుగుగంగ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు 18.20 కి.మీ వరకు లైనింగ్ లేదు. దీంతో సాగు నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కాల్వ సామర్థ్యం 5 వేల క్యూసెక్కులు ఉండగా.. లైనింగ్ లేకపోవడంతో నీరు దిగువకు వెళ్లని పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల చివరి ఆయకట్టుతో పాటు వైఎస్సార్ జిల్లాకు సాగు నీరు అందేది కాదు. ప్రతి ఏటా సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చేది. ఈ పనులను టీడీపీ ప్రభుత్వం 3.5 ఎక్సెస్ రేటుకు టెండర్లను టీడీపీకి చెందిన నేతకు కట్టబెట్టింది. అయితే పనులు మొదలు పెట్టకపోవడంతో రద్దు చేసి.. రివర్స్ టెండర్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో గతంలో ఎక్సెస్ కంటే తక్కువకు టెండర్లు వేసి పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. ఈ రివర్స్ టెండర్లతో ప్రభుత్వానికి రూ.12 కోట్లకుపైగా ఆదా అయినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. కాల్వ లైనింగ్‌తో పాటు పూడిక తీత పనులు రూ.320 కోట్లతో చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌కు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులకు ఇసుక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన జల వనరుల శాఖ సమీక్షలో ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయితే రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలయ్యాయి.. తెలుగుగంగ లైనింగ్ పనులు ఇటీవలే మొదలు అయ్యాయి. అటవీ ప్రాంతంలో ఇబ్బందులు ఉండేవి. ఆ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాం. రివర్స్ టెండర్ల ద్వారా 4 శాతం నిధులు ఆదా అయ్యాయి. – ఆర్.మురళీనాథ్‌రెడ్డి, జల వనరుల శాఖ సీఈ -
తీరనున్న ‘గంగ’ బెంగ
సాక్షి ప్రతినిధి కడప : తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. వరదకాలంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీరివ్వాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం మిగిలిపోయిన ఈ పనులను చేపడుతోంది. కర్నూలు జిల్లాలో తెలుగుగంగ ప్రధానకాలువ 0 కిలోమీటరు నుండి 42.566 కిలోమీటరు వరకు లైనింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోపాటు బనకచర్లక్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ నుండి వెలిగోడు రిజర్వాయరు వరకు లింక్ కెనాల్ 0 కిలోమీటరు నుండి 7.830 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు నిలిచిపోయాయి. మొత్తంగా దాదాపు 50 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. లైనింగ్ పనులు పూర్తయితేనే మన జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన ఎస్సార్–1,ఎస్సార్–2 సబ్సిడరీ రిజర్వాయర్లతో పాటు 17.730 టీఎంసీల సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లకు çసక్రమంగా నీరు చేరుతుంది. ప్రస్తుతం ప్రధాన కాలువ సామర్థ్ద్యం పేరుకు 5 వేల క్యూసెక్కులు అంటున్నా...2,500 క్యూసెక్కులకు మించి నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. ఈ ఏడాది స్థానికంగానే కాక ఎగువన భారీ వర్షాలు కురిసి శ్రీశైలం నిండి దిగువకు పెద్ద ఎత్తున కృష్ణాజలాలు చేరా యి. జిల్లాలోని గండికోట, మైలవరం, చిత్రావతి, వామికొండ, సర్వారాయసాగర్తో పాటు చిన్నచిన్న సాగునీటి వనరులకు నీరు చేరింది. కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరందింది. కాలువలు సామర్థ్యం తక్కువగా ఉండడంతో తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని నీటివనరులకు పూర్తి సామర్థ్యం మేరనీరు చేరలేదు. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 17.73 టీఎంసీలు కాగా, ఎస్ఆర్–1, ఎస్ఆర్–1 సబ్సిడరీ రిజర్వాయర్ల సామర్థ్యం మరో నాలుగు టీఎంసీలు ఉంది. దాదాపు 22 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 11 టీఎంసీలు కూడా చేరలేదు. దీంతో 1.77 లక్షల ఎకరాల ఆయకట్టులో పట్టుమని 50 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు చేరిన పరిస్థితి లేదు. ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ప్రధాన కాలువ లైనింగ్ పనులను పట్టించుకోలేదు. చివరిలో కాంట్రాక్టర్ల కోసం అంచనాలు పెంచుకుని టెండర్లు పిలువగా సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టు 2.89 శాతం అధిక ధరలకు కోట్ చేసి పనులు దక్కించుకుంది. దీనివల్ల ప్రభుత్వంపై కోట్లాది రూపాయల అదనపు భారం పడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ విధానంలో సదరు పనులకు రూ. 239.04 కోట్లతో టెండర్లు నిర్వహించింది. సోమవారమే అధికారులు ఫైనాన్స్ బిడ్ తెరిచారు. ఆ తర్వాత నిర్వహించిన ఇ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్)లో 1.32 శాతం తక్కువ కోడ్ చేసిన రాఘవ కన్క్షషన్ పనులు దక్కించుకుంది. రివర్స్ టెండరింగ్‌తో రూ. 10.06 కోట్లు ఆదా అయ్యాయి. కరువునేపారదోలేలక్ష్యం ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమతోపాటు కడప జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదలగా, అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో కరువును పారదోలేందుకు సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని నిర్ణయించింది. కొత్త ప్రాజెక్టులతోపాటు గాలేరు–నగరి, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు చెందిన ప్రధాన కాలువలను విస్తరించనుంది. 40 రోజుల వరద కాలంలోనే నీటిని దిగువకు తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం యుద్ధ్ద ప్రాతిపదికన ఈ పనులు చేపడుతోంది. తెలుగుగంగ లైనింగ్ పనులు పూర్తయితే సకాలంలో దిగువకు నీరు చేరి ప్రాజెక్టు పరిధిలోని 1.77 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ప్రభుత్వం కాలువ ఆ«ధునికీకరణ పనులకు టెండర్లు పిలువడంపై ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. -
తెలుగుగంగలో ‘రివర్స్’
సాక్షి, అమరావతి: తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనులకు రూ.239.04 కోట్లతో సోమవారం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో షెడ్యూళ్ల డౌన్లోడ్, దాఖలుకు ఈనెల 23వ తేదీ తుదిగడువు. 24న ప్రీ–క్వాలిఫికేషన్ బిడ్ తెరుస్తారు. 27న ఉదయం 11 గంటలకు ప్రైస్ బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి అదేరోజు మధ్యాహ్నం రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించాల్సిందిగా సూచిస్తూ సీవోటీ(కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి ప్రతిపాదనలు పంపనున్నారు. గతంలో సీఎం రమేష్ సంస్థకు పనులు.. - తెలుగుగంగ ప్రధాన కాలువలో లైనింగ్ పనులకు రూ.239.04 కోట్లతో ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీ సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ పాటు ష్యూ (ఎస్ఈడబ్ల్యూ) ఇన్ఫ్రా సంస్థ షెడ్యూళ్లు దాఖలు చేయగా సాంకేతిక బిడ్‌లో ‘ష్యూ’పై అనర్హత వేటు వేశారు. - అనుభవం ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన రిత్విక్‌పై వేటు వేయాలని ‘ష్యూ’ సంస్థ ఆధారాలతో ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కి అధిక ధరలకు కోట్ చేసిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సింగిల్ బిడ్‌ను ఆమోదించింది. దీనివల్ల ఖజానాపై రూ.6.91 కోట్ల భారం పడింది. - పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువ ధరలకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి ఖజానాకు రూ.23.90 కోట్లు మిగిలేవి. కానీ గత సర్కార్ అధిక ధరలకు పనులు కట్టబెట్టడం వల్ల మొత్తమ్మీద ఖజానాపై రూ.30.81 కోట్ల భారం పడింది. - వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అక్రమాలను గుర్తించి ఈ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు తెలుగుగంగ అధికారులు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పనుల్లో ఖజానాకు భారీ ఎత్తున ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. -
తెలుగు గంగలో పడి విద్యార్థి గల్లంతు
సాక్షి, బుచ్చినాయుడుకండ్రిగ : చిత్తూరుజిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంకాటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండుగకు అక్క ఇంటికి వచ్చిన ఓ బాలుడు తెలుగుగంగ మెయిన్ కాలువలో పడి గల్లంతయ్యాడు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఏఎంపుత్తూరుకు చెందిన నాదముని కుమారుడు సాయి (15) పదో తరగతి చదువుతున్నాడు. పండుగకు కాటూరు గ్రామం అరుంధతివాడలోని అక్క ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం తెలుగుగంగ కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లగా కాలు జారి నీటిలో పడిపోయాడు. ఇది గమనించిన మరో యువకుడు ఇంటికెళ్లి సమాచారమందించగా సాయి కోసం స్థానికులు కాలువలో గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. శనివారం గజ ఈతగాళ్లు వచ్చి గాలించినా ఫలితం లేకపోయింది. బంధువులు కాలువ వద్దనే ఉండి అతడి కోసం వేచి చూస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
తెలుగు గంగ కాలువకు గండి
మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి దగ్గర తెలుగు గంగ కాలువకు గండి పడింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని 13వ బ్లాక్ కాలువకు గండిపడటంతో భారీగా నీరు పోతోంది. కాలువ నీరు గ్రామంలోకి చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి బ్లాక్ గేట్లను మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. -
తెలుగుగంగ కాలువకు మళ్లీ గండి
తిరుపతి : చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చినకనపర్తి గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువకు మళ్లీ శనివారం ఉదయం గండిపడింది. దీంతో సమీపంలోని దిగువ పంట పొలాలు మరోసారి నీట మునిగాయి. శుక్రవారం యుద్ధ ప్రాతిపదికిన అధికారులు ఈ కాలువకు మరమ్మతులు చేశారు. పనుల నాసిరకంగా ఉండటం వల్ల వెంటనే మళ్లీ కాలువకు గండి పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఈ కాలువకు ఇదే ప్రాంతంలో గండి పడిన సంగతి తెలిసిందే.అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి... రెండు రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి కారణంగా కాలువకు గండి పడి నీరంతా వృధాగా పోయింది. దీంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేసి శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. -
తెలుగుగంగకు గండి: నీటమునిగిన పొలాలు
తిరుపతి : చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చినకనపర్తి గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో సమీపంలోని దిగువ పంట పొలాలు నీట మునిగాయి. ఈ కాలువకు ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇదే ప్రాంతంలో గండి పడింది. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి... రెండు రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి కారణంగా కాలువకు గండి పడి నీరంతా వృధాగా పోయింది. దీంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేసి... వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఇసుక బస్తాలను అడ్డుగా వేసి ప్రొక్లెయినర్‌తో కాల్వ గట్టును పటిష్ట పరుస్తున్నారు. -
'కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'
డక్కిలి: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా డక్కిలి మండలం తీర్థంపాడు, ఆమడూరు గ్రామాల్లో జరిగిన 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, ఈ ఏడాది అదనంగా మరో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. ఎఫ్ఎస్, తెలుగు గంగ కెనాళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. -
నీటి కోసం రైతుల ఆందోళన
నాయుడుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగు నీటి కోసం రైతుల మధ్య వాగ్వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇటీవల అధికారులు తెలుగు గంగ కాలువకు 20 టీఎంసీల నీటిని వదిలారు. స్వర్ణముఖి నదికి చేరుకునే ఈ నీరు నదికి రెండు వైపులా ఉన్న కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట మండలాల వారి తాగు, సాగు అవసరాలను తీరుస్తుంది. అయితే, కాస్త ఎగువన ఉన్న నాయుడుపేట రైతుల భూములకు ఈ నీరు అందదు. దీంతో వారు స్వర్ణముఖి నదికి అడ్డుగా కట్ట నిర్మించారు. దీనిని రెండు రోజుల క్రితం దిగువ మండలాల రైతులు వచ్చి తెంపేశారు. నాయుడుపేట మండల రైతులు జేసీబీలను తెచ్చి నిన్న మళ్లీ కట్ట నిర్మించారు. కాగా, ఆదివారం దిగువ మండలాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు అక్కడికి వచ్చి, అడ్డుకట్టను తెంపేందుకు యత్నించగా నాయుడుపేట రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ విషయం తెలిసిన ఇరు వర్గాల రైతులు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకోవటం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఎంత నిర్లక్ష్యం.. ఏమిటీ దౌర్భాగ్యం?
సాక్షి ప్రతినిధి, కడప: ‘అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా ఉంది జిల్లా యంత్రాంగం తీరు. ఒకటిన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన తెలుగుగంగ కెనాల్ దుస్థితి అందుకు అద్దం పడుతోంది. బ్రహ్మసాగర్‌కు చేరాల్సిన నీరు భూగర్భంలోకి వెళ్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. స్పందించిన ప్రజాప్రతినిధుల్ని సైతం నీరుగార్చే చర్యలకు పాల్పడుతున్న వైనమిది. తెలుగుగంగ కెనాల్ పరిధిలోని ఎస్ఆర్-1 కాలువ 98వ కిలోమీటర్ నుంచి 108 కిలోమీటర్ వరకూ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. అక్కడక్కడ పూడిక పేరుకుపోయింది. వెలుగోడు నుంచి సాగునీరు విడుదలకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అయితే నీరు భూగర్భంలోకి ఇంకిపోతుందనే ఆందోళన ఆయకట్టుదారుల్లో మెండుగా ఉంది. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, జయరాములు దృష్టికి తీసుకెళ్లారు. వారు రైతులతో కలిసి కాలువ పనులను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే నీరంతా నిష్ర్పయోజనమవుతుందని అధికారులకు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిందిగా కోరారు. అయితే నిధుల్లేవని, ఇప్పుడే పనులు చేపట్టలేమని అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అభ్యర్థన... ఎంపీ స్పందన తెలుగుగంగ కెనాల్‌ను గత బుధవారం పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అక్కడి నుంచే అధికారులకు ఫోన్లో వివరించారు. నిధులు లేవని జవాబు రావడంతో వెంటనే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.10లక్షలు గ్రాంటు ఎంపీ కోటా ద్వారా మంజూరు చేయాలని కోరారు. ఎంపీ వెంటనే జిల్లా కలెక్టర్ కేవీ రమణకు లేఖ రాశారు. తన నిధుల నుంచి తెలుగుగంగ కాలువలో 98 కిలోమీటరు నుంచి 108 కిలోమీటర్ వరకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. లెటర్ రెఫరెన్సు నెం.173/2014 ద్వారా కోరారు. అయితే ఎంపీ ఫండ్స్ కెనాల్‌కు ఖర్చు చేయరాదని పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించారు. మరీ ఇరిగేషన్ విభాగం నుంచి ఏమైనా ఖర్చుచేసి మరమ్మతులు నిర్వహిస్తారంటే అదీ లేదు. తెలుగుగంగ కె నాల్ 5వేల క్యూసెక్కులు సామర్థ్యంతో నిర్మించింది. ప్రస్తుతం 400 క్యూసెక్కులు వదిలితే కేవలం 150క్యూసెక్కులు మాత్రమే రాగలవని ఇంజనీరింగ్ అధికారులే వివరిస్తున్నారు. పూర్తి స్థాయి నీరు వదిలితే, గండ్లు పడక తప్పని పరిస్థితి. అలాంటి స్థితిలో శరవేగంగా నిర్వహించాల్సిన మరమ్మత్తుల్లో కూడ అధికారయంత్రాంగం నిర్లక్ష్యం వీడడంలేదని ఆయకట్టుదారులు వాపోతున్నారు. -
ఆయకట్టు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి
కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువ సాగునీటి విడుదలపై అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభా నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సాగునీటి వాటాను సాధించేందుకు ఆయకట్టు రైతులకు తాము అండగా నిలబడతామని ఆమె అన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రితో చర్చించి రైతులకు రబీ సీజన్‌కు సాగునీరు అందేలా చూస్తామని శోభానాగిరెడ్డి హామీ ఇచ్చారు.