చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చినకనపర్తి గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువకు మళ్లీ శనివారం ఉదయం గండిపడింది.
తిరుపతి : చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చినకనపర్తి గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువకు మళ్లీ శనివారం ఉదయం గండిపడింది. దీంతో సమీపంలోని దిగువ పంట పొలాలు మరోసారి నీట మునిగాయి. శుక్రవారం యుద్ధ ప్రాతిపదికిన అధికారులు ఈ కాలువకు మరమ్మతులు చేశారు. పనుల నాసిరకంగా ఉండటం వల్ల వెంటనే మళ్లీ కాలువకు గండి పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఈ కాలువకు ఇదే ప్రాంతంలో గండి పడిన సంగతి తెలిసిందే.అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి... రెండు రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి కారణంగా కాలువకు గండి పడి నీరంతా వృధాగా పోయింది. దీంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేసి శుక్రవారం మరమ్మతులు చేపట్టారు.