బోధన్ రూరల్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు చివరాయకట్టు కింద వేసిన వరి పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. బోధన్ మండలంలో ని డి-28 కెనాల్ ఆధారంగా పెంటకుర్దు, సాలంపా డ్, కుమ్మన్‌పల్లి, కొప్పర్తి క్యాంప్, సాలూర క్యాంప్, జాడిజమాల్‌పూర్, సాలూర, ఫతేపూర్, రాంపూర్ గ్రామాలలో 4,500 ఎకరాలలో రైతులు వరి సాగు చే స్తున్నారు. ఈ నెల 5న నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు షెడ్యుల్ ప్రకారం 19న నిలిపివేశారు కూడా! అయితే నీరు ఈ గ్రామాల పంట భూములను చేరనేలేదు. నిజాంసాగర్ నీరు వస్తుందని ఆశతో రైతన్నలు రబీ సీజన్‌లో వరి సాగును ప్రారంభించారు.
వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ఒకవైపు కరెంటు కోతలతో రైతులు ఇ బ్బందులు పడుతుంటే, మరోవైపు సాగర్ నీరు రాకపోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. వరిసాగు చేయడానికి సుమారు ఒక ఎకరానికి రూ. 17వేలు ఖర్చవుతుంది. ఈ పెట్టుబడులు సైతం చేతికి వస్తా యో లేదోనని రైతులు వాపోతున్నారు.
ఫిర్యాదు చేసినా
డి-28 కెనాల్ ద్వారా నిజాంసాగర్ నీరు రావడంలేదని ఆయా గ్రామాల రైతులు నీటిపారుదల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. సాగర్ నీరు పూర్తి స్థాయిలో రాకపోవటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా కొద్దిపాటి నీరు వచ్చినా... కొప్పర్తిక్యాంప్ శివారులో మూడుచోట్ల నీరు లీకేజీల ద్వారా వృథాగా పోతోందని పేర్కొంటున్నారు.
గత నెల రెండునభారీ నీటి పారుదల మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సాలూర ఎ త్తిపోతల అదనపు పైప్‌లైన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా సాలంపాడ్ గ్రామ రైతులు నీటి వృథాపై ఫిర్యాదు చేశారు. మంత్రి ఈ మేరకు కెనాల్ గండిని పూడ్చివేసి నీటి వృథాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, వారు మంత్రి ఆదేశాలను ఖాతరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికీ కొప్పర్తి క్యాంపు శివారులో నీరు వృథాగా పోతూనే ఉంది.
చివరికి నీరేది?
Published Thu, Feb 20 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement