రాష్ట్రానికి పెరిగిన ఐఏఎస్‌ పోస్టుల సంఖ్య 28 | Number of IAS posts increased to the state is 28 | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి పెరిగిన ఐఏఎస్‌ పోస్టుల సంఖ్య 28

Published Thu, Nov 16 2017 2:22 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Number of IAS posts increased to the state is 28

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఐఏఎస్‌ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్‌ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్‌ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్‌ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. అంటే కొత్తగా 28 పోస్టులు పెరిగినట్లు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement