సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాగానే 90 శాతం హామీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటేనే చంద్రబాబు భయపడ్డారన్నారు. (చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డు)
‘కరోనా పేరుతో ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై చంద్రబాబు ఎన్నో అడ్డంకులు యత్నించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇచ్చింది చంద్రబాబే. వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించి వార్తలు రాస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే విజయం. పంచాయతీ ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు వైఎస్సార్‌సీపీదే గెలుపు. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని’’ గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
‘‘అయ్యన్న పాత్రుడు ఒక గంజాయి డాన్. ఎన్నికల ఫలితాలు పక్కదారి పట్టించేందుకు అయ్యన్నపాత్రుడుతో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేయించారు. పరిషత్ ఎన్నికలపై అయ్యన్న ఎందుకు నోరు మెదపడం లేదని’’ గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment