సాక్షి, హైదరాబాద్ : ఏ పార్టీ మద్దతు లేకుండానే రాష్ట్రంలోని 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోబోతున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని అన్నారు. తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని.. దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా టీఆర్‌ఎస్ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఇది అసాధారణ విజయమని చెప్పారు.ఆరు జిల్లాలో ప్రత్యర్థులు ఖాతానే తెరవలేదని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు తమపై బాధ్యత పెంచిందన్నారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం శ్రమించిన గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment