పరిషత్ పోరులో గులాబీ గుబాళిం చింది. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కచోట కూడా కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 451 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొం దగా, కాంగ్రెస్ 73 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు దూసుకుపోయింది.