![Mother And Daughter Win In ZPTC And MPTC Elections - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/5/mother.jpg.webp?itok=QjM8B9pM)
కోవ అరుణ, కోవ లక్ష్మి
ఆసిఫాబాద్: పరిషత్ ఎన్నికల్లో కుమురంభీం జిల్లాలో తల్లీ కూతుళ్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోవ లక్ష్మి పరిషత్ ఎన్నికల్లో జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో దిగగా, కూతురు కోవ అరుణ సిర్పూర్(యు) నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో కోవ లక్ష్మి జైనూర్ జెడ్పీటీసీగా ఏకగ్రీవం కాగా, మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో కూతురు అరుణ సిర్పూర్(యు) జెడ్పీటీసీగా 5,088 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థిపై 3,444 ఓట్ల మెజార్టీ సాధించి ఘనవిజయం సాధించారు.
జిల్లాలోని రెండు జెడ్పీటీసీ స్థానాలు తల్లీ కూతుళ్లు కైవసం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలోని అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన కోవ లక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కానుంది.
Comments
Please login to add a commentAdd a comment