అప్‌డేట్స్‌ : జడ్పీటీసీ ఫలితాల్లో కనబడని కాంగ్రెస్‌ | Counting Of Parishad Poll Votes Today | Sakshi
Sakshi News home page

అప్‌డేట్స్‌ : కొనసాగుతున్న పరిషత్‌ ఓట్ల లెక్కింపు

Published Tue, Jun 4 2019 2:53 AM | Last Updated on Tue, Jun 4 2019 6:25 PM

Counting Of Parishad Poll Votes Today - Sakshi

  • ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటినిచ్చిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ ఫలితాల్లో బొక్కబోర్లాపడింది. ఒక్క కామారెడ్డిలో తప్ప మరెక్కడా కూడా కాంగ్రెస్‌ తన బలాన్ని ప్రదర్శించలేకపోయింది. కామారెడ్డిలో కూడా టీఆర్‌ఎస్‌ 14స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్‌ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగతా జిల్లాల్లో కాంగ్రెస్‌ ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది.
  • టీఆర్‌ఎస్‌ మంత్రి మల్లారెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన సొంత మనుషులను గెలిపించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అల్లుడు ఓటమి చెందగా.. నేడు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన బామ్మర్ది కూడా పరాజయం పాలయ్యాడు.
  • ఎంపీటీసీ ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. మొత్తం 5817 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 3379 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్‌ 1290, బీజేపీ 201, ఇతరులు 577 స్థానాల్లో విజయం సాధించారు.
  • భువనగిరి మండలం వీరెల్లి ఎంపీటీసీ స్థానంలో 3 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించగా...  ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్ కోరాడు. దీంతో రీకౌంటింగ్‌లో ఇరువురికి సమాన ఓట్లు వచ్చాయి. చివరకు టాస్ వేయగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని విజయం వరించింది.

  •  నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 349 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 191, కాంగ్రెస్‌ 132, బీజేపీ 3, సీపీఎం 5, సీపీఐ 2, ఇతరులు 16 స్థానాలను కైవసం చేసుకున్నారు.
  • మేడ్చల్ జిల్లాలోని 5 మండలాల్లో మొత్తం 42 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 18, కాంగ్రెస్‌ 13, బీజేపీ 1, స్వతంత్రులు 10స్థానాలను కైవసం చేసుకున్నారు. 

  • రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ 128, కాంగ్రెస్ 76, బీజేపీ 18, స్వతంత్రులు 26, ఇతరులు 9 ఎంపీటీసీలను గెలుచుకున్నారు 

  • నిజామాబాద్ జిల్లాలో 299 ఎంపీటీసీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 188,  కాంగ్రెస్‌ 39, బీజేపీ 32, స్వతంత్రులు 27 స్థానాల్లో విజయం సాధించారు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొత్తం 123 ఎంపిటిసి స్థానాలకు గానూ..  టీఆర్‌ఎస్‌ 72, కాంగ్రెస్‌ 18, బీజేపీ 8, స్వతంత్రులు 25స్థానాల్లో విజయం సాధించారు. 
  • జగిత్యాల జిల్లాలోని మొత్తం 214 ఎంపీటీసీ స్థానాల్లో.. టీఆర్‌ఎస్‌ 142, కాంగ్రెస్‌ 36, బీజేపీ 19, స్వతంత్రులు 17స్థానాల్లో గెలుపొందారు. 
  • కరీంనగర్ జిల్లాలోని మొత్తం 178 ఎంపీటీసి స్థానాల్లో.. టీఆర్ఎస్‌ 99, కాంగ్రెస్‌ 26, బీజేపీ 15, సీపీఐ 3, స్వతంత్రులు 31, టీడీపీ 1, టీఆర్ఎస్‌ రెబల్‌ 2, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1 స్థానంలో గెలుపొందింది.

  • రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 10 చోట్ల, స్వతంత్రులు 3 చోట్ల గెలుపుపొందారు. 

  • నారాయణపేట జిల్లాలో మొత్తం 140 ఎంపీటీసీలు ఉండగా.. టీఆర్ఎస్ 86, కాంగ్రెస్‌ 18, బీజేపీ 25, ఇతరులు 11 మంది గెలుపొందారు.
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 168 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ 106 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ 37, బీజేపీ 6, ఇతరులు 10స్థానాల్లో గెలుపొందారు.
  • వనపర్తి జిల్లాలో.. మొత్తం 127 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ 77స్థానాల్లో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్‌ 7, ఇతరులు 13స్థానాల్లో విజయఢంకా మోగించారు.
  • జోగులాంబ గద్వాల జిల్లాలో.. మొత్తం 138 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ 36, కాంగ్రెస్‌ 2, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
  • ఖమ్మం జిల్లాలో సీపీఎం తన పట్టును కోల్పోతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమనేని వీరభద్రం స్వగ్రామం తెల్దారుపల్లిలో, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ స్వగ్రామం నారాయణ పురంలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని సీపీఎం పార్టీ మొదటిసారి ఓటమిని చవిచూసింది. ఈ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.  
  • 5817 ఎంపీటీసీలకు గాను 2436 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ 1584, కాంగ్రెస్‌ 502, బీజేపీ 99, ఇతరులు 251 చోట్ల విజయం సాధించారు.
  • 538 జెడ్పీటీసీలకు గాను 5 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 0, బీజేపీ 0, ఇతరులు 0 విజయం సాధించారు.
  • చేవెళ్ల మండలంలో.. 17 ఎంపీటీసీలకు గాను.. కాంగ్రెస్‌ 5, టీఆర్‌ఎస్‌ 3 చోట్ల గెలుపు 
  • కరీంనగర్‌ జిల్లా : జమ్మికుంట మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 7, టీఆర్‌ఎస్‌ రెబల్‌ 2, స్వతంత్రులు ఒకచోట విజయం
  • నిజామాబాద్ - ఆర్మూరు ఎంపీపీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌ 09, బీజేపీ 04, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్లుడే 1, మరోస్థానంలో ఫలితం వెలువడాల్సి ఉంది.
  •  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 25, బీజేపీ 10, స్వతంత్ర్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. 
  • మేడ్చల్ జిల్లా - కీసర మండలం అంకిరెడ్డి పల్లి స్వతంత్ర అభ్యర్థి కవిత 301 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం.
  • నిజామాబాద్ జిల్లా - వర్ని మండలం శంకోర టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి మూడ్ పద్మ వసంత్ రావు 74 తో గెలుపు
  • ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం లచ్చన్నగూడెం టిఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరవు 1000 ఓట్లతో గెలుపు
  • ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం రామన్నపాలెం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పుచ్చకాయల లక్ష్మి 1048 ఓట్లతో గెలుపు
  • నిజామాబాద్ జిల్లా - ఆర్మూర్ మండలం ఆలూరు-2 టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ గెలుపు
  • మెదక్ - నార్సింగ్ మండలం శేర్‌పల్లి కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి 167 ఓట్ల మెజార్టీతోవిజయం
  • నిజామాబాద్ - నందిపేట్ మండలం నూత్‌పల్లి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు
  • నిజామాబాద్ - జిల్లా అన్నారం గ్రామ బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు
  • నిజామాబాద్ - బోధన్ మండలం కొప్పర్గ టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి 303 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • భద్రాద్రి కొత్తగూడెం - ఆళ్లపల్లి మండలం అనంతోగు టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మంజుభార్గవి గెలుపు
  • సంగారెడ్డి జిల్లా-సంగారెడ్డి మండలం కోతలాపూర్‌ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి సమీల్ 36 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పై గెలుపొందారు.
  • సంగారెడ్డి జిల్లా-కంది మండలం ఎద్దుమైలారం-4లో ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి తమ్మిరెడ్డి శ్రీనివాస్ 57 ఓట్లతో గెలుపొందారు.
  • భూపాలపల్లి జిల్లా- మహదేవ్‌పూర్‌ మండలం అంబటిపల్లి, సూరారం గ్రామాల్లోని బ్యాలెట్‌ పేపర్లు చెదలు పట్టాయి. ఈ విషయాన్ని డీపీవో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ కౌంటింగ్‌ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు.
  • ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ గ్రామ పరిధిలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద విలేకరులు ఆందోళన చేపట్టారు. మీడియా సెంటర్‌లోకి సెల్ ఫోన్లు అనుమతించక పోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ :

  • ఖమ్మం జిల్లా-మధిర మండల జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో..36 ఓట్లకు గాను.. టీఆర్‌ఎస్‌ 25, కాంగ్రెస్‌ 11
  • జగిత్యాల జిల్లా-గొల్లపల్లి మండల జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో.. 30 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్‌ 24, కాంగ్రెస్‌ 4 , రిజెక్టు 2
  • జగిత్యాల జిల్లా- మెట్‌పల్లి మండల జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో.. 18 ఓట్లు పోలవగా టీఆర్‌ఎస్‌ 6, బీజేపీ 10, స్వతంత్రులకు 2 ఓట్లు వచ్చాయి.
  • జగిత్యాల జిల్లా-మల్లాపూర్‌ మండల జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో..7 ఓట్లు పోలవగా.. 5 ఓట్లు రిజెక్టు అయ్యాయి. టీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 1
  • జగిత్యాల జిల్లా-కథలాపూర్‌ మండల జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో..12 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 6, నోటా 1
  • పెద్దపల్లి జిల్లా- ముత్తారం మండల జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో..28 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్‌ 14, కాంగ్రెస్‌ 14

సాక్షి, హైదరాబాద్‌ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నానానికి ఫలితాల సరళి తెలియనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లోని 978 కౌంటింగ్‌ హాళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటలలోపే సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ సెంటర్లకు తరలించారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు.  

35,529 మంది కౌంటింగ్‌ సిబ్బంది... పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు మొత్తం 35,529 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు. ముందుగా పోలింగ్‌ కేంద్రాల వారీగా బ్యాలెట్‌ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. ఆ తర్వాత వీటిని బండిల్‌ చేసిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్‌లో 25 బ్యాలెట్‌ పత్రాలు చుడతారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్‌ మొదలవుతుంది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల, రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ బ్యాలెట్‌ బాక్స్‌ను తెరిచి, వాటిలోని బ్యాలెట్‌ పత్రాలను కుప్పలుగా పోసి 25 చొప్పున కట్టలు చేస్తారు. ఇలా ఒక్క రౌండ్‌లో వెయ్యి ఓట్లను కట్టలుగా చేస్తారు. మొత్తం కట్టలు చేసిన తర్వాత ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తారు.

ఈ ప్రక్రియలో కట్టలు చేయడం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. అందువల్ల మధ్యాహ్నం 12 తర్వాతే బ్యాలెట్‌ పత్రాలను లెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపునకు ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలని ఎస్‌ఈసీ సూచించింది. ప్రతి బ్యాలెట్‌ పత్రాన్ని విప్పి అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ఎదుటే పరిశీలిస్తారు. ఏజెంట్‌కు చూపించాక చెల్లుబాటయ్యే బ్యాలెట్‌ పత్రాలను ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారు. ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే రిటర్నింగ్‌ అధికారుల పరిశీలనకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అంతేతప్ప అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాలు పట్టుకునే వీలుండదు. పరిశీలన కోసం ఏజెంట్లకు బ్యాలెట్‌ పత్రాలు ఇవ్వరు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్‌ అధికారులదే తుది నిర్ణయమని ఎస్‌ఈసీ ఇదివరకే స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పరిషత్‌ ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు ఫలితాలు... 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు అంటూ వైబ్‌సైట్‌లో ఆప్షన్లు ఇచ్చిన చోట క్లిక్‌ చేస్తే అప్పటివరకు కౌంటింగ్‌ పూర్తయిన స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగనున్నందున ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారనేది ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలు కల్పించారు. ఓట్ల లెక్కింపు వేగం పుంజుకుంటున్న కొద్దీ మధ్యాహ్నం తర్వాత పరిషత్‌ ఫలితాల సరళి వెల్లడి కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్‌ పత్రాలను విడివిడిగా బండిళ్లు చేయడానికి అధిక సమయం పట్టనున్నందున మధ్యాహ్నం తర్వాతే వాటిని లెక్కించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్‌ సరళిని బట్టి ఏడెనిమిది రౌండ్ల తర్వాత ఈ ఫలితాల ట్రెండ్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల సందర్భంగా అభ్యర్థులు, వారి అభిమానులు ర్యాలీలు నిర్వహించకుండా ఎస్‌ఈసీ ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు తీరును ప్రధాన కార్యాలయంలోని మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్, ఇతరత్రా ఏర్పాట్ల ద్వారా ఎస్‌ఈసీ అధికారులు పర్యవేక్షించనున్నారు.  

21,356 మంది అభ్యర్థులు.. 
ఈ ఎన్నికల్లో మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 21,356 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మూడు విడతలు కలుపుకుని 5,659 ఎంపీటీసీ స్థానాలకు 18,930 మంది, 534 జెడ్పీటీసీ స్థానాలకు 2,426 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి సగటున ముగ్గురు చొప్పున, ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి సగటున ఐదుగురు చొప్పున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే నెల 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 27న ఈ ఎన్నికల కౌంటింగ్‌నకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆ తర్వాత జూన్‌ 4కు మార్చిన విషయం తెలిసిందే. పాత పాలక మండళ్లు, సభ్యుల పదవీకాలం ముగియకుండానే కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కొత్త పీఆర్‌ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలు ప్రకటించాక, 7న ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 8న జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లను ఎన్నుకునే అవకాశం ఏర్పడింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement