Parishad election
-
‘కొటియా’ క్లస్టర్లో ఏపీ జెండా రెపరెప
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య కోరాపుట్ జిల్లాలోని కొటియా పల్లెల ప్రజలు తాము ఏపీలోనే ఉంటామని బ్యాలెట్ ద్వారా ఒడిశా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా కొటియా క్లస్టర్ పరిధిలో పొట్టంగి జోన్–1 స్థానానికి ఫిబ్రవరి 18న పోలింగ్ జరిపించింది. అదే నెల 26న ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున ఫలితం ప్రకటించారు. మహిళలకు కేటాయించిన ఈ స్థానం నుంచి ఒడిశా పాలకపక్ష పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మమతా జానీ అనే మహిళను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కొటియా గ్రామాల్లో గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తారుమారు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించిన అక్కడి మూడు రాజకీయ పార్టీలు జానీ గెలుపు కోసం పెద్దఎత్తున ప్రచారం చేశాయి. అయినా ఫలితం దక్కలేదు. తెలుగు మాట్లాడే స్వతంత్ర అభ్యర్థిని టికై గెమెల్ 3,710 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెమెల్కు 10,354 ఓట్లు రాగా, మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జానీకి 6,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి అభ్యర్థి ఓటమి పాలవడంతో ఒడిశా రాజకీయ పార్టీలకు షాక్ తగిలింది. తెలుగు అభ్యర్థిని గెలిపించటం ద్వారా తాము ఏపీలోనే ఉంటామని అక్కడి ప్రజలు ఒడిశా ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశారు. -
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం: ఎస్పీ విజయరావు
-
కృష్ణా జిల్లాలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు
-
అప్డేట్స్ : జడ్పీటీసీ ఫలితాల్లో కనబడని కాంగ్రెస్
ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్కు గట్టిపోటినిచ్చిన కాంగ్రెస్ జడ్పీటీసీ ఫలితాల్లో బొక్కబోర్లాపడింది. ఒక్క కామారెడ్డిలో తప్ప మరెక్కడా కూడా కాంగ్రెస్ తన బలాన్ని ప్రదర్శించలేకపోయింది. కామారెడ్డిలో కూడా టీఆర్ఎస్ 14స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన సొంత మనుషులను గెలిపించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అల్లుడు ఓటమి చెందగా.. నేడు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన బామ్మర్ది కూడా పరాజయం పాలయ్యాడు. ఎంపీటీసీ ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. మొత్తం 5817 స్థానాల్లో టీఆర్ఎస్ 3379 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 1290, బీజేపీ 201, ఇతరులు 577 స్థానాల్లో విజయం సాధించారు. భువనగిరి మండలం వీరెల్లి ఎంపీటీసీ స్థానంలో 3 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా... ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్ కోరాడు. దీంతో రీకౌంటింగ్‌లో ఇరువురికి సమాన ఓట్లు వచ్చాయి. చివరకు టాస్ వేయగా టీఆర్ఎస్ అభ్యర్థిని విజయం వరించింది. నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 349 స్థానాల్లో టీఆర్ఎస్ 191, కాంగ్రెస్ 132, బీజేపీ 3, సీపీఎం 5, సీపీఐ 2, ఇతరులు 16 స్థానాలను కైవసం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని 5 మండలాల్లో మొత్తం 42 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 13, బీజేపీ 1, స్వతంత్రులు 10స్థానాలను కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 128, కాంగ్రెస్ 76, బీజేపీ 18, స్వతంత్రులు 26, ఇతరులు 9 ఎంపీటీసీలను గెలుచుకున్నారు నిజామాబాద్ జిల్లాలో 299 ఎంపీటీసీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 188, కాంగ్రెస్ 39, బీజేపీ 32, స్వతంత్రులు 27 స్థానాల్లో విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొత్తం 123 ఎంపిటిసి స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 72, కాంగ్రెస్ 18, బీజేపీ 8, స్వతంత్రులు 25స్థానాల్లో విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలోని మొత్తం 214 ఎంపీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్ 142, కాంగ్రెస్ 36, బీజేపీ 19, స్వతంత్రులు 17స్థానాల్లో గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 178 ఎంపీటీసి స్థానాల్లో.. టీఆర్ఎస్ 99, కాంగ్రెస్ 26, బీజేపీ 15, సీపీఐ 3, స్వతంత్రులు 31, టీడీపీ 1, టీఆర్ఎస్ రెబల్ 2, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానంలో గెలుపొందింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 10 చోట్ల, స్వతంత్రులు 3 చోట్ల గెలుపుపొందారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 140 ఎంపీటీసీలు ఉండగా.. టీఆర్ఎస్ 86, కాంగ్రెస్ 18, బీజేపీ 25, ఇతరులు 11 మంది గెలుపొందారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 168 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 106 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 37, బీజేపీ 6, ఇతరులు 10స్థానాల్లో గెలుపొందారు. వనపర్తి జిల్లాలో.. మొత్తం 127 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 77స్థానాల్లో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ 7, ఇతరులు 13స్థానాల్లో విజయఢంకా మోగించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో.. మొత్తం 138 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఇప్పటివరకు టీఆర్ఎస్ 36, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం తన పట్టును కోల్పోతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమనేని వీరభద్రం స్వగ్రామం తెల్దారుపల్లిలో, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ స్వగ్రామం నారాయణ పురంలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని సీపీఎం పార్టీ మొదటిసారి ఓటమిని చవిచూసింది. ఈ గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 5817 ఎంపీటీసీలకు గాను 2436 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 1584, కాంగ్రెస్ 502, బీజేపీ 99, ఇతరులు 251 చోట్ల విజయం సాధించారు. 538 జెడ్పీటీసీలకు గాను 5 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 0, బీజేపీ 0, ఇతరులు 0 విజయం సాధించారు. చేవెళ్ల మండలంలో.. 17 ఎంపీటీసీలకు గాను.. కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 3 చోట్ల గెలుపు కరీంనగర్ జిల్లా : జమ్మికుంట మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 7, టీఆర్ఎస్ రెబల్ 2, స్వతంత్రులు ఒకచోట విజయం నిజామాబాద్ - ఆర్మూరు ఎంపీపీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 09, బీజేపీ 04, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్లుడే 1, మరోస్థానంలో ఫలితం వెలువడాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 25, బీజేపీ 10, స్వతంత్ర్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా - కీసర మండలం అంకిరెడ్డి పల్లి స్వతంత్ర అభ్యర్థి కవిత 301 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం. నిజామాబాద్ జిల్లా - వర్ని మండలం శంకోర టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మూడ్ పద్మ వసంత్ రావు 74 తో గెలుపు ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం లచ్చన్నగూడెం టిఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరవు 1000 ఓట్లతో గెలుపు ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం రామన్నపాలెం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పుచ్చకాయల లక్ష్మి 1048 ఓట్లతో గెలుపు నిజామాబాద్ జిల్లా - ఆర్మూర్ మండలం ఆలూరు-2 టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ గెలుపు మెదక్ - నార్సింగ్ మండలం శేర్పల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి 167 ఓట్ల మెజార్టీతోవిజయం నిజామాబాద్ - నందిపేట్ మండలం నూత్పల్లి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు నిజామాబాద్ - జిల్లా అన్నారం గ్రామ బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు నిజామాబాద్ - బోధన్ మండలం కొప్పర్గ టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి 303 ఓట్ల మెజార్టీతో గెలుపు భద్రాద్రి కొత్తగూడెం - ఆళ్లపల్లి మండలం అనంతోగు టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మంజుభార్గవి గెలుపు సంగారెడ్డి జిల్లా-సంగారెడ్డి మండలం కోతలాపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి సమీల్ 36 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి పై గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా-కంది మండలం ఎద్దుమైలారం-4లో ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి తమ్మిరెడ్డి శ్రీనివాస్ 57 ఓట్లతో గెలుపొందారు. భూపాలపల్లి జిల్లా- మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి, సూరారం గ్రామాల్లోని బ్యాలెట్ పేపర్లు చెదలు పట్టాయి. ఈ విషయాన్ని డీపీవో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ గ్రామ పరిధిలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులు ఆందోళన చేపట్టారు. మీడియా సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించక పోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ : ఖమ్మం జిల్లా-మధిర మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..36 ఓట్లకు గాను.. టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 11 జగిత్యాల జిల్లా-గొల్లపల్లి మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో.. 30 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 4 , రిజెక్టు 2 జగిత్యాల జిల్లా- మెట్పల్లి మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో.. 18 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ 6, బీజేపీ 10, స్వతంత్రులకు 2 ఓట్లు వచ్చాయి. జగిత్యాల జిల్లా-మల్లాపూర్ మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..7 ఓట్లు పోలవగా.. 5 ఓట్లు రిజెక్టు అయ్యాయి. టీఆర్ఎస్ 1, బీజేపీ 1 జగిత్యాల జిల్లా-కథలాపూర్ మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..12 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 6, నోటా 1 పెద్దపల్లి జిల్లా- ముత్తారం మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..28 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14 సాక్షి, హైదరాబాద్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నానానికి ఫలితాల సరళి తెలియనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లోని 978 కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటలలోపే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లకు తరలించారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. 35,529 మంది కౌంటింగ్ సిబ్బంది... పరిషత్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేసిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు చుడతారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలవుతుంది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల, రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ బ్యాలెట్ బాక్స్‌ను తెరిచి, వాటిలోని బ్యాలెట్ పత్రాలను కుప్పలుగా పోసి 25 చొప్పున కట్టలు చేస్తారు. ఇలా ఒక్క రౌండ్లో వెయ్యి ఓట్లను కట్టలుగా చేస్తారు. మొత్తం కట్టలు చేసిన తర్వాత ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో కట్టలు చేయడం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. అందువల్ల మధ్యాహ్నం 12 తర్వాతే బ్యాలెట్ పత్రాలను లెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపునకు ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని ఎస్ఈసీ సూచించింది. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని విప్పి అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ఎదుటే పరిశీలిస్తారు. ఏజెంట్‌కు చూపించాక చెల్లుబాటయ్యే బ్యాలెట్ పత్రాలను ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారు. ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే రిటర్నింగ్ అధికారుల పరిశీలనకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అంతేతప్ప అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు పట్టుకునే వీలుండదు. పరిశీలన కోసం ఏజెంట్లకు బ్యాలెట్ పత్రాలు ఇవ్వరు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఎస్ఈసీ ఇదివరకే స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పరిషత్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఫలితాలు... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఎస్ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు అంటూ వైబ్సైట్లో ఆప్షన్లు ఇచ్చిన చోట క్లిక్ చేస్తే అప్పటివరకు కౌంటింగ్ పూర్తయిన స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగనున్నందున ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారనేది ఆన్లైన్లో తెలుసుకునే వీలు కల్పించారు. ఓట్ల లెక్కింపు వేగం పుంజుకుంటున్న కొద్దీ మధ్యాహ్నం తర్వాత పరిషత్ ఫలితాల సరళి వెల్లడి కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను విడివిడిగా బండిళ్లు చేయడానికి అధిక సమయం పట్టనున్నందున మధ్యాహ్నం తర్వాతే వాటిని లెక్కించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ సరళిని బట్టి ఏడెనిమిది రౌండ్ల తర్వాత ఈ ఫలితాల ట్రెండ్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల సందర్భంగా అభ్యర్థులు, వారి అభిమానులు ర్యాలీలు నిర్వహించకుండా ఎస్ఈసీ ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు తీరును ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్, ఇతరత్రా ఏర్పాట్ల ద్వారా ఎస్ఈసీ అధికారులు పర్యవేక్షించనున్నారు. 21,356 మంది అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 21,356 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మూడు విడతలు కలుపుకుని 5,659 ఎంపీటీసీ స్థానాలకు 18,930 మంది, 534 జెడ్పీటీసీ స్థానాలకు 2,426 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి సగటున ముగ్గురు చొప్పున, ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి సగటున ఐదుగురు చొప్పున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే నెల 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 27న ఈ ఎన్నికల కౌంటింగ్‌నకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆ తర్వాత జూన్ 4కు మార్చిన విషయం తెలిసిందే. పాత పాలక మండళ్లు, సభ్యుల పదవీకాలం ముగియకుండానే కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కొత్త పీఆర్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలు ప్రకటించాక, 7న ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 8న జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్పర్సన్లను ఎన్నుకునే అవకాశం ఏర్పడింది. -
7న ఎంపీపీ.. 8న జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జూన్ 7న.. జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ) చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు 8న జరగనున్నాయి. ఎంపీపీ ఎన్నికల రోజే మండల కోఆప్షన్, జెడ్పీపీ ఎన్నికల రోజున జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎన్నికలూ పూర్తికానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం నోటిఫికేషన్, షెడ్యూల్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. న్యాయపరమైన అంశాలతో ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 5,857 ఎంపీటీసీ స్థానాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ఎంపీపీ పరిధిలోని 11 ఎంపీటీసీలు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎంపీపీ పరిధిలోని 15 ఎంపీటీసీలు, ములుగు జిల్లా మంగపేటలోని 14 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగలేదు. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిలో 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 534 జెడ్పీటీసీ, 5,659 ఎంపీ టీసీ స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. కొత్త గా జరిగిన జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పాత 9 జిల్లాల స్థానంలో(హైదరాబాద్ మినహాయించి) 32 కొత్త జిల్లాల్లోని జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, 538 ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. 6న ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక నోటిఫికేషన్... జూన్ 7న ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు 6వ తేదీన మండలాల్లోని రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. జూన్ 7న ఉదయం 10 గంటల వరకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల పదవి కోసం పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించి, చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ఒకవేళ కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగకపోతే, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. కోఆప్షన్ సభ్యులను ఎన్నికైన సభ్యుడు ప్రతిపాదించాలి. ఒకే సభ్యుడు రెండు పేర్లను ప్రతిపాదిస్తే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ఒక్కరే పోటీలో ఉంటే ఏకగ్రీవమైనట్టు ప్రకటిస్తారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇద్దరు సభ్యులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్య ఎన్నిక ఉంటుంది. మొదట ఎంపీపీ అధ్యక్షుడి కోసం పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎంపీపీ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన తర్వాత ఎన్నికలు ముగిసినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. 7న జెడ్పీపీ చైర్పర్సన్ల ఎన్నిక నోటిఫికేషన్... జూన్ 8న నిర్వహించే జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం జూన్ 7న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల తరహాలోనే జూన్ 8న ఉదయం 10 గంటల వరకు జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల పదవులకు పోటీపడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించిన తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించి, ఆ తర్వాత ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి ఎన్నిక ప్రక్రియ ముగిస్తారు. ఏదైనా కారణంతో ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీపీపీ చైర్పర్సన్ల ఎన్నికలు వాయిదాపడితే, మరుసటిరోజున వాటిని నిర్వహించాలి. రెండోసారి కూడా వాయిదాపడితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలి. -
రెండో విడత పరిషత్ పోరు ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: పరిషత్ పోరులో భాగంగా శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ విడతలోనూ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 85.33 శాతం పోలింగ్ నమోదు కాగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా 69.89 శాతం పోలింగ్ జరిగింది. ఏడు జిల్లాల్లో పోలింగ్ 80 శాతం దాటగా, ఒక్క ములుగు జిల్లా మినహా అన్నిచోట్లా 70 నుంచి 80 శాతం మధ్యలో ఓటింగ్ నమోదైంది. మొత్తమ్మీద రెండో విడత పరిషత్ ఎన్నికల్లో 77.63 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో భాగంగా 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,083 మంది, 179 జెడ్పీటీసీ స్థానాల్లో 805 మంది (ఏకగ్రీవమైన ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు మినహాయించి) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడత పరిషత్ ఎన్నికల కోసం 10,371 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 862 బూత్‌లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెబ్‌కాస్టింగ్ నిర్వహించింది. ఎస్ఈసీ ప్రధాన కార్యాలయం నుంచి, జిల్లాల్లోని కార్యాలయాల నుంచి వెబ్ కాస్టింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు. నక్సల్ ప్రభావిత ప్రాబల్యం ఉన్న 218 ఎంపీటీసీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించారు. మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో కొంత మంది తమ ఓట్లు గల్లంతయాంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
వినయ.. విధేయ.. రామ!
సాక్షి, హైదరాబాద్: అన్ని జెడ్పీ, ఎంపీపీ పీఠాలను గెలిచే విధంగా పరిషత్ టికెట్ల పంపిణీ.. టికెట్ల కేటాయింపులో విధేయులకు పెద్దపీట.. తారక రామారావుపై ఈ ప్రణాళిక అమలు బాధ్యత.. ఇదీ టీఆర్ఎస్ వ్యూహం. అన్ని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో గులాబీజెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ విధేయులకే అవకాశాలు కల్పించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల పంపిణీలో పార్టీ విధేయతకు, సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ అమలు బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు అప్పగించారు. పార్టీ కోసం పనిచేసేవారికి, మంచివాళ్లకు కచ్చితంగా అవకాశాలు వస్తాయనిపించేలా టికెట్ల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. పరిషత్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. తొలిదశ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పక్రియ మొదలవుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిషత్ ఎన్నికల గెలుపు వ్యూహంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. జెడ్పీలు, ఎంపీపీల వారీగా రిజర్వేషన్లను పరిశీలించి సంబంధిత కేటగిరిలో మంచిపేరు ఉన్నవారిని పోటీకి సిద్ధం చేయాలని సూచించారు. అవకాశాల విషయంలో ఎమ్మెల్యేలు విశాలంగా ఆలోచించాలని చెప్పారు. టీఆర్ఎస్లోని కొత్త, పాతల నేతలందరినీ పరిగణనలోకి తీసుకుని అర్హులకు పదవులు వచ్చేలా చూడాలన్నారు. అర్హులకు అవకాశాలు ఇవ్వడం వల్ల మిగిలినవారిలోనూ పార్టీపై, ఎమ్మెల్యేలపై గౌరవం పెరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. పకడ్బందీ వ్యూహం ... పరిషత్ ఎన్నికలు అధికారపార్టీగా టీఆర్ఎస్కు కీలకమైనవని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంతృప్తస్థాయిలో ప్రజలకు చేరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉండాలని కేసీఆర్ సూచించారు. అన్ని జెడ్పీలు, అత్యధిక సంఖ్యలో ఎంపీపీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని, దీనికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. మంత్రులు జిల్లాలవ్యాప్తంగా సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల ఎంపిక విషయంలో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని, దీనికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక మొదలు అన్ని విషయాలను పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ చైర్మన్ పదవులను గెలుచుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రణాళిక అమలు బాధ్యతలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు అప్పగించారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార వ్యూహంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం విషయంలో కేటీఆర్ అన్నీతానై పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కొత్త, పాత నేతల మధ్య అంతరం లేకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామాలు, మండలాలవారీగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశాలను ఇప్పటికే పూర్తిచేశారు. తొలిదశ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సోమవారం నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారు. పరిషత్ ఎన్నికల బీఫారాల పంపిణీ ప్రక్రియను టీఆర్ఎస్ ఇప్పటికే మొదలుపెట్టింది. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్ ఇన్చార్జి ఎం.శ్రీనివాస్‌రెడ్డికి ఈ బాధ్యతను అప్పగించారు. నియోజకవర్గాలవారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంఖ్య ప్రకారం బీఫారాలను వారికి అందజేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఎంపిక... జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల ఎంపిక ప్రక్రియను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగవంతం చేశారు. జిల్లాలవారీగా విధేయులు, పార్టీ కోసం పని చేసినవారి పేర్లను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తున్నారు. ఆసిపాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్ద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ పదవిని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ములుగు జెడ్పీ చైర్మన్‌గా కుసుమ జగదీశ్‌కు, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్‌గా ఎలిమినేటి సందీప్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. మరో ఐదారు జెడ్పీ చైర్మన్ పదవులపైనా స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. -
తొలిపోరు నేడే
సాక్షి, నెల్లూరు : ప్రచార, ప్రలోభాల పర్వం ముగిసింది. తొలివిడత పరిషత్ సమరానికి తెరలేచింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో జరుగుతున్న తొలివిడత పరిషత్ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. 21 మండలాలకు చెందిన జెడ్పీటీసీ స్థానాలతోపాటు ఆ మండలాల పరిధిలోని 267 ఎంపీటీసీ స్థానాలకుగాను తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 258 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 698 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 911 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,04,671 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3,47,992 మంది పురుషులు కాగా, 3,56,669 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 10 మంది ఉన్నారు. తొలి విడత ఎన్నికల కోసం 1,740 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఐదు వేల మందికిపైగా అధికారులు పోలింగ్ నిర్వహణలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 148 అతి సమస్యాత్మక, 158 సమస్యాత్మక, 11 తీవ్రవాదుల అలికిడి ఉన్న పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 47 చోట్ల వెబ్‌కెమెరాలు, 152 చోట్ల వీడియోగ్రాఫర్లను నియమించారు. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిదశ పోలింగ్... జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, మర్రి పాడు, సంగం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 21 మంది పోటీలో ఉండగా టీడీపీకి సంబంధించి 21 మంది బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం ఆరు చోట్ల మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు రెండు చోట్ల, బీఎస్పీ అభ్యర్థులు నాలుగు చోట్ల, సీపీఎం రెండు చోట్ల, ఇండిపెండెంట్లు 17 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 73 మంది జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎంపీటీసీలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ తరపున 255 మంది పోటీలో ఉండగా, టీడీపీ తరపున 243 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, బీఎస్పీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఐదుగురు పోటీలో ఉండగా, సీపీఎం నుంచి 27 మంది, 111 మంది ఇండిపెండెంట్లు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 698 మంది పోటీలో ఉన్నారు. బ్యాలెట్ వివరాలు... జెడ్పీటీసీకి సంబంధించి మొదటి విడత ఎన్నికల్లో 7,85,350 బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయగా, ఎంపీటీసీకి సంబంధించి 7,63,300 బ్యాలెట్ పేపర్లను తొలివిడత ముద్రించి సిద్ధంగా ఉంచారు.