local body election results
-
Haryana: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
ఛండీగఢ్: హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లకుగానూ తొమ్మిదింటిని బీజేపీ కైవసం చేసుకోగా.. మిగిలిన ఒక స్థానం మానేసర్‌లో బీజేపీ రెబల్ లీడర్ ఇంద్రజిత్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన విజయం దాదాపు ఖరారైనట్లు సమాచారం. గురుగ్రామ్, ఫరిదాబాద్, రోహతక్, హిసార్లాంటి కీలక ప్రాంతాలతో పాటు మరో మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో మార్చి 2వ తేదీన పోలింగ్ జరిగింది. అలాగే.. పానిపట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మార్చి 9వ తేదీన విడిగా పోలింగ్ జరిగింది. వీటితోపాటు అంబాలా, సోనిపట్ మేయర్ పోస్టుల కోసం ఉప ఎన్నికలు, అలాగే.. 21 మున్సిపల్ కమిటీల ప్రెసిడెంట్స్, వార్డ్ మెంబర్స్ ఎన్నిక కోసం మార్చి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి ఫలితాలు వెలువడడం ప్రారంభం అయ్యాయి. దాదాపు అన్ని చోట్ల కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఏ చోటా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అడ్డా రోహతక్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. పలు వార్డు మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం నయాబ్ సైనీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాలతో బీజేపీ ప్రచారం చేయించగా.. ప్రతిగా కాంగ్రెస్ సచిన్ పైలట్, హుడాలతో ప్రచారం చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. -
అన్నాడీఎంకేకు ఘోర అవమానం.. జోష్‌లో బీజేపీ!
తమిళనాడు అర్బన్ ఎన్నికల్లో అధికార డీఎంకే అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మేజర్ స్థానాల్ని కైవసం చేసుకుని.. ఎన్నికల ట్రెండ్స్‌లో స్పష్టమైన ఆధిప్యతంతో ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మునుపెన్నడూ లేని చెన్నై వేదికగా సరికొత్త రాజకీయం అగుపించింది. చాలా చోట్ల అన్నాడీఎంకేను వెనక్కి రాజేసి.. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని కొన్ని వార్డుల్లో.. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజమ్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అదీ బీజేపీ కంటే చాలా ఓట్ల తేడాతో వెనుకబడడం విశేషం. తాజా ట్రెండ్ ప్రకారం.. చెన్నైలో కనీసం ఐదు వార్డులనైనా బీజేపీ సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది(ఇప్పటికే ఒక స్థానం గెల్చుకుంది). #LocalBodyElections2022 - #Chennai Result updates! pic.twitter.com/dUqWp4h0G9 — Greater Chennai Corporation (@chennaicorp) February 22, 2022 ఇక ఈ ఫలితాలు బీజేపీలో జోష్ నింపుతున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలే అయినా.. తమిళనాట పాగా వేయాలన్న ప్రయత్నాలకు కాస్తైనా మార్గం సుగమం అయ్యిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై స్పందిస్తూ.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు శుభసంకేతంగా ఫలితాల్ని వర్ణించాడు. ప్రతిపక్ష హోదాలో అన్నాడీఎంకే కంటే తామే బాధ్యతగా వ్యవహరించడమే బహుశా ఈ ఫలితాలకు కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నాడు అన్నామలై. తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే ఎక్కువ సీట్ల కోసం అర్బన్ ఎన్నికలకు మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు, వీలైతే ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశాడు అన్నామలై. -
ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ భారీ విజయం.. సంబురాల్లో కార్యకర్తలు
సాక్షి, చెన్నై: తమిళనాడు స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో డీఎంకే కూటమి 19 కార్పొరేషన్లలో ఆధిక్యంలో ఉంది. మొత్తం 21 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగగా ప్రతిపక్ష అన్నాడీఎంకే కేవలం ఒక్క కార్పొరేషన్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు 138 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ 109 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా అన్నాడీఎంకే కేవలం 9 స్థానాల్లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా 439 పట్టణ పంచాయతీలకు గాను డీఎంకే 268 స్థానాల్లో ఆధిక్యంతో ఉంది. అన్నాడీఎంకే 22 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని అందుకోనున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యక్తరలు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని డీఎంకే పార్టీ కార్యాలయాల వద్ద బాణా సంచా కాల్చి వేడుకలు జరుపుకుంటున్నారు. -
యోగ్యతా పత్రం!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు రాజకీయ జీవులు చేస్తున్న ఒక కామెంట్ మీద కొంత చర్చ జరగవలసిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు జనంలోకి బాగానే వెళ్లాయి. ఫలితాల్లో వాటి ప్రభావం కనిపించిందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషకుల్లో కొందరు రాజకీయంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకులు. కొందరు సానుభూతిపరులు, తటస్థులు కూడా ఉన్నారు. ఈ తరహా కామెంట్లు వింటున్నప్పుడు చలం గుర్తుకొచ్చాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకానికి ఆయన రాసిన యోగ్యతా పత్రం గుర్తుకొచ్చింది. అందులో చలం ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ పుస్తకం మీద కవి అనేవాడి అభిప్రాయం మాత్రం అడగొద్దం టాడు. అడిగితే పాజిటివ్‌గానే స్పందిస్తారట. శ్రీశ్రీ బాగానే రాశాడు. అభివృద్ధిలోకి వస్తాడని కూడా అభినందిస్తారట. కానీ అది ప్రమాదకరమైన అభినందన. ఆకాశం ఎత్తున ఉన్న శ్రీశ్రీ వీపుమీద తట్టడానికి ప్రయత్నిస్తారు తస్మాత్ జాగ్రత్త అంటాడు చలం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విజయాల మీద కొందరి ‘పాజిటివ్’ స్పందన కూడా ఇటువంటిదే. సంకుచిత అర్థంలో వాళ్లు ‘సంక్షేమ’ లేబుల్‌ను ప్రభుత్వానికి అంటించాలని చూస్తు న్నారు. సంక్షేమ పథకాలంటే వాళ్ల ఉద్దేశంలో కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం. కొందరికి బర్రెలో గొర్రెలో ఇవ్వడం. కొంత మంది ఖాతాల్లో డబ్బులు జమచేయడం. వాటి ద్వారా ఓట్లు రాబట్టడం... అంతే. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న విప్లవాత్మక కార్యక్రమానికీ, విశ్లేషక పుంగవులు అంటిస్తున్న సంక్షేమ లేబుల్కూ ఎటు వంటి సంబంధం లేదు. ‘శ్రీశ్రీ కవిత్వం గురించి తెలుసుకోవాలంటే స్వయంగా చదవండి. ఆయన్ని చూడాలని పిస్తే స్వయంగా చూడండి. కవి అనేవాడిని మాత్రం అడ క్కండ’ని చలం హెచ్చరించాడు. అదేవిధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం తెలుసుకోవాలంటే స్వయంగా జనజీవితాలను చదవండి. కానీ, విశ్లేషకుడన్నవాడిని మాత్రం అడక్కండి. వాడు మండే సూర్యుడికి కూడా ఫర్వాలే దంటూ పాస్‌మార్కులు వేయగలడు. వాడు ఆకాశాన్ని అగ్గి పెట్టెలో బంధించి చూపెట్టగలుగుతాడు... జాగ్తేరహో! చారిత్రక కారణాల ఫలితంగా అభివృద్ధి పథంలో వెనుక బడిపోయి, అణగారిపోతున్న వ్యక్తులను వర్గాలను గుర్తించి చేయూతనిచ్చి, వారిని పోటీ ప్రపంచంలో నిలబెట్టే ఒక మాన వీయ అభివృద్ధి ఎజెండాను వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. విస్తృతమైన ప్రజా సంపర్కం కారణంగా ఇటువంటి అభివృద్ధి మోడల్‌ను రచించడం ఆయనకు సాధ్యమైంది. ఎక్కువమంది ప్రజలతో ముఖాముఖి సంభాషించిన రాజకీయ నేతల్లో అగ్ర స్థానం నిశ్చయంగా జగన్మోహన్రెడ్డిదే. కొన్ని లక్షలమందితో విడివిడిగా మాట్లాడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు, పాదయాత్రల సందర్భాలు ఆయనకు ఇందులో ఉపకరించాయి. బహిరంగ సభలూ, సమావేశాల ద్వారా సుమారు రెండున్నర కోట్లమందిని ఉద్దేశించి మాట్లాడి ఉంటారు. వేలాది పూరిగుడిసెల్లోకీ, ఆ గుడిసెల్లో నివసించే వారి గుండెల్లోకీ డైరెక్ట్‌గా ప్రవేశించిన ఘనత దేశ రాజకీయ చరిత్రలో ఒక్క జగన్మోహన్రెడ్డికే దక్కింది. ఆ చేతుల్ని తాకిన ఆత్మీయ స్పర్శలు అనంతం. ఆ కళ్లు చూసిన కన్నీటి చెలమలు అసం ఖ్యాకం. ఆ చెవినపడిన జీవన పోరాట గాథలు వేనకువేలు. ఇంతటి సుసంపన్నమైన ప్రజా సంబంధాలు ఆయన రాజకీయ పథానికి ఒక తాత్విక భూమికను సమకూర్చాయి. ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేదేమిటో ఆయనకు ఈ క్రమంలోనే అవగతమైంది. ప్రభుత్వం ఏమి చేస్తే ప్రజా జీవితాలు ప్రగతి మార్గం పడతాయో అర్థమైంది. ఈ అవగాహనతోనే ఎన్నికల మేనిఫెస్టోను ఆయన తయారు చేసుకున్నారు. కోటి ఆశల ఉచ్ఛ్వాసనిశ్వాసలు ఆ మేనిఫెస్టోలోని అక్షరాలు. తిలక్ చెప్పి నట్టు ‘ఆ అక్షరాలు కన్నీటి జడులలో తడిసిన దయాపారావ తాలు’. అందుకే ఆ మేనిఫెస్టోకి ఒక పవిత్ర హోదాను కల్పిం చారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ల సరసన చేర్చారు. అధికారంలోకి వచ్చిన ఇరవై మాసాల్లోనే మేనిఫెస్టోలోని అంశాలను దాదాపు 90 శాతానికి పైగా అమల్లోకి తెచ్చారు. మేని ఫెస్టోలో చెప్పని అంశాలను కూడా మరికొన్నింటిని జోడించి అభివృద్ధి కార్యక్రమానికి ఒక సమగ్రతను కల్పించారు. ఇరవై రెండు మాసాల్లో ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేసింది. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సంక్షోభం సగం కాలాన్ని కబళించింది. ఆర్థిక తడబాట్లు ఎదురయ్యాయి. రాజకీయ దాడులు పెరిగాయి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను అడ్డంగా వాడుకొని చికాకులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రధాన ప్రత్యర్థి మాత్రం తాను చేసిన పాపాలకు అలవాటు ప్రకారం స్టేలు తెచ్చుకుంటూనే ఉన్నారు. 99 స్టేలు తెచ్చుకున్న తర్వాత కూడా శిశుపాలునికి శిరచ్ఛేదన శిక్ష తప్పలేదన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. 22 నెలల ఆటుపోట్ల కాలం గడిచిన తర్వాత కూడా అధి కారంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచు కున్నది. మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి 52.65 శాతం ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ విధానాల ఫలితంగా అభివృద్ధి బాటపట్టిన ప్రజల సంఖ్య పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువ. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడం వల్ల తెలియ లేదు కానీ, మునిసిపాలిటీలకంటే కచ్చితంగా ఎక్కువ ఓట్లే వచ్చి ఉంటాయి. స్థానిక ఎన్నికల్లో పెద్దఎత్తున తలపడే స్వతంత్రు లను, అధికార పార్టీ రెబెల్ అభ్యర్థులనూ కూడా గమనంలోకి తీసుకుంటే పల్లెలు, పట్టణాలు కలిసి 55 శాతం ఓటు బ్యాంకు అధికార పార్టీకి దఖలు పడ్డట్టుగా పరిగణించవచ్చు. వర్తమాన రాజకీయ రంగంలో జాతీయ రాజకీయాల్లో కానీ, పెద్ద రాష్ట్రాల్లో కానీ యాభై శాతానికి మించిన ఓటుబ్యాంకు కలిగి ఉన్న రాజ కీయ నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే. కంటి తుడుపు హామీల వల్లనో, ఓట్లకోసం ప్రకటించే ఫలహారం పథకాల వల్లనో ఈ విజయం రాలేదు. ప్రజలకు క్షీర–నీర న్యాయం తెలుసునని ఇప్పటికే పలుమార్లు రుజువయ్యింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఎజెండా తమ జీవితాల్లో మార్పులను తీసుకొని వస్తుందన్న విశ్వాసం ఉంది కనుకనే ప్రజలు ఈ విజయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌కు అందజేశారు. పార్టీ అధినేత తాము అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా అంత స్సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పారు. ప్రజలందరికీ నిన్నటికంటే నేడు బాగుందనిపించడం, రేపు మరింత బాగుంటుందన్న నమ్మకం కలగడం–ఇదే అభివృద్ధికి గీటురాయి. బహుశా ప్రజలకు ఈ నమ్మకం కలిగింది కనుకనే పాలక పార్టీకి అపురూపమైన విజయాన్ని కట్టబెట్టారు. ఒంటి చేత్తో 55 శాతం ఓట్లను 90 శాతం స్థానాలను (పంచాయతీ+ మున్సిపాలిటీ సగటు) గెలుచుకోవడం ఈ దేశంలో ఒక రికార్డు. బహుళ రాజకీయ పార్టీలు రంగంలో ఉండే పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో 50 శాతాన్ని దాటి ఓట్లు సాధించడం ఆషామాషీ కాదు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన అనంతరం చైర్మన్, మేయర్ అభ్యర్థుల ఎంపికలో మరో సంచలనానికి జగన్ తెర తీశారు. ఎనభై శాతం అధ్యక్ష పీఠాలను ఆయన బలహీన వర్గాలకు కట్టబెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో చేపట్టిన సంస్కరణల ద్వారా బడుగుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు చేస్తున్న కృషికి ఇది కొన సాగింపు. ఈ రాజకీయ సాధికార పరికల్పన వారిని మరింత బలోపేతం చేస్తుంది. బహుముఖీనమైన చేయూతతోనే బల హీనవర్గాల్లోని రాబోయే తరాలవారు మిగిలిన వారితో పోటీ పడగల స్థాయికి చేరుకుంటారన్న వ్యూహాత్మక కార్యక్రమంగా ఈ చర్య కనబడుతున్నది. మొత్తం అధికార పీఠాల్లో అరవై శాతాన్ని మహిళలకు అప్పగించారు. అందులో ఎక్కువ మంది సాధారణ మహిళలు. కొన్ని కులాలు లేదా వర్గాలు తరతరాలుగా వెనుక బాటుతనానికీ, అణచివేతకూ గురయ్యార నేది ఒక వాస్తవం. అలాగే అన్ని కులాల్లోనూ, వర్గాల్లోనూ మహిళలందరూ సుదీర్ఘ కాలంపాటు అణచివేతకు గురయ్యారనేది కూడా మరింత వాస్తవం. ‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అన్న మను శాసనం చాలా కాలం రాజ్యం చేసింది. చదువుకు దూరం చేసింది. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే, ముద్దార నేర్పించినన్’ అని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ఆరోజుల్లోనే ప్రశ్నించాల్సి వచ్చింది. ‘స్త్రీకి కూడా శరీరం ఉంటుంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. మెదడు ఉంటుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. హృదయం ఉంటుంది, దానికి అనుభవం ఇవ్వాలి’ అని చలం డిమాండ్ చేయవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి దూసు కొని వస్తున్న మహిళలను వేగంగా ఎంపవర్ చేయడమే లక్ష్యంగా అర్ధభాగాన్ని మించిన అధికారాన్ని కట్టబెట్టడం జరిగి ఉండవచ్చు. కుల, మత, వర్గ, ప్రాంత, లింగభేదం లేకుండా ప్రజలం దరూ సమానమేనన్నది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. వెనుక బడిన వారందరూ సమానస్థాయిలో పోటీపడగల స్థితికి చేరు కోవడానికి చేయూతనివ్వాలనే ఉద్దేశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల ద్వారా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కానీ ఆచరణలో వేగంగా అడుగులు వేయలేకపోయారు. ‘అన్నార్తులు, అభాగ్యులుండని ఆ నవ యుగమదెంత దూరం?’ అన్న ప్రశ్న దశాబ్దాలుగా వినబడు తూనే ఉన్నది. జాతీయ స్థాయిలోనో, రాష్ట్రస్థాయిలోనో బలమైన రాజకీయ నాయకత్వాలున్నప్పుడు కొన్ని అడుగులు పడు తున్నా మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడుతున్నది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి, వారి సమగ్ర అభివృద్ధి అవసరమైన ఒక ఆచరణాత్మకమైన ఎజెండాను దేశంలోనే మొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఎటువంటి కులమత వైషమ్యాలు తలెత్తకుండా, వర్గ విభేదాలు ఏర్పడ కుండానే, బలహీనవర్గాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని సామరస్యపూర్వక వాతావరణంలో ప్రారంభించడం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం. దీని సత్ఫలి తాలను రానున్న కొద్ది సంవత్సరాల్లో మనం చూడబోతాము. సమాజంలో సమస్త వ్యక్తులూ, శక్తులూ బలోపేతమైననాడే ఆ సమాజం ఆర్థిక, సాంఘిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతిని సాధించగలుగుతుంది. మనకాలపు మహా శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ చెప్పిన మాట లను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ‘భూగోళం నుంచి త్వరత్వరగా ఇతర గ్రహాలకు వ్యాపించకపోతే మానవజాతి మరో వెయ్యేళ్లకు మించి మనుగడ సాగించకపోవచ్చు’నని ఆయన హెచ్చరిం చారు. మనకన్నా మేధస్సు కలిగిన గ్రహాంతర వాసులు దండెత్తి వస్తేనో, ఊహించని ప్రకృతి విపత్తు ఏర్పడితేనో, భారీ శకలాలు ఢీకొంటేనో అంతకంటే ముందుగానే మానవజాతి అంత రించి పోవచ్చునట. మానవుడిని చిరంజీవిని చేసే లక్ష్యం నెరవేరా లంటే మానవజాతి ఒక్కతాటిపై నిలబడి శరవేగంగా శాస్త్ర పురోగతి సాధించాలి. కాంతిని మించిన వేగంతో విశ్వభ్రమణం చేయగల సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై...’ అట్టి దేవదేవుడు ముందుగా ఫిజిక్స్‌ను సృష్టించాడట. దాని వారసురాలే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ సంతానమే బయాలజీ. మన మాతృమూర్తి బయాలజీ. అందువల్ల మన ముత్తాతల తాత ఫిజిక్స్. నక్షత్ర ధూళి పరా వర్తన కాంతులమే మనమంతా. ఆ కాంతులకు కులం లేదు, మతం లేదు, దేశం లేదు, ఎల్లలు లేవు. జన్మతః మనం విశ్వ మానవులం. ఈ అవగాహనతో ఒక్కటిగా నిలబడితే మానవ జాతి చిరకాలం వర్ధిల్లుతుంది. మన విజ్ఞానం, మన కళలూ, సాహిత్యం, సంగీతం అవిచ్ఛిన్నంగా గ్రహాంతరయానం చేస్తాయి. గెలాక్సీకరణ వేగంగా జరుగుతుంది. ఆరొందల యేళ్లు గడిచినా ఇప్పటికీ మనం అన్నమయ్య గీతాలను ఆలపిస్తూనే ఉన్నాము. మరో వెయ్యేళ్ల తర్వాత కూడా ‘అది రమ్మంటె రాదుర చెలియా... దాని పేరే సారంగధరియా’ అంటూ పాలపుంత గెలాక్సీలోని గ్రహాల్లో మన జానపదం ప్రతిధ్వనించాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అప్డేట్స్ : జడ్పీటీసీ ఫలితాల్లో కనబడని కాంగ్రెస్
ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్కు గట్టిపోటినిచ్చిన కాంగ్రెస్ జడ్పీటీసీ ఫలితాల్లో బొక్కబోర్లాపడింది. ఒక్క కామారెడ్డిలో తప్ప మరెక్కడా కూడా కాంగ్రెస్ తన బలాన్ని ప్రదర్శించలేకపోయింది. కామారెడ్డిలో కూడా టీఆర్ఎస్ 14స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన సొంత మనుషులను గెలిపించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అల్లుడు ఓటమి చెందగా.. నేడు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన బామ్మర్ది కూడా పరాజయం పాలయ్యాడు. ఎంపీటీసీ ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. మొత్తం 5817 స్థానాల్లో టీఆర్ఎస్ 3379 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 1290, బీజేపీ 201, ఇతరులు 577 స్థానాల్లో విజయం సాధించారు. భువనగిరి మండలం వీరెల్లి ఎంపీటీసీ స్థానంలో 3 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా... ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్ కోరాడు. దీంతో రీకౌంటింగ్‌లో ఇరువురికి సమాన ఓట్లు వచ్చాయి. చివరకు టాస్ వేయగా టీఆర్ఎస్ అభ్యర్థిని విజయం వరించింది. నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 349 స్థానాల్లో టీఆర్ఎస్ 191, కాంగ్రెస్ 132, బీజేపీ 3, సీపీఎం 5, సీపీఐ 2, ఇతరులు 16 స్థానాలను కైవసం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని 5 మండలాల్లో మొత్తం 42 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 13, బీజేపీ 1, స్వతంత్రులు 10స్థానాలను కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 128, కాంగ్రెస్ 76, బీజేపీ 18, స్వతంత్రులు 26, ఇతరులు 9 ఎంపీటీసీలను గెలుచుకున్నారు నిజామాబాద్ జిల్లాలో 299 ఎంపీటీసీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 188, కాంగ్రెస్ 39, బీజేపీ 32, స్వతంత్రులు 27 స్థానాల్లో విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొత్తం 123 ఎంపిటిసి స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 72, కాంగ్రెస్ 18, బీజేపీ 8, స్వతంత్రులు 25స్థానాల్లో విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలోని మొత్తం 214 ఎంపీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్ 142, కాంగ్రెస్ 36, బీజేపీ 19, స్వతంత్రులు 17స్థానాల్లో గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 178 ఎంపీటీసి స్థానాల్లో.. టీఆర్ఎస్ 99, కాంగ్రెస్ 26, బీజేపీ 15, సీపీఐ 3, స్వతంత్రులు 31, టీడీపీ 1, టీఆర్ఎస్ రెబల్ 2, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానంలో గెలుపొందింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 10 చోట్ల, స్వతంత్రులు 3 చోట్ల గెలుపుపొందారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 140 ఎంపీటీసీలు ఉండగా.. టీఆర్ఎస్ 86, కాంగ్రెస్ 18, బీజేపీ 25, ఇతరులు 11 మంది గెలుపొందారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 168 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 106 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 37, బీజేపీ 6, ఇతరులు 10స్థానాల్లో గెలుపొందారు. వనపర్తి జిల్లాలో.. మొత్తం 127 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 77స్థానాల్లో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ 7, ఇతరులు 13స్థానాల్లో విజయఢంకా మోగించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో.. మొత్తం 138 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఇప్పటివరకు టీఆర్ఎస్ 36, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం తన పట్టును కోల్పోతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమనేని వీరభద్రం స్వగ్రామం తెల్దారుపల్లిలో, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ స్వగ్రామం నారాయణ పురంలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని సీపీఎం పార్టీ మొదటిసారి ఓటమిని చవిచూసింది. ఈ గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 5817 ఎంపీటీసీలకు గాను 2436 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 1584, కాంగ్రెస్ 502, బీజేపీ 99, ఇతరులు 251 చోట్ల విజయం సాధించారు. 538 జెడ్పీటీసీలకు గాను 5 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 0, బీజేపీ 0, ఇతరులు 0 విజయం సాధించారు. చేవెళ్ల మండలంలో.. 17 ఎంపీటీసీలకు గాను.. కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 3 చోట్ల గెలుపు కరీంనగర్ జిల్లా : జమ్మికుంట మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 7, టీఆర్ఎస్ రెబల్ 2, స్వతంత్రులు ఒకచోట విజయం నిజామాబాద్ - ఆర్మూరు ఎంపీపీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 09, బీజేపీ 04, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్లుడే 1, మరోస్థానంలో ఫలితం వెలువడాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 25, బీజేపీ 10, స్వతంత్ర్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా - కీసర మండలం అంకిరెడ్డి పల్లి స్వతంత్ర అభ్యర్థి కవిత 301 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం. నిజామాబాద్ జిల్లా - వర్ని మండలం శంకోర టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మూడ్ పద్మ వసంత్ రావు 74 తో గెలుపు ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం లచ్చన్నగూడెం టిఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరవు 1000 ఓట్లతో గెలుపు ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం రామన్నపాలెం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పుచ్చకాయల లక్ష్మి 1048 ఓట్లతో గెలుపు నిజామాబాద్ జిల్లా - ఆర్మూర్ మండలం ఆలూరు-2 టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ గెలుపు మెదక్ - నార్సింగ్ మండలం శేర్పల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి 167 ఓట్ల మెజార్టీతోవిజయం నిజామాబాద్ - నందిపేట్ మండలం నూత్పల్లి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు నిజామాబాద్ - జిల్లా అన్నారం గ్రామ బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు నిజామాబాద్ - బోధన్ మండలం కొప్పర్గ టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి 303 ఓట్ల మెజార్టీతో గెలుపు భద్రాద్రి కొత్తగూడెం - ఆళ్లపల్లి మండలం అనంతోగు టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మంజుభార్గవి గెలుపు సంగారెడ్డి జిల్లా-సంగారెడ్డి మండలం కోతలాపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి సమీల్ 36 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి పై గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా-కంది మండలం ఎద్దుమైలారం-4లో ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి తమ్మిరెడ్డి శ్రీనివాస్ 57 ఓట్లతో గెలుపొందారు. భూపాలపల్లి జిల్లా- మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి, సూరారం గ్రామాల్లోని బ్యాలెట్ పేపర్లు చెదలు పట్టాయి. ఈ విషయాన్ని డీపీవో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ గ్రామ పరిధిలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులు ఆందోళన చేపట్టారు. మీడియా సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించక పోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ : ఖమ్మం జిల్లా-మధిర మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..36 ఓట్లకు గాను.. టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 11 జగిత్యాల జిల్లా-గొల్లపల్లి మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో.. 30 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 4 , రిజెక్టు 2 జగిత్యాల జిల్లా- మెట్పల్లి మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో.. 18 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ 6, బీజేపీ 10, స్వతంత్రులకు 2 ఓట్లు వచ్చాయి. జగిత్యాల జిల్లా-మల్లాపూర్ మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..7 ఓట్లు పోలవగా.. 5 ఓట్లు రిజెక్టు అయ్యాయి. టీఆర్ఎస్ 1, బీజేపీ 1 జగిత్యాల జిల్లా-కథలాపూర్ మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..12 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 6, నోటా 1 పెద్దపల్లి జిల్లా- ముత్తారం మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..28 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14 సాక్షి, హైదరాబాద్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నానానికి ఫలితాల సరళి తెలియనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లోని 978 కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటలలోపే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లకు తరలించారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. 35,529 మంది కౌంటింగ్ సిబ్బంది... పరిషత్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేసిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు చుడతారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలవుతుంది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల, రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ బ్యాలెట్ బాక్స్‌ను తెరిచి, వాటిలోని బ్యాలెట్ పత్రాలను కుప్పలుగా పోసి 25 చొప్పున కట్టలు చేస్తారు. ఇలా ఒక్క రౌండ్లో వెయ్యి ఓట్లను కట్టలుగా చేస్తారు. మొత్తం కట్టలు చేసిన తర్వాత ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో కట్టలు చేయడం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. అందువల్ల మధ్యాహ్నం 12 తర్వాతే బ్యాలెట్ పత్రాలను లెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపునకు ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని ఎస్ఈసీ సూచించింది. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని విప్పి అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ఎదుటే పరిశీలిస్తారు. ఏజెంట్‌కు చూపించాక చెల్లుబాటయ్యే బ్యాలెట్ పత్రాలను ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారు. ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే రిటర్నింగ్ అధికారుల పరిశీలనకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అంతేతప్ప అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు పట్టుకునే వీలుండదు. పరిశీలన కోసం ఏజెంట్లకు బ్యాలెట్ పత్రాలు ఇవ్వరు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఎస్ఈసీ ఇదివరకే స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పరిషత్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఫలితాలు... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఎస్ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు అంటూ వైబ్సైట్లో ఆప్షన్లు ఇచ్చిన చోట క్లిక్ చేస్తే అప్పటివరకు కౌంటింగ్ పూర్తయిన స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగనున్నందున ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారనేది ఆన్లైన్లో తెలుసుకునే వీలు కల్పించారు. ఓట్ల లెక్కింపు వేగం పుంజుకుంటున్న కొద్దీ మధ్యాహ్నం తర్వాత పరిషత్ ఫలితాల సరళి వెల్లడి కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను విడివిడిగా బండిళ్లు చేయడానికి అధిక సమయం పట్టనున్నందున మధ్యాహ్నం తర్వాతే వాటిని లెక్కించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ సరళిని బట్టి ఏడెనిమిది రౌండ్ల తర్వాత ఈ ఫలితాల ట్రెండ్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల సందర్భంగా అభ్యర్థులు, వారి అభిమానులు ర్యాలీలు నిర్వహించకుండా ఎస్ఈసీ ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు తీరును ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్, ఇతరత్రా ఏర్పాట్ల ద్వారా ఎస్ఈసీ అధికారులు పర్యవేక్షించనున్నారు. 21,356 మంది అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 21,356 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మూడు విడతలు కలుపుకుని 5,659 ఎంపీటీసీ స్థానాలకు 18,930 మంది, 534 జెడ్పీటీసీ స్థానాలకు 2,426 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి సగటున ముగ్గురు చొప్పున, ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి సగటున ఐదుగురు చొప్పున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే నెల 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 27న ఈ ఎన్నికల కౌంటింగ్‌నకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆ తర్వాత జూన్ 4కు మార్చిన విషయం తెలిసిందే. పాత పాలక మండళ్లు, సభ్యుల పదవీకాలం ముగియకుండానే కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కొత్త పీఆర్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలు ప్రకటించాక, 7న ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 8న జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్పర్సన్లను ఎన్నుకునే అవకాశం ఏర్పడింది. -
మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా ?
-
తెగేదాకా లాగుతారా!
– మహారాష్ట్రలో ఉత్కంఠ – తారస్థాయికి చేరిన సంకీర్ణ లుకలుకలు – ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామంటున్న శివసేన – మద్దతివ్వబోమన్న ఎన్సీపీ – మధ్యంతరం వస్తుందా? – స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ముడిపడ్డ రాజకీయం మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగడం దాదాపు ఖాయమనే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పుట్టి మునుగుతుందా? ఆపరేషన్ ఆకర్ష్‌తో ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారా? మద్దతిచ్చేది లేదంటున్న ఎన్సీపీ మనసు మార్చుకొని... కమలానికి అండగా ఉంటుందా? ఫడ్నవీస్ భవితవ్యాన్ని తేల్చగలిగే బలమున్న శివసేన, ఎన్సీపీలు మాట మీద నిలబడి అధికారానికి దూరం జరిగితే... మధ్యంతర ఎన్నికలు తప్పవా? మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది... తాజా పరిణామాలకు దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం.. మారిన పాత్ర పాతమిత్రులైన బీజేపీ, శివసేన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశాయి. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన 63 సీట్లు మాత్రమే సాధించింది. ఎన్సీపీ (41 సీట్లు) అధినేత శరద్ పవార్ వేగంగా స్పందించి బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించారు. దాంతో ఫడ్నవీస్ ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీతో బేరసారాలకు దిగొచ్చని ఆశించిన శివసేన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తర్వాత ప్రభుత్వంలో చేరినా ఎన్సీపీ కారణంగా శివసేన బేరమాడే శక్తి తగ్గింది. మొదట్లో ఐదు మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ... బిహార్ ఎన్నికల ఓటమి తర్వాత శివసేన నుంచి మరో ఇద్దరికి అవకాశం ఇచ్చింది. వాస్తవానికి మహారాష్ట్రలో ఎప్పుడూ శివసేనదే పెద్దన్న పాత్ర. వీరి సంకీర్ణం అధికారంలో ఉన్నపుడు కూడా శివసేనకు చెందిన మనోహర్ జోషి, నారాయణ్ రాణేలను సీఎంలుగా చేశారు. అలాంటిది శివసేనకు తమ ప్రాధాన్యం తగ్గడం మింగుడు పడటం లేదు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ బెదిరింపులకు లొంగేరకం కాదు. ప్రభుత్వంలో చేరినా, బీజేపీ నిర్లక్ష్య ధోరణితో శివసైనికులు లోలోపల కుతకుతలాడిపోతున్నారు. పెరిగిన దూరం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే శివసేన... బీజేపీతో చాలా అంశాల్లో విభేదించింది. ప్రధాని మోదీ నిర్ణయాలపై బహిరంగంగానే విరుచుకుపడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, సర్జికల్ స్ట్రైక్స్.. ఇలా పలు అంశాల్లో మోదీ నిర్ణయాన్ని తమ పత్రిక ‘సామ్నా’లో శివసేన తూర్పారబట్టింది. ఎన్డీయే భాగస్వామిగా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నా ఏనాడూ మిత్రధర్మం పాటించలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో శివసేన గొంతు కలిపింది. పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌తో గుజరాత్లో కలిసి వెళ్తామనే సంకేతాలు ఇవ్వడం, గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టి పోటీ చేయడం... ఇరుపార్టీల మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచించేవే. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో (మంగళవారం పోలింగ్ జరుగుతుంది) సీట్ల పంపకం కుదరక ఇరుపార్టీలు వేరువేరుగా పోటీచేస్తున్నాయి. గడిచిన 20 ఏళ్లుగా బీఎంసీలో శివసేనదే అధికారం. తమకు పెట్టని కోటగా ఉన్న ముంబై మీద బీజేపీ కన్నేయడం శివసేనకు రుచించలేదు. దీంతో ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు. దూషణల పర్వం మొదలైంది. ఫడ్నవీస్‌ను మిడిమిడి జ్ఞానం కలిగిన మూర్ఖుడిగా ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించగా... శివసేన మామూళ్లు వసూలు చేసే పార్టీ అని మహారాష్ట్ర బీజేపీ ధ్వజమెత్తింది. ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి ఏ క్షణాన్నైనా వైదొలుగుతామని ఉద్ధవ్ ప్రకటించారు. అయినా బీజేపీ దూకుడు తగ్గలేదు. శివసేనపై ముప్పేటదాడికి దిగింది. అవినీతిలో కూరుకుపోయిన బీఎంసీలో అభివృద్ధి చేసి చూపెడతామని ఫడ్నవీస్ ఓటర్లకు హామీ ఇచ్చారు. శివసేన... చెప్పింది చేస్తుందా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామని శివసేన ప్రకటించింది. కాబట్టి సందర్భం చూసి ప్రభుత్వం నుంచి వైదొలిగి సొంతబలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తే పూర్వ వైభవాన్ని సాధించగలమని విశ్వసిస్తోంది. అయితే ప్రస్తుతం ముంబైతో పాటు మరో తొమ్మిది కార్పొరేషన్లు, 26 జిల్లా పరిషత్‌లకు జరిగే ఎన్నికల ఫలితాలు ఈనెల 23న రానున్నాయి. పట్టణ, గ్రామీణ ఓటర్ల నాడి వీటిద్వారా తెలుస్తుంది కాబట్టి, వీటిలో మంచి ఫలితాలు సాధిస్తే శివసేన వెంటనే ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకవేళ ముంబై కార్పొరేషన్లో (మొత్తం 227 స్థానాలు) సొంత మెజారిటీ రాక... బీజేపీ మీద ఆధారపడాల్సి వస్తే మాత్రం బలవంతపు కాపురం తప్పదు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే కూడా శివసేన స్వరం పెరుగుతుంది, మరిన్ని డిమాండ్లు ముందుకు తేవొచ్చు. ఎన్సీపీ మాటపై నిలబడుతుందా? శివసేన వైదొలిగితే... ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని, మధ్యంతర ఎన్నికలకే మొగ్గుతామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈనెల 18న నొక్కిచెప్పారు. ప్రజల మద్దతు కోల్పోయిన ఫడ్నవీస్ ప్రభుత్వం కూలిపోవడమే తమకు కావాలన్నారు. అయితే అవకాశవాద రాజకీయాలకు పేరుపడ్డ ఈ రాజకీయ దురంధరుడు ఎంతవరకు మాటపై నిలబడతారనేది ప్రశ్నార్థకం. గతంలో ఎన్డీయేతో అధికారం పంచుకున్న పవార్... తర్వాత యూపీఏ పంచన చేరారు. 2014లో ఫడ్నవీస్ ప్రభుత్వానికి బయటినుంచి బేషరతు మద్దతు ఇచ్చారు. పైగా ప్రధాని మోదీతో పవార్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. పవార్ కూతురు సుప్రియా సూలే నియోజకవర్గం బారామతికి ప్రధాని వచ్చివెళ్లారు. ఇటీవలే కేంద్రం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే పవార్ చెప్పింది ఎంతవరకు చేతల్లో చూపుతారనేది రాజకీయ పండితుల సందేహం. ఫడ్నవీస్ ధీమా ఏంటి? వైదొలుగుతామని శివసేన, మద్దతు ఇవ్వబోమని ఎన్సీపీ ప్రకటించినా... సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ధీమాగానే ఉన్నారు. ఈ రెండు పార్టీలు దూరంగా ఉండే పరిస్థితి వస్తే ఫడ్నవీస్‌కు మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం 145. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని కూడగట్టడం ఏమంత పెద్ద పని కాదని శనివారం ఫడ్నవీస్ స్వయంగా అన్నారు. చిన్నాచితకా పార్టీలకు 13 మంది, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. అలాకాకుండా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ఎమ్మెల్యేలకు అవసరమైన పక్షంలో వల వేసే స్థితిలో ఫడ్నవీస్ ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రం అండ ఎటూ ఉంటుంది. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నందువల్ల ఇప్పుడే శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగదనేది ఫడ్నవీస్ అంచనా. ఒకవేళ వైదొలిగితే ... శివసేన ఎమ్మెల్యేలకే మంత్రి పదవుల ఎరవేసి చీలిక తెచ్చే యోచనలో కమలం శిబిరం ఉంది. చీటికి మాటికి బెదిరింపులకు దిగే శివసేనను దెబ్బకొట్టి మహారాష్ట్రలో బీజేపీ ఆధిపత్య రాజకీయాలను నడపాలనే దీర్ఘకాలిక వ్యూహంతో ఉంది కాబట్టే మిత్రపక్షంతో అమీతుమీకి సిద్ధమైందనే వాదన కూడా ఉంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయనేది... ఈ నెల 23న వెలువడే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాబలాలు పార్టీ స్థానాలు బీజేపీ 122 శివసేన 63 కాంగ్రెస్ 42 ఎన్సీపీ 41 చిన్న పార్టీలు 13 స్వతంత్రులు 7 మొత్తం 288 – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాంగ్రెస్ నేతల రహస్య భేటీ?
శంకర్పల్లి,న్యూస్‌లైన్: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రాజకీయ సమీకరణాల కోసం వివిధ పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈమేరకు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, ఎమ్యెల్సీ యాదవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య ఇతర ముఖ్యనేతలు హాజరయినట్లు తెలిసింది. సోమవారం వెలువడనున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు , మంగళవారం వెలువడనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఆ తరువాత అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఎంపీపీ స్థానాలతోపాటు, జెడ్పీటీసీ చైర్మన్‌గిరి కైవసం చేసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. అయితే సమావేశానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు నాయకులు నిరాకరించారు.