
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదుల (కంప్లెయింట్స్, గ్రీవెన్స్ సెల్) విభాగాన్ని ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, సందేహాల నమోదుకు దీనిని ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ కార్య దర్శి అశోక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఈ సెల్ 24 గంటలు పని చేస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించిన సందేహాల నివృత్తికి, ఫిర్యాదుల నమోదుకు 040–29802895, 040–29802897 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment