సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం ఇక్కడి ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ పూర్తయ్యాక ర్యాండమైజేషన్ చేపట్టాలని, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నార
Comments
Please login to add a commentAdd a comment