State Election Commissioner Nagi Reddy
-
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం ఇక్కడి ఎస్ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ పూర్తయ్యాక ర్యాండమైజేషన్ చేపట్టాలని, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నార -
కౌంటింగ్ తర్వాత 3 రోజుల్లోనే..
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీల ఎంపిక అంశంపై అఖిలపక్షం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. ఈ నెల 27న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మూడు రోజుల్లోనే జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి అఖిలపక్ష బృందం విజ్ఞప్తి చేసింది. జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకున్నాక జూలై మొదటివారంలో వారు పదవి స్వీకరించేలా చూడాలని, లేనిపక్షంలో కౌంటింగ్‌ను వాయిదా వేయాలని సూచించింది. కౌంటింగ్ పూర్తయ్యాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తే కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేసే అవకాశముందని పేర్కొన్నాయి. ఈ మేరకు శుక్రవారం నాగిరెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, ఎం.కోదండరెడ్డి, జి.నిరంజన్ (కాంగ్రెస్), ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ), పల్లా వెంకటరెడ్డి (సీపీఐ), డాక్టర్ చెరుకు సుధాకర్(తెలంగాణ ఇంటి పార్టీ), ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు(టీజేఎస్), కె.గోవర్థన్ (న్యూడెమోక్రసీ) వినతిపత్రం సమర్పించారు. విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారు... రైతుల పొలం పనులు, వర్షాకాలం వచ్చేలోగా ఎన్నికలు పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఎస్ఈసీ పరిషత్ షెడ్యూల్ విడుదల చేసినట్టు నాగిరెడ్డి చెప్పారని అఖిలపక్షనేతలు మీడియాకు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలనే విషయంపై అఖిలపక్ష బృందం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారని వారు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఫలితాలు ప్రకటించాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక చేపడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అధికారపార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశముంటుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. పరిషత్ ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో చైర్పర్సన్ల ఎన్నిక జరిగేలా చూడాలని కోరినట్లు చెప్పారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నల్లధనం, పోలీసులను ప్రయోగించి అధికారపార్టీ అప్రజాస్వామిక పద్ధతుల్లో ఇతర పార్టీ ల నాయకులను చేర్చుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి, 3 రోజుల్లో జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని జూలై 5 తర్వాత బాధ్యతలు చేపట్టేలా చూడొచ్చని సూచించామన్నారు. గత 11 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వమనేదే లేదని, జూలైలో మున్సిపల్ ఎన్నికలు పెడతామని ఎన్నికల కమిషన్ చెబుతోందని షబ్బీర్ అలీ అన్నా రు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యా యని ఆరోపించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, జెడ్పీలు, ఎంపీపీల ఎన్నిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిషనర్‌ను కోరినట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చట్టా లంటే ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. -
జెడ్పీ, మండల ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మే నెల చివరికల్లా ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు అవసరమైన సంసిద్ధతను ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈ సీ) తెలియజేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 27 లోగా రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయ తీల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితా లను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీఓ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. రాష్ట్రం లోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించేలా చర్యలు తీసుకోవా లని శనివారం ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పీఆర్‌శాఖ ముఖ్యకార్య దర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (హైదరాబాద్ మినహా), సీఈఓలు, ఎంపీడీఓలకు సమాచారం పంపించారు. 2019 జనవరి 1 కల్లా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరున్న వారిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఈ నెల 22న ›ప్రకటించిన (2019 జనవరి 1 ప్రాతిపదికగా) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా వాటిని తయారు చేయాలని నాగిరెడ్డి సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచిం చిన మేరకు వార్డుల విభజన పూర్తి చేయాలని నిర్దేశించారు. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ను మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా మండలాల స్థాయిల్లో ఎంపీడీఓలు, జిల్లా పరిషత్‌ల స్థాయిలో సీఈఓ లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఓటర్ల జాబితాలను సంబంధిత మండల, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుం ది. వచ్చేనెల 27న ఫోటోలతో కూడిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదర్శించాక, నోటిఫికేషన్ వెలువడే నాటికి అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఏవైనా చేర్పులు, తీసివేతలు లేదా సవరణల విషయంలో ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి ఆదేశాలు ఇచ్చి ఉంటే వాటిని కూడా డీపీఓలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుం దని స్పష్టంచేశారు. ఆ మేరకు సంబంధిత గ్రామపంచాయతీ వార్డుల ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని సూచించారు. జెడ్పీ,ఎంపీటీసీ ఎన్నికలు ఇలా... రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల(పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ మినహాయిం చి) ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిష త్ల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను ముం దుగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా జెడ్పీ టీసీలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించడంతో దానిపై జిల్లా కలెక్టర్లు చేసిన కసరత్తు పూర్తికావొచ్చింది. కొత్త గా ఏర్పాటైన రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణపై క్షేత్రస్థాయి పరిస్థి తులు పరిగణనలోకి తీసుకుని వీటిని పూర్తి చేస్తు న్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధం కాగానే పోలిం గ్స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత జెడ్పీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల తేదీలు ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఇదీ షెడ్యూల్ - మార్చి 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా (డ్రాఫ్ట్) ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాలి - మార్చి 17–20 తేదీల మధ్య గ్రామీణ అసెంబ్లీ ఓటర్లను వార్డులు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చడం పట్ల ఏవైనా అభ్యంత రాలుంటేస్వీకరణ - మార్చి 18న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారుల సమావేశం - మార్చి 19న మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓల సమావేశం - మార్చి 23న ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని డీపీఓలు పరిష్కరించాలి - మార్చి 27న డీపీఓలు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి - మార్చి 30న మండల ప్రజా పరిషత్ పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ పరిధిలోని జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల (జెడ్పీటీసీ) వారీగా ఫోటో ఓటర్ల జాబితాను సీఈఓలు, తయారు చేసి సంబంధిత మండల, జిల్లా పరిషత్ కార్యా లయాల్లో బహిరంగంగా ప్రదర్శించాలి. -
సర్పంచ్ ఎన్నికలు: బ్యాలెట్ పేపర్‌పై మరో గుర్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూలైలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా నోటా (పై వారెవరూ కాదు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంతవరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనే నోటా ఆప్షన్ ఉందని, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఆప్షన్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ చివరన ‘నోటా’ గుర్తు ఉంటుందని, పైన పేర్కొన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు నోటాను ఎంచుకోవచ్చని ఆయన సూచించారు. నోటా వల్ల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ప్రజల్లో ఏమేరకు అసంతృప్తి ఉందో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1 నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తి ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో నోటాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. జూలై నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇటీవల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణల కారణంగా 30 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ఇతర రాష్రాల నుంచి కూడా బలగాలను తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. ఎన్నికలు ముగిసే వరకూ రాష్ట్రంలో కొత్తగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన పంచాయతీ సీట్లను కేటాయించడానికి జూన్ 1నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తవుతుందని నాగిరెడ్డి తెలిపారు. -
ఓటుతోనే సమాజంలో మార్పు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మణికొండ: మనతో పాటు చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందాలంటే మనమంతా ఓటు వేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాలలో ‘లెట్స్ ఓట్’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓటర్ల జాగృతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందమైన సమాజం, మానవవిలువలు, హక్కులు, ఆనందాలు, సుఖమయ జీవనం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారన్నారు. అలాంటి పౌర సమాజాన్ని నిర్మించుకునేందుకు ఉన్నత విలువలు, సమస్యల నివారణకు కృషి చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మార్పులు తెచ్చే పనిలో భాగమైన ఓటు వేయడాన్ని పక్కనపెట్టి మారిపోవాలని ఆశించటం అతిశయోక్తే అవుతుందన్నారు. ఓటింగ్‌లో అందరూ పాల్గొంటే భిన్నమైన ఫలితం వస్తుందని చెప్పారు. అరోరా కళాశాల విద్యార్థులు ‘కౌన్‌బనేగా కార్పొరేటర్?’ అనే కాన్సెప్ట్‌తో వెబ్సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారని తెలిపారు. శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిలు ఇంటింటికీ తిరిగి ఓటు హక్కు విలువను చెప్పేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అలా వెళ్లే వారి బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని వారరు ప్రతినబూనారు. ఓటు హక్కుపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘లెట్స్‌ఓట్’ సంస్థ ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, సుబ్బరంగయ్య, కళాశాల ప్రిన్సిపాల్ మల్లీశ్వరి, విద్యార్థినిలు పాల్గొన్నారు.