
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా సోమ, మంగళవారాల్లో (6,7వ తేదీలు) జరి గే ఓయూ పరిధిలోని పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇతర పరీక్షల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.