సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్‌కో తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలనుకుంది. కానీ, అదే రోజు మరికొన్ని పరీక్షలు ఉన్నాయి. దీంతో పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి జెన్‌కోకు విజ్ఞప్తులు వచ్చాయి. అదే సమయంలో తాజాగా కొందరు అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు.
దీంతో పరీక్ష వాయిదా వేసేందుకే జెన్‌కో మొగ్గు చూపింది. అయితే తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు. కానీ, జెన్‌కో వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను పెడతామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment